బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నము నాయిడు గారు. - ambadipudi syamasundar rao

బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నము నాయిడు గారు.

తెలుగు నేలపై పుట్టిన సంఘ సంస్కరణోద్యమాలకు నాయకత్వము వహించిన మహాపురుషులలో రఘుపతి వెంకట రత్నమునాయుడు  గారు ముఖ్యలు అప్పట్లో వంగ (బెంగాల్) దేశములో పుట్టిన ధ్వని అంగ,వంగ. కళింగ కాశ్మిరాలలో  ధ్వనించి దక్షిణాదిన ప్రతిధ్వనిస్తుంది అని నానుడి ఉండేది 'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘ సంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులు గారితో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిదే దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొకవైపు ఆవరించి, సమాజం అంధకార బంధురమై  ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్సనం కోసం ఎదురుచూస్తున్న రోజులు 19 శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేసినవి రెండు దివ్యజ్యోతులు. తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి పునరుజ్జీవింపచేసిన నవయుగ వైతాళికద్వయం శ్రీ వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకతరత్నం నాయుడు గారు వంగ దేశములో పుట్టిన సంఘ సంస్కర్త రాజా రామ మోహన రాయ్ విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించి బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు ఆంధ్రులలో ఆ ఉద్యమానికి ఆకర్షితుడైన వాడు రఘుపతి వెంకట రత్నము నాయుడు గారు
ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1 న మచిలీపట్నంలో సుప్రసిద్ద తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తర భారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం మహారాష్ట్రలోని చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశంతో బహుభాషా కోవిదుడు అయినాడు  తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారు ఆమె
ఎం.ఏ,.ఎల్. టి పూర్తి  కాగానే ఉపాధ్యాయ వృత్తి పట్ల గల అభిమానంతో కొంతకాలము కందుకూరి వీరేశలింగము గారు స్థాపించిన హితకారిణి పాఠశాలలోను, ఆ తరువాత మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు బందర్ నోబుల్ కళాశాలలోనూ, సికిందరాబాద్ లోని మెహబూబ్ కళాశాల అధ్యక్షుడిగాను పనిచేశారు. 1904లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. 1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1924లో బ్రిటిష్ ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు. 1927లో పరిషత్తు మొదటి స్నాత కోత్సవం లో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - వేమూరి రామకృష్ణారావు జంటని తప్పకుండా చెప్పుకుంటారు.అయన హృదయము వెన్న వంటిది అయినా క్రమశిక్షణ పట్ల అతి కఠినముగావుండేవారు పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయము చేసేవారు. ఆయనను విద్యార్థులు కేవలము ఉపాధ్యాయుడిగామాత్రమే కాకుండాఒక గొప్ప ఉపదేశకుడిగా గౌరవించేవారు. 1884లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడు గారికి పెళ్ళయింది.వీరికి ఒక కుమారుడు, కుమార్త్తె కలిగారు  1889లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు. జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించేవారు అందుచేతనే ఆయనకు శ్వేతాంబర ఋషి అనే బిరుదు ఉండేది.అప్పటినుండి ఒక విధమైన ఆధ్యాత్మిక జీవన సాధనలో నిమగ్నమైవుండటం చేత ఆయనను బ్రహ్మర్షి అనేవారు  పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.
నాయుడుగారు పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్ అనే ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వము వహించి ఆనాటి సాంఘిక సమస్యలపై గళమెత్తి ఎన్నో ప్రభోదాత్మక వ్యాసాలను ప్రచురించేవారు నాయుడు గారికి స్త్రీల విద్య పట్ల ఏంటో అభిమానము ఉండేది తన కళాశాలలో ఆడపిల్లలను విరివిగాచేర్చుకొని పురుషులతో సమానముగా స్త్రీలు విద్యనభ్యసించకపోతే సంఘము బాగుపడదు అని చెప్పి ఆ నీతిని ఆచరణలో పెట్టిన మహానుభావుడు నాయుడు గారు.అయన కాకినాడలో ఒక అనాధ శరణాలయాన్ని స్థాపించి ఎంతమందినో విద్యాధికులు చేసాడు. అంతేకాకుండా అప్పటి సమాజములో ఉన్న అంటరానితనాన్ని వ్యతిరేకముగా ఉద్యమాన్ని సాగించాడు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలలో ఒకటైన కుల వ్యవస్థ నిర్ములనకు ప్రయత్నిస్తూ కులాంతర వివాహాలను జరిపించాడు. సంఘ దురాచారాలవు ఒకటయిన వేశ్యావృత్తి నిర్మూలనకు కృషి చేసేవాడు అప్పట్లో ప్రాచుర్యములో ఉన్న భోగము మేళాలను ఆపించాలని ఉద్యమమం నడిపించి ప్రభుత్వమూ చేత వేశ్యావృత్తిని నిషేధించే చట్టాన్ని తెప్పించి అమలుకు కృషి చేసేవాడు. ఈయన సేవాకార్యక్రమాలు మెచ్చుకొని ఆనాటి బ్రిటిష్ ప్రభ్త్వము ఆయనకు రావు బహుదూర్ ,దివాన్ బహుదూర్,సర్ వంటి బిరుదులతో సత్కరించింది.ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు నాయుడు గారికి డి లిట్ , డాక్టర్ ఆప్  ఫిలాసఫీ బిరుదులూ ఇచ్చి సత్కరించారు
76 సంవత్సరాలు సంఘ సేవలో జీవితాన్ని గడిపిన నాయుడు గారు 'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు1939 మే 26 న  మరణించాడు.వీరి సోదరుడు అయిన రఘుపతి వెంకయ్య ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అందుచేతనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము సినిమారంగములో విశిష్ట కృషి చేసిన వారికి రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు