ఇద్దరు నోబెల్ గ్రహీతలను అందించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ - ambadipudi syamasundar rao

ఇద్దరు నోబెల్ గ్రహీతలను అందించిన సుబ్రహ్మణ్యన్

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ దురదృష్టము ఏమిటి అంటే అయన అమెరికన్ పౌరుడిగా నోబెల్ బహుమతి అందుకున్నాడు అంతే  కాకుండా ఆయన ఇద్దరి శిష్యులకు కూడా నోబెల్ బహుమతి వచ్చింది ఆ విధముగా తానూ నోబెల్ బహుమతి పొందటమే కాకుండా ఇద్దరు శిష్యులకు నోబెల్ బహుమతి సాధించటాని కృషి చేసిన ఉత్తమ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్  చంద్రశేఖర్ 1910 అక్టోబరు 19 న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మికి చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ కి పుట్టిన పదిమంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ గా లాహోర్లో పనిచేస్తున్నపుడు చంద్రశేఖర్ జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగారు  ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. తల్లి హెన్రిక్ ఇబ్సెన్ రాసిన “ద డాల్స్ హౌస్” అనే నాటికని తమిళంలోకి అనువదించిన విదుషీమణి. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో చెన్నైకి మారింది.చంద్రశేఖర్ పుట్టిన సంవత్సరమే ఆయన పరమపదించేరు. తాత వదలిపెట్టిన గణిత గ్రంథాలని చంద్రశేఖర్ ఎంతో అపురూపంగా జీవితాంతం దాచుకున్నారు.
చంద్రశేఖర్ బాల్యంలోనే పరిమళించేడు. చంద్రశేఖర్  చెన్నైలోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీయెస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. అప్పటికే అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి పుట్టింది. విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు
పదిహేను సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929 లోప్రచురించేడు. కాంప్టన్ అనే శాస్త్రవేత్త  మద్రాసు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చేడు. ఆ ఉపన్యాసం విన్న పందొమ్మిదేళ్ళ చంద్రశేఖర్ ప్రభావితుడై, “కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్ ప్రభావం” అనే పరిశోధనా పత్రం ప్రచురించేడు. ఈ పత్రం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫౌలర్ కంట పడింది. ఫౌలర్ సిఫార్సుతో చంద్రశేఖర్ కి ట్రినిటి కాలేజిలో ప్రవేశం లభించింది. ఇటు BSc (Hons) పట్టా పుచ్చుకున్నాడో లేదో అటు పెద్ద చదువులకని 1930 లో - 19 ఏళ్ల ప్రాయంలో) ఇంగ్లండ్ ప్రయాణం అయి వెళ్ళిపోయేడు.ఇంగ్లండు వెళ్లిన తరువాత మరొక మూడేళ్లు శ్రమించి, తన సిద్దాంతానికి, సమీకరణాలకి మెరుగులు దిద్దుతూ, 1933 లో పి. ఎచ్. డి పట్టా సంపాదించేడు. ఈ సమయంలోనే భౌతిక శాస్త్రంలో దిగ్గజాలనదగ్గ డిరాక్, బోర్ ప్రభృతులతో పరిచయాలు కలిగేయి.చంద్రశేఖర్ 1936, సెప్టెంబరులో లలితా దొరైస్వామిని వివాహమాడాడు. ఆమె ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు జూనియర్. వీరికి సంతానం లేదు.
ఎడింగ్టన్ అనే శాస్త్రవేత్త సమక్షంలో, ఒక సమావేశంలో తాను సాధించిన ఫలితాలని ప్రకటిస్తున్న సందర్భంలో ఎడింగ్టన్  అందరి ఎదుట  చంద్రశేఖర్ ప్రతిపాదిస్తున్న అవధిని అవహేళన చేసేడు.ఎడింగ్టన్ కి ఎదురు చెప్పి వయస్సులో చిన్నవాడైన చంద్రశేఖర్ ని సమర్ధించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది.ఇది జాత్యహంకారం తప్ప మరేమీ కాదని చంద్రశేఖర్ తనంత తానుగా తన జీవితచరిత్ర రాసిన ఆచార్య కామేశ్వర వాలికి చెప్పి బాధపడ్డారు.నలుగురిలోనూ జరిగిన ఈ పరాభవాన్ని తట్టుకోలేక చంద్రశేఖర్ ఇంగ్లండ్ దేశం వదలి, అమెరికా వెళ్లి, చేస్తున్న పరిశోధనాంశాల దిశ మార్చి, చికాగో విశ్వవిద్యాలయంలో భౌతిక విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు ఆ విధముగా ఇంగ్లండ్ కూడా ఈ మేధావిని కోల్పోయింది  పదవీ విరమణ చేసేవరకూ అక్కడే కొనసాగాడు.
అంతకు ముందు విస్కాన్సిన్ నగరంలోని యర్కిన్ ఖగోళ నక్షత్రవలోకన(అబ్జర్వేటరీ) లో పరిశోధకుడుగావుండేవాడు అప్పుడు చికాగో విశ్వవిద్యాల ఖగోళ శాస్త్ర విభాగానికి ఆచార్య పదవికి ఆయనకు ఆహ్వానము అందింది వారానికి రెండు రోజులు మాత్రమే క్లాసులు నిర్వహించాలి ఈయన ఉంటున్న విస్కాన్సిన్ నుండి చికాగోకు సొంతగా డ్రైవ్ చేసుకుంటూ 80 కిమీ లు ప్రయాణము చేయాలి చలి గాఉన్న సరే ఎంతశ్రమ కోర్చి చంద్రశేఖర్ అక్కడికి వెళితే అక్కడ కేవలము ఇద్దరే విద్యార్థులు ఉన్నారు ఆ విశ్వవిద్యాలయము వారు కేవలము ఇద్దరు విద్యార్థులకోసము ఇంట శ్రమకోర్చి మీరు రావటము ఎందుకు? యునివేర్సిటి నిభందలం ప్రకారము ఆచార్యుడు ఆ తరగతిని రద్దు చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు కానీ చంద్రశేఖర్ ,"లేదు నా దగ్గర చదువుకోవాలని వచ్చిన విద్యార్థులను నేను నిరాశ పరచలేను నేను శ్రమ పడతాము అంత ప్రాధాన్యమైన విషయము కాదు నేను విద్యార్థుల బ్యాగును ఆలోచించాలి"అని చెప్పి ఆరునెలల కాలములో ఒక్క తరగతి కూడా వదిలిపెట్టకుండా వారికి పాఠ్యాంశాన్ని పూర్తిచేసాడు ఈ సంఘటన అయన నిజాయితీ నిబద్ధతలకు నిదర్శనము అంతేకాదు ఆ విద్యార్థులు, చేన్  విన్ యాంగ్ ,సున్ డా లీ లు నోబెల్ బహుమతి పొంది తమ అధ్యాపకునికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలుతెచ్చిపెట్టారు తన శిష్యులు తనకంటే గోప్పవాళ్లుగా  లేదా తనతో సమానమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తే ఆ గురువుకు అంతకంటే ఆనందము ఏముంటుంది  
అరుణ మహాతార (రెడ్‌జెయంట్‌), శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌), బృహన్నవ్య తార (సూపర్‌నోవా), నూట్రాన్ తార,, కర్రి (కృష్ణ) బిలం (బ్లాక్‌హోల్‌) అనే దశలు ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందారు అంతకన్న ముందు 1966 లో అమెరికా జాతీయ విజ్ఞాన శాస్త్ర మెడల్ 1968 లో భారత ప్రభుత్వము ఇచ్చే  పద్మ విభాషణ్ పురస్కారం పొందారు 1985లో పదవీ విరమణ అనంతరం విశ్రాంత ఆచార్యుడుగా (ఎమిరిటస్ ప్రొఫెసర్ గా) పనిచేశాడు 1966లో ఆయన అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందుకున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. ఆయన సేవలకుగాను నాసా ఒక పరిశోధన ప్రయోగశాలకు ఆయన పేరు పెట్టారు.
వృద్ధాప్యంలో సైతం ఆయన న్యూటన్‌ సిద్ధాంతాలను విశ్లేషిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాసిన 'న్యూటన్‌ ప్రిన్సిపియా ఫర్‌ కామన్‌ రీడర్‌' సైన్స్‌ అభిరుచి ఉన్నవారందరూ చదవవలసిన పుస్తకం. ఆయన 1995 ఆగస్టు 21న షికాగోలో తన 85వ ఏట గుండెజబ్బుతో మరణించాడు.ఆ విధముగా చంద్రశేఖర్ గొప్ప శాస్తరవేత్త గానే కాకుండా మంచి ఉన్నతాశయాలు అకుంఠిత దీక్ష కలిగిన ఉపాధాయుడిగా కూడా పేరు సంపాదించు కొని తానూ నోబెల్ బహుమతి పొందటమే కాకుండా తన ఇద్దరి విద్యార్థులకు కూడా నోబెల్ బహుమతి రావటానికి దోహదపడ్డాడు.
అంబడిపూడి శ్యామసుందర రావు

మరిన్ని వ్యాసాలు

కొమర్రాజు లక్ష్మణ రావు.
కొమర్రాజు లక్ష్మణ రావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అమృతానికి మారుపేరు అమ్మ.
అమృతానికి మారుపేరు అమ్మ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం)
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!
- డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్
టంగుటూరి ప్రకాశం పంతులు .
టంగుటూరి ప్రకాశం పంతులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.
అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అట్టమీది బొమ్మ కథ
అట్టమీది బొమ్మ కథ
- డాక్టర్ కె.ఎల్ వి ప్రసాద్