తోటకూర - మల్లాది ఉష

Asparagus

తోటకూర మీద కథ ఏంటి అని ఆశ్చర్య   పోకండి.నిజమే మా తోట కూర .ఆ రోజుల్లో ఊరంతా కథలు కథలు గా చెపు కునే వారు.పెద్డ మేడ వాళ్ల కథ విన్నారా?  తోట కూర తిని పిచ్చెక్కిందిట.పాపం పెద్ద ఆవిడతో ఆడపిల్లలు ఉన్నరుట. ఈ విథంగా రకరకాల కథలు 

  1. అసలు జరిగిందేమిటంటే ,నేను ఇంటర్మీడియట్ చదువు తున్నరోజులు.మాఅమ్మ ,మా అన్నయ డిల్లి  వెళారు. మాఅమ్మమ్మ మాకు కాపలా. మేము ఐదుగురు అక్కచెళ్లెళ్ళం.ఇంట్లో కూరలు లేవు ఎవరెయ్డినా తెండిరా అని అందరిని అడిగింది. అందరికి  ఏదో కారణాలు,సాకులు.ఎవరికి వాళ్లం బిజీ పాపం.. ఆవిడ మాటలు ఎవ్వరం పట్టించు కోలేదు. ఇంతలో మా తోటమాలి వచ్చాడు వయస్సు లో పెద్దవాడు, వాడికి ఎవరూ లేరు, మా అమ్మ వాడికి పని ఇచ్చి డబ్బులిచ్చేది. మా తోట పని చేసే వాడు వాడు అమ్మమ్మ సమస్య తీర్చాడు .పెద్దమ్మ గారూ తోటలో  తోటకూర ఉంది తేనా అని అడిగాడుట ఆవిడ సమస్య తీరింది.అమ్మమ్మ కూర చేసింది 

మేమందరం బోజనానికి ఇంటికి వచ్చాము.వాళ్ళు గబగబా తిని వెళ్ళారు నాకు  వెధవ అలవాటు నెమ్మదిగా తినేదాన్ని,మా అమ్మమ్మ  నా కు కబుర్లు చెప్పుతూ అన్నం నోటో్్ల  కుక్కేది , ఆ రోజు కూడా అదే చేసింది.నేను ఆ రోజు మినిస్టరు గారు వసు్తన్నారు కాలేజిలో పాట పాడాలి హడావిడి మరి అమ్మమ్మ వినకుండా గిన్న కాళి చేసి వదిలంది 

  1. ఇంకేముంది సోఫాలో కుార్చున్న దాన్ని అక్కడే తూలి పోయాను. మా అక్కలు విపరీతంగా నవ్వులట. అమ్మమ్మ  తల తిరుగుతోంది అని మంచం మీద వాలి పోయ్దిుందిట చూసి మా అక్కలు పక్కింటికి వెళ్లి డాక్టరు కి ఫోను చేస్తామని వెాళ్ళారుట. పాపం  ఆవిడికి వీళ్ల స్తితి చూసి నీళ్లిద్దామని వెళ్లేటప్పటికి  వీళ్లు వాళ్ల ఇంట్లో పుస్తకా లు చింపి ఇంటికి వచ్చారుట. 

  1. ఇంతలో మా  చెల్లెలు స్కూలు నించి వచ్చిఇంట్లో అందరిని  చూసి కంగారు పడి ముందు అద్దె కున్నవాళ్లకి చెప్పి  ఊళ్లో ఉన్న మా బాబా్య్ గారి అబ్బాయ్య కి చెప్పిందిట. మా కింద అద్దెకున్న వాళ్లు వచ్చి వెండి సామాను బీరువాలో పెట్టి తాళం వేసి ఇంటికి తాళం వేసి కూర్చున్నారుట 

  1.                మా కజ్జిన్ వచ్చి అమ్మమ్మని ఆసుపత్రి కి ఎడ్మిట్ చేసి అమ్మకి ఫోను చేసారుట. వాళ్లు రైలు లో వచ్చేటప్పటికి  రెండు రోజులు పట్టింది.నాకు మెలుకువ వచ్చింది కానీ చేతులూ కాళ్లు కదల్లేదు 

  1.               అన్నయ్య మామయ్యకి ఫోను చేసాడు.మా మామయ్య లాయరు.సహజంగా వ్రుత్తి పరంగా లాయరు అవ్వటంతో ఏం తింటే ఇలా అయ్యంది  అని ఆరా  తీసారు. ఇలా ఎందుకయ్యిందని రిసర్చ్  చేసారు 

  1.        మా  పక్క మేడలో  ఫార్మా కంపెనీ ఉండేది వాళ్లు మందులు ఎండ పెట్టేవారు. వాళ్ళ మందులు ఏమయ్యనా మా తోటలో పడ్డాయా? తోటకూర  వేసిన చోట కలుపు మొక్కలు  మొలిచాయా?అవి చూడకుండా మాలి కోసాడా? 

  1.  మా మామయ్య రిసర్చలో తేలిందేమిటంటే తోట కూరలో ఉమ్మెత్తాకు కలిసిందిట.ఉమ్మెత్త ఆకు మెదడు మీద పని చేస్తుందట. శారీరిక  ఆరోగ్యంలో మెదడు కీలక పాత్ర వహిస్తుంది. అందుకే అది మా అందర్నీ రక రకాలుగా హింసించింది. 

  1.        మా అమ్మమ్మ  మైకం లోకి వెళ్లింది, నాకు రెండేళ్లు నరాల బలహీనతతో కాలి వేళ్లు మెలి తిరిగేవి నడవలేక పోయే దాన్ని.భగవంతుడి దయ వలన మా అక్కలు కోరుకున్నారు.ఉమ్మెత్త చాలా డేంజరండోయ్. మా మామయ్య చెప్పిన విషయం ఏమిటంటే కోర్టు కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఉమ్మెత్త ఇస్తారుట. ఇదండీ మా తోట కూరకధ 

  1.     ఇదంతా చదివి తోటకూర తినటం మానలేదండోయ్ ఇవ్వాళ మా ఇంట్లో తోట కూర పులుసేనండోయ్.