కాకూలు - సాయిరాం ఆకుండి

ఉగ్రవాతం
ఉరుముతున్న ఉగ్రవాదం...
వణుకుతున్న జనానీకం!

కట్టుకున్న శాంతిలోకం...
కనుమరుగైతే తీరనిశోకం!!


అనర్హతార్హులు
అర్హతలేని వారిని ఎక్కిస్తే అందలం...
అష్టకష్టాల పాలవుతాం అందరం!

అరచేతిలో చూపిస్తారు అంబరం...
ఆలోచించి ప్రయోగించు అంకుశం!!

పద'వినాయకులు'
అమ్మో మన నాయకులు...
అసలైన హిట్లర్ వారసులు!

పదవులు విడువని పాలకులు...
ప్రజలంటే పట్టింపే లేదసలు!!