బోయిభీమన్న - డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

Boyi Bhimanna

1911 సెప్టెంబర్ 19 న తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా మామిడికుదురులో నాగమ్మ పల్లయ్య దంపతులకు భీమన్న జన్మించిరు. వీరు పాండవులలా అయిదుగురు అన్నదమ్ములు, వారి పేర్లు కూడా పాండవుల పేర్లే, ఒకఆడపిల్లా. 1935లో బి.ఏ. 1937లో బి.ఇడి. పూర్తి చేసాడు. బోర్డు హైస్కులులో ఉపాధ్యాయుడిగా, ఆంధ్రప్రదేశ్ అనువాదవిభాగం డైరెక్టరుగా, రిజస్ట్రార్ ఆఫ్ బుక్స్ గా 1964 వరకు పనిచేసారు.రచయితగా 70 పుస్తకాలు రాసారు. పలు నాటకాలు రాసారు. ఆకాశవాణిలో పలు రచనలు ప్రసారమయ్యాయి. అంబేద్కర్ గారి ఆంగ్ల రచనలు కొన్ని వీరు తెలుగు లోనికి అనువాదించారు. పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారు సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి వీరి రచనలు అన్నింటిని ప్రచురిస్తున్నారు. ' గుడిసెలుకిలిపోతున్నాయి' కేంద్ర సాహిత్య ఆకాడవి అవార్డురచన (1973) 'కూలిరాజు' (1946) 'రాగవసిష్టం' 'రాభీలు' 'భీమన్న ఉగాదులు' 'భీమన్న కావ్యకుసుమాలు' 'మోక్షం నా జన్మహక్కు' 'చివరి మెట్టు మీద శివుడు' 'కూలి శతకం' 'రాగోదయం' 'మధుబాల' 'మధుగీత' 'దీపసుధ' -రాఖీలు - జానపదునిజాబులు - మానవుని మరో మజిలి - పైరుపాట - అనార్కలి - పాలేరు - అసూయ - ప్రగతి - పడిపోతున్న గోడలు - ఆది కవి వాల్మికి - వేదవ్యాసుడు - ధర్మవ్యాధుడు - బాలయోగి - చిత్రకళా ప్రదర్శనం - వచన రచనలు - ఏకపద్యోపాఖ్యానం - ఇదిగో ఇది భగవద్గీత - జన్మాంతరవైరం - ధర్మం కోసం పోరాటం - అంబేద్కరిజం - అంబేద్కరమతం. ఈ మహనీయునికి కళా ప్రపూర్ణ(1971), పద్మశ్రీ(1973), కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ (1976), కేంద్ర సాహిత్య పురస్కారం - నాగార్జునా విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ (1991), పద్మభూషణ్ (2001), తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు(2004), తెలుగు భాషా సాహిత్యానికి వన్నె తెచ్చిన ఈ మహనీయుడు 2005 డిసెంబర్ 16 న హైదరాబాద్ లో శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు. మహనీయులు మరణించినా నేటికి వారు మనందరికి చిరంజీవులే!