నీకెంత ? నాకెంత ? . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

నీకెంత ? నాకెంత ? .

నీకెంత ? - నాకెంత ? .

అవంతి రాజ్యాన్ని గుణశేఖరుడు పరిపాలిస్తుండేవాడు ,ఒక రోజు అవంతి రాజ్యంలోని రైతులు రాజును కలసి "ప్రభు మన రాజ్యంలోని వ్యాపారులు మాకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు కనీసిం ఇప్పుడు ఉన్న ధరలపై మరో ఐదు శాతం కలిపి ఇచ్చేలా చేయమని విన్నపం " అన్నారు . "మీకు త్వరలోనే న్యాయం కలుగజేస్తాను వెళ్ళిరండి అన్నాడు రాజు.

రాజుగారి కబురందుకుని రాజ్యంలోని వ్యాపారవేత్తిల సంఘనాయకులు రాజువద్దకువచ్చి ఆయన చెప్పినదివిని "మహరాజా రైతులకు ధరపెంచితే మేము నష్టపోతాము ఉన్నరు "అన్నారు. ఎవరికి ఇబ్బది లేకుండా ఇలాచేయండి "అనివివరించాడు రాజు.

మరుసటి వారం ధరలు ముఫై శాతం పెరగడంతో ప్రజలు రాజసభకు వెళ్ళి పెరిగిన ధరల గురించి రాజు గారికి వివరించారు. " మేము ఆవిషయమే వ్యాపార సంఘ నాయకులతో మాట్లాడుతున్నాం ఇంతలోనే మీరంతా వచ్చారు ,వ్యాపారసంఘనాయకులారా ముఫైశాంతం ధరలు పెంచితే పేదప్రజల మనుగడకు కష్టంకాదా అందుకని అందరికి సమ్మతమయ్యేలా నేను ఓతీర్పు చెపుతాను పెంచినధరలు సగం తగ్గించాలి అంటె ముఫై శాతం పెంచిని ధరలు పదిహేను శాతానికి తగించాలి " అన్నాడు. సరే అని తలఊపారు వ్యాపార సంఘ నాయకులు. " గుణశేఖర మహారాజులకు జై " అటూ ప్రజలు నిత్యావసర వస్తువుల వెల తగ్గినందుకు సంతోషంగా రాజ సభనుండి వెళ్ళిపోయారు.

అనంతరం ఏకాంతంగా వ్యాపారులను కలసిన రాజు " వ్యాపారులు అర్ధమైయిదికదా పెరిగిన పదిహేను శాతంలో రైతులకు ఐదు, మాఖజానాకు ఐదు,మీకు ఐదు శాతం" అన్నాడు . " సమ్మతమే ప్రభు "అన్నారు వ్యాపార సంఘనాయకులు .

చిన్నగా నవ్వుకున్న మంత్రి సుబుధ్ధి ' ఔను అమాకులైన ప్రజలు ఎప్పుడూ ఇలానే అన్నింటిలోనూ మోసపోతూనే ఉంటారు "అని తనమనస్సులో అనుకున్నాడు.

బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

మరిన్ని కథలు

59 rujulu
59 రోజులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్