నాటి ద్విపాత్రల సినిమాలు.
సినిమాలలో ఈ ప్రక్రియ విశేష నైపుణ్యాన్ని సంతరిచుకొంది. ఎందుకంటే ఒకే ఫ్రేములో రెండు పాత్రలనూ చూపే అద్భుతాన్ని ఛాయాగ్రాహకులు సాధించారు గనుక. తెలుగు సినిమాలలో ఇది దర్శకులకూ, నటులకూ, ప్రత్యేకించి ఛాయాగ్రాహకులకూ ఒక సవాలు అయింది. కొన్ని చోట్ల హీరోయిజాన్ని సమతుల్యం చేయడానికీ, మరి కొన్నిచోట్ల కథలో అనుకోని మలుపులు తిప్పడానికీ, కొన్నిచోట్ల నాయకుని ప్రతిభను బహుముఖంగా ప్రదర్శించడానికీ ఈ ప్రక్రియ వాడ బడింది. కవలపిల్లల పాత్రలు ఈ అభినయానికి పట్టుగొమ్మలైనాయి. తెలుగు దర్శకులు ఈ ప్రక్రియతో ఎన్నో ప్రయోగాలు చేశారు.
భారతీయ సినిమాలలో తొలి ద్విపాత్రాభినయము 1923 లో విడుదలైన మూకీ చిత్రము, పత్నీ ప్రతాప్లో నటి, పేషన్స్ కూపర్ చేసినది.
ద్విపాత్రాభినయాన్ని మరికాస్త విస్తరిస్తే మూడు, నాలుగు .. ఇలా ఎన్ని పాత్రలైనా ధరించవచ్చును. తమిళంలో శివాజీ గణేశన్ 9 పాత్రలు ఒకే సారి ధరించారు. తెలుగులో నందమూరి తారక రామారావు సినిమా దానవీరశూరకర్ణ ఈ విధమైన బహుపాత్రాభినయంలో ఒక మచ్చుతునక.
నాటి తెలుగు ద్విపాత్రల కొన్ని చిత్రాల పరిశీలిద్ధాం!.
మునిపల్లె సుబ్బయ్య . భక్త ప్రహ్లద . 1931.
* తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు. ఈయన వెంకటగిరి రాజా వారిచే "నటశేఖర" బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు సుబ్బయ్యనే.
1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య స్వగ్రామమైన మునిపల్లెకు తిరిగివచ్చాడు. హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (భక్తప్రహ్లాద సినిమాలో ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్ళి సుబ్బయ్యను బొంబాయికి తీసుకుని వచ్చాడు.
1931లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్యకశపునిగా నటించి మునిపల్లె వెంకటసుబ్బయ్య చరిత్ర సృష్టించాడు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తెలుగు సినిమాలలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాడు. 1936లో రూపొందిన సతీ సులోచన అనే చిత్రంలో రావణబ్రహ్మగా, ఇంద్రజిత్‌గా అలరించి ఓ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు. ఆ తరువాత ద్రౌపదీ మానసంరక్షణం, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించాడు సుబ్బయ్య. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సతీ సావిత్రి'లో సుబ్బయ్య యమధర్మ రాజు పాత్రను పోషించాడు.
* సతీ సుకన్య.1959.
శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సతీ సుకన్య సినిమా 1959, జనవరి 30న విడుదలైంది.చంద్రమోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో అమరనాథ్,కృష్ణకుమారి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు .
ఈచిత్రంలో అశ్వని దేవతల రెండు పాత్రలలో కాంతారావు ద్విపాత్రాభినయం చేసారు.
ఇదే చిత్రంలో సూర్యుని ఇరువురి భార్యలుగా కుమారి ద్విపాత్రాభినయం చేసారు. ఈచిత్రంలో రమణారెడ్డికి మీనాకుమారి (అన్నాచెల్లెలు చిత్రం కథానాయకి ) మరియు నటి జయచిత్ర అమ్మగారైన అమ్మాజి
( నందమూరి వారి దైవబలం కథానాయకీలు ) చెలికత్తెలుగా,రమణారెడ్డికి భార్యలుగా నటించారు.
* అనుకున్నది సాధిస్తా . 1978, సెప్టెంబరు 2న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో లత ద్విపాత్రాభినయం చేసింది.పందిళ్ళపల్లి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నరసింహారాజు , లత జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.
* అప్పాజి .1996లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ చిత్రాన్ని శ్రీరాజ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.గోవిందరెడ్డి నిర్మించాడు. ఇదే పేరుతో డి.రాజేంద్రబాబు దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా దీనికి మూలం.ఈచిత్రంలో విష్ణువర్ధన్ ద్విపాత్రాభినయం చేసారు.
* ఆదిత్య 369 1991లో విడుదలైన తెలుగు సినిమా, హెచ్. జి. వెల్స్ 1895 నవల ది టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం ఇది. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందిందది.బాలకృష్ణ ద్విపాత్రాభినయం.
* ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది.
* ఎవరాస్త్రీ? కె.శంకర్ దర్శకత్వంలో 1966, మార్చి 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1958లో విడుదలైన అమెరికన్ సైకో థ్రిల్లర్ సినిమా వర్టిగో ఆధారంగా నిర్మించబడిన కలంగరై విలక్కం అనే తమిళ సినిమా దీనికి మూలం. బి.సరోజ ద్విపాత్రాభినయం చెసారు.
* కన్నయ్య కిట్టయ్య రేలంగినరసింహారావు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్
కన్నయ్యగా (శ్రీకృష్ణుడు), కిట్టయ్య(కథానాయకుడు) గా ద్విపాత్రాభినయం చేసిన 1993 నాటి హాస్యకథాచిత్రం.
* కొండవీటి సింహం.
నందమూరి వారు ద్విపాత్రాభినయం చేసారు.
* గంగ మంగ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసారు.
* గాలిపటాలు' తెలుగు చలన చిత్రం1974 మార్చి 1. న విడుదల.తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.సంగీతం టి.చలపతిరావు అందించారు.యస్ .వి.రంగారావు ద్విపాత్రిభినయం చేసిరు.
* గుణవంతుడు 1975 నవంబర్14 న విడుదలయినతెలుగు చలన చిత్రం . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, శోభన్ బాబు, మంజుల , అంజలీదేవి, కాంతారావు, ప్రభాకర్ ర్రెడ్డి మొదలగు వారు నటించగా, సంగీతం కె వి మహదేవన్ అందించారు.శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసారు.
* గోపాలుడు భూపాలుడు నందమూరివారు ద్విపాత్రాభినయం చేసారు.
* చండశాసనుడు నందమూరివారు ద్విపాత్రాభినయం.
* చారులత (2012 సినిమా)
చారులత పొన్ కుమరన్ దర్శకత్వంలో రమేశ్ కృష్ణమూర్తి నిర్మించిన సినిమా. ఇది కన్నడ, తమిళ భాషలలో నిర్మించబడి కన్నడ నుండి మలయాళ భాషలోనికి, తమిళ భాష నుండి తెలుగులోనికి డబ్ చేయబడి నాలుగు భాషలలో ఏకకాలంలో విడుదలయ్యింది. తెలుగు సినిమాను అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా 2012, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకు అలోన్ అనే థాయ్ సినిమా మూలం.ప్రియామాణి ద్విపాత్రాభినయం చేసారు.
* చిక్కడు దొరకడు 1988 లో వచ్చిన యాక్షన్ చిత్రం. మహేశ్వరి మూవీస్ కోసం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఎస్పీ వెంకన్న బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. రాజేంద్రప్రసాద్ ద్విపాత్రాభినయం చేసారు.
* చెప్పాలని ఉంది 2001, ఆగష్టు 23వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. రాసి ద్విపాత్రాభినయం.
* జ్యోతి - లక్ష్మి కె.ఎస్.రెడ్డి దర్శకత్వంలో స్వాతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఎస్.కె.వి.రెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1973, డిసెంబర్ 7న విడుదలయ్యింది.రామకృష్ణ , జ్యోతిలక్ష్మి,నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు. జ్యోతిలక్ష్మి ద్విపాత్రాభినయం.
* ధనవంతులు గుణవంతులు తెలుగు చలన చిత్రం 1974 సెప్టెంబరు 6 న విడుదల. కె.వరప్రసాదరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి వెంకటేశ్వరరావు, దేవిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించారు.సత్యన్నారాయణ ద్విపాత్రభినయం.
* పట్టిందల్లా బంగారం ,చలం ద్విపాత్రాభినయం.
* పిల్లజమీందార్ (1980 సినిమా) అక్కినేనివారు ద్విపాత్రాభినయం.
* పెదరాయుడు, మోహన్ బాబు ద్విపాత్రాభినయం.
* మనుషులంతా ఒక్కటే,నందమూరివారు ద్విపాత్రాభినయం.
*మాంగల్య భాగ్యం 1974, సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ పతాకంపై పద్మనాభం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుమతి, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ముత్తు,భానుమతి,సమకూర్చారు.రమాప్రభ ద్విపాత్రాభినయం .
* మానవుడు - దానవుడు (1972 సినిమా) శోభన్ బాబు ద్విపాత్రాభినయం.
* మూగకు మాటొస్తే 1980, డిసెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. ఇది 1976లో వచ్చిన వళ్వు ఎన్ పక్కమ్ అనే తమిళ సినిమాకు రీమేక్.జయసుధ ద్విపాత్రాభినయం.
* మూఢ నమ్మకాలు 1963 నవంబరు 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పద్మాలయ బ్యానర్ పై ఎం.ఎస్.శ్రీరాం నిర్మించిన ఈ సినిమాకు వి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.శ్రీరాం, కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 1961లో విడుదలైన పనితిరై అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. పనితిరై సినిమాకు మాతృక 1959లో విడుదలైన హిందీ సినిమా అర్ధాంగిని.బి. సరోజ ద్విపిత్రిభినయం చేసారు. * రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోషన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వంవహించాడు. సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.సూర్య ద్విపాత్రభినయం.
* రాముడు భీముడు (1964 సినిమా)నందమూరి వారు ద్విపాత్రాభినయం.
* రాముడు భీముడు (1988 సినిమా)బాలకృష్ణ ద్విపాత్రాభినయం.
స్త్రీ కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌లు నిర్మించిన తెలుగు సినిమా. 1973, ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.చంద్రకళ ద్విపాత్రాభినయం.
ఇలా రాణి రత్నప్రభ 'అంలిదేవి' ఇద్దరుమిత్రులు ' అక్కినేని' అగ్గిపిడుగు 'నందమూరి ' దేవత ' సావిత్రి ' ఇల్లాలు ' గీతాంజలి 'నవరాత్రి 'అక్కినేని ' ఉమాచండి గౌరి శంకరులకథ 'బి. సరోజ.
' రాజు పేద ' విచిత్ర సహాదరులు ' వంటి ఎన్నో ద్విపాత్ర చిత్రాలు మనలను అలరించాయి.
బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ . 9884429899

