తెలుగు తెర సీతమ్మ అంజలి దేవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

తెలుగు తెర సీతమ్మ అంజలి దేవి.

తెలుగు తెర సీతమ్మ అంజలి దేవి.(వర్ధంతి సందర్బంగా.) ఎందరో కళారత్నాలను నాటకరంగం సగర్వంగా సినిమా రంగానికి పంపింది. అలా నాటకరంగ నటిగా తననటజీవితాన్ని పద్నాలుగో ఏట ప్రారంభించిన అంజలి అనబడే అంజనీకుమారి 1927/ఏప్రియల్ / 24 న పెద్దాపురంలో జన్నించారు.వీరి తండ్రి నూకయ్య రంగస్ధల కళాకారుడు కావడంతో తనకుమార్తెను నటీమణిగా తీర్చిదిద్దే బాధ్యతను తనమిత్రుడు,రచయిత,సంగీత కళాకారుడు అయిన పెనుపాత్రుని ఆదినారాయణరావుకు అప్పగించారు.అలా కళలో ఓనమాలు నేర్పిన ఆదినారాయణ రావుగారినే అంజలి1941 వివాహం చేసుకున్నారు. అనంతరం సినిమా రంగంలో ప్రవేసించి తొలుత సి.పుల్లయ్యగారి దర్శకత్వంలో 1949 లో వచ్చిన'గొల్లభామ' చిత్రంలో మోహినిగా నటించారు.(ఈ చిత్రం నెట్ లో చూడవచ్చు.)అదేసమయంలో 'బాలరాజు'(1948) 'కీలుగుర్రం'(1949) 'రక్షరేఖ'(1949) చిత్రాలలో వ్యాంపు పాత్రలే పోషించారు.అనంతరం ఘంటసాల బలరామయ్యగారు నిర్మించిన 'శ్రీలక్ష్మమ్మకథ' చిత్రంలో తొలిసారి కథా నాయకిగా నటించారు.1950/ఫిబ్రవరి /26 న విడుదలైన ఈచిత్రం విజయం సాధించలేదు.అనంతరం బి.ఏ.సుబ్బారావు గారు నిర్మించిన 'పల్లెటూరిపిల్ల'(1950)చిత్రంలో కథానాయకిగా నటించారు.ఈచిత్రం విజయవంతం అయింది.అలా 'నిర్ధోషి' 'స్వప్నసుందరి'(1950) 'స్త్రీ సాహసం'(1951) 'పరదేశి' 'రేచుక్క'(1954) 'పాండురంగమహత్యం' 'అనార్కలి' 'సువర్ణసుందరి' 'పెళ్ళిసందడి' జయసింహా' 'జయంమనదే' 'చెంచులక్ష్మి' భీష్మ' సంఘం' 'రాజనందిని' పక్కింటి అమ్మాయి' 'ఇలవేల్పు' 'పెద్దరికాలు' 'చరణదాసి' 'కులదైవం'శుఖరంభ' నాగదేవత''సుమతి' 'సతీఅనసూయ' 'భూలోకరంభ' 'పరువు ప్రతిష్ట' వారసత్వం' వంటి వందలాది తెలుగు,తమిళం,కన్నడం,హిందీ , నటించారు.'లవకుశ' 'జయభేరి' 'భక్తజయదేవ' వంటి చిత్రాలను మరువలేము.నటిస్తూనే నిర్మాతగామారి,మోకప్ మ్యాన్ కే.గోపాలరావు ఆదినారాయణరావు గార్లతో కలసి 'అశ్వని పిక్చెర్స్'స్ధాపించి తెలుగులో 'మాయలమారి' తమిళంలో 'మాయక్కారి'నిర్మించారు.అనంతరం అంజలి పిక్చెర్స్ స్ధాపించి శివాజి గణేషన్ని పరిచయంచేస్తూ 'పరదేశి' చిత్రం తమిళంలోనిర్మించారు.అనంతరం 'పూంగోదై' నిర్మించారు.అలా పలుచిత్రాలు నటిస్తూ,నిర్మిస్తూ'పోలీసు అల్లుడు' (1994)చిత్రంతో తల్లిపాత్రలతో నటజీవితానికి స్వస్తిపలికారు.ఫిలింఫేర్ ,రామినేని,రఘుపతి వెంకయ్యనాయుడు,అక్కినేని,పురస్కారాలు,నాగార్జున విశ్వవిద్యా లయం వారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.1946 లో సంక్రాంతి భోగి పండుగనాడు అడుగిడిన వీరు 2014 న అదేరోజు కళామతల్లి గళసీమలో వెలుగొందే రత్నాల హారంలో ఓమేలిరత్నంగా వెలుగొందారు.ఏకళాకారుడికైనా జీవితంలో ఇంతకు మించి కావలసినదా ఏముంది.