జీవిత సత్యాలు. - చంద్ర శేఖర్ కోవూరు

జీవిత సత్యాలు. అంతంలేదు ఆరంభం మాత్రమే. తరాలు మారిన యుగాలు మారిన కొన్ని జీవిత సత్యాలు ఎప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. సామెత 1 ఎగిరెగిరి దంచినా అంతే కూలి మాములుగా నిలబడి దంచినా అంతే కూలి. సామెత 2 రాజు రాజు దొందూ దొందే . రాజులూ రాజులకు మధ్య ఎన్ని వైరాలు శతృత్వాలున్నా వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఒక్కటే. వాళ్ళ ఆలోచనలు నడవడిక పాలనా విధానం ఒకేలా ఉంటాయి. పక్కోడికి చెప్పేందుకే నీతులున్నాయ్ మనం దూకేందుకు గోడలున్నాయ్. ప్రతిఒక్కరిలో ఎదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని మనకి మాత్రమే కనపడతాయి. కొన్ని ఇతరులకు కూడా కనపడతాయి. ఎదుటివానిలో కనపడే వేపగింజంత లోపాన్ని భూతద్దంలో చూసి వారి లోపాన్ని వారుచేసే ప్రతి పనికి అనుసంధానం చేసి వారిని తక్కువగా చూడటం అనేది మనలో దృష్టి లోపానికి మానసిక పరిపక్వత లేకపోవటానికి నిదర్శనం. మనం మనం మనం అనే చాలామంది హృదయాల్లో ఆ మాటకి చోటే ఉండదు. కేవలం పై పెదవినుండి ఒచ్ఛే మాటలే అవి. మన శక్తికి మించి సహాయం చేసామంటే నలుగురిలో చులకన అవుతాము చివరికి సహాయం పొందినవాడికి కూడా. మనకి ఒకరి మీద ప్రేమ ఉంది అంటే వారు మనకి నచ్చనిది చెప్పినా మనం వింటాము. అది మన బలహీనత కాదు. మన ప్రేమకి మనమిచ్చే గౌరవం. అధికారంలో ఉండేవాడు ఎప్పుడైతే తన కింద వాడికి సరి అయిన సమాధానం చెప్పలేకపోతాడో అప్పుడే తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. నిజం నిష్టురంగా ఉంటుంది. అబద్దం అందంగా ఉంటుంది. అబద్దం చెప్పేవాళ్ళు అందలం ఎక్కుతారు. నిజం చెప్పేవాళ్ళు నిందలపాలవుతారు. కానీ ఇవి తాత్కాలికo మాత్రమే అంతులేని అభిమానం, ప్రాణం కంటే ప్రేమ, గుడ్డి నమ్మకం, ఎదుటివారికోసం ఏమైనా చేసే తత్వం, ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జీవితమంతా ఎదో ఒక త్యాగం చేస్తూనే ఉంటారు. మనలో ఉండే లోపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎదుటివానిలో ఉండే లోపాన్ని వెతికి మరీ వేలెత్తిచూపటమనేది మన అసమర్ధతకు నిదర్శనం. రెండు కాళ్లు ఉండేవాళ్ళు పరిగెత్తి పరిగెత్తి గెలవటమనేది గొప్ప విషయం దానికంటే అద్భుతమేంటంటే కాళ్ళు లేకుండా చేతులేకుండా ఆత్మస్తేర్యంతో డాన్స్ చేయటం . అలాంటివాళ్ళని ప్రోత్సహించడం ఒక గొప్ప పని. ఇంకా ఉంది.