వినసొంపైన సితార గీతాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వినసొంపైన సితార గీతాలు.

విన సొంపైన సితార వాద్య గీతాలు. ప్రతి పండుకు ఒక రుచి ఉన్నట్లే ప్రతి సంగీత వాద్యానికి ఒ రసాస్వాదన ఉంది. భూమండలంపై సంగీతం పట్ల మక్కువ చూపని మనిషి ఉండడు కదా!మన సినీ సంగీత దర్శకులు మధురాతి మధుర బాణీలతో పలు సంగీత వాద్యాలను మనకు పరిచయంచేసారు.అసలు ధ్వని శివుని ఢమరుకం నుండి ఉద్బవించిదట.అది క్రమేపి పలు వాద్యాలుగా రూపాంతరం చెందాయి. సంగీత వాద్యాలు ముఖ్యంగా నాలుగు రకాలు. 1)తత వాద్యాలు:తంత్రులు లేదా తీగ(string)లతో వియించేవి ఉదా:వీణా, తంబురా,సంతూర్,వయోలిన్,సరోద్,సితార,సారంగి,కడ్డి వాద్యం మొదలగునవి.2)సుషిర వాయిద్యాలు: గాలితో (wind) పనిచేసే వాద్యాలు లేదా గాలి ఊది వాయించేవిఉదా"వేణువు, సన్నాయి,కొమ్ము, నాదస్వరం, షహనాయ్,శంఖువు,నరసింగ్ మొదలైనవి.3)అవన్ధ వాద్యాలు:చర్మాన్ని ఉపయోగించి వాటిని కొడుతూ వాయించేవి. ఉదా"మృదంగం, డోలు, ఢమరకం,మద్దెల,తబలా,తప్పెట,దుందుభి,నగారా,డోలక్,పంచముఖ వాద్యం వంటి మొదలైనవి.4)ఘన వాద్యాలు:ఇవి తాళం అనుసరించు వాద్యాలు .ఉదా"తాళాలు, గంటలు,గజ్జలు,ఘటం,చిరుతలు,మోర్ సింగ్,మంజీరా వంటి మొదలైనవి. తంత్రి వాద్యమైన సితారా అంటే పగటి పూట కనిపించే నక్షత్రం అని అర్ధం. ఇది పదమూడవ శతాబ్దంలో ప్రసిద్ధ సూఫి ఆవిష్కర్త, కవి ఖ్యాల్,తరానా కవ్వాలి మార్గదర్శకుడు అమీర్ ఖుస్రో వీణనుండి దీన్ని తయారు చేసాడు. సితార అనే పేరు పర్షియన్ సెహ్ +తార్ నుండి ఉద్బవించింది.దీని అర్ధం మూడు తీగలుఅని. ఇది మధ్య యుగంలో భారత ఉపకఖండంలో ఉద్బవించింది.ఇది హిందూస్ధాని శాస్త్రీయ సంగీతంలో ఉపయోగిస్తారు. 16,17 శతాబ్ధాలలో అభివృధ్ధి చెందింది.18 వ శతాబ్ధంలో ప్రస్తుత రూపానికి చేరుకుంది.అయితే ఈ సంగీత వాద్యం18,19,20, 21 తీగలుకలిగి ఉంటుంది. వీటిలో ఆరు లేదా ఏడుతీగలు వాయించడానికి వాడతారు. మిగిలినవి తోడు తీగలు.వాయించే తీగలకు అనుబంధంగా ఇవి ప్రతి ధ్వనిస్తుంటాయి.ప్రదర్శన ప్రారంభంలో రాగం మూడ్ ను సెట్ చేయడానికి ఈతీగలను ఉపయోగిస్తారు.వీటిని పర్థా అని థాట్ అని పిలుస్తారు.ఫైన్ ట్యూన్ చేసుకునేందుకు వీటితో వీలౌతుంది.వాయించే తీగలు వివిధ పొడవులతో తలబుర్రకు ఉన్న చిన్న చిన్నరంధ్రాలగుండావెళ్ళి వాయిద్యం మెడపైన ఉండే చిన్న ట్యూనింగ్ పెగ్ లతో కలుస్తాయి.ఈఈవాద్యానికి రెండు వంతెనలు-వాయించే తీగకు ,డ్రోన్ తీగలకు,డ్రోన్ తీగలకు పెద్దవంతెన(బడా గోరా) తోడు తీగలకు చిన్న వంతెన(ఛోటా గోరా) ఉంటాయి.కంపించే తీగ అంచు ఈవంతెనను తాకినప్పుడు దాని పొడవు కొద్దిగా మారి అను స్వరాలు ఏర్పడతాయి.సితార నిర్మాణంలో వివిధ భాగాలకు వాడే పదార్ధాలు ఇలా ఉన్నాయి.మెడకు,తబలీకి టేకు గాని టూన్ కలప (సెడ్రెలా టూనా)గాని వాడతారు.ప్రతిధ్వనించే గదులను సొరకాయ బుర్రలతో చేస్తారు.వాయిద్వం యొక్క వంతెనలను జింక కొమ్ము,ఎబోని లేదా ఒంటె ఎముక నుండి తయారు చేస్తారు. పండిట్ రవిశంకర్ వారి ద్వారా సితార విశ్వవ్యాప్తం అయింది.జనార్ధన్ వంటివారు కూడా పేరుపొందారు. తెలుగు సినీ సంగీతంలో సితార వాద్య గీతాలు కొన్ని చూద్దాం! 'జగదేకవీరునికథ' చిత్రంలో 'శివశంకరి'-'పునర్జన్మ' చిత్రంలో 'ఎవరివో' 'అమెరికా అమ్మాయి' చిత్రంలో 'ఒకవేణువు వినిపించెను'- 'పూలరంగడు' చిత్రంలో 'చిగురులు వేసిన కళలన్ని' 'శాంతినివాసం' చిత్రంలో 'కలనైనా నీతలపే' 'మంచిమనసుకు మంచిరోజులు' చిత్రంలో 'రావే నాచెలియా' 'చిల్లరదేవుళ్ళు' 'కలువకు చంద్రుడు ఎంతోదూరం' 'అన్నమయ్య' 'నిగమా నిగమాంతర'వంటి పాటలు మనలను పరవశుల్ని చేసాయి.మరెన్నో సంగీత వాద్యాలు మన సంగీత సాంబ్రాజ్యాన్ని సుసంపన్నం చెసాయి.అవి స్వదేశి,విదేశి వాద్యాలు కావచ్చు.కళలు అజరామరాలు.మరణం లేనిది కళ.అసలు సంగీతం ఒక చలమ వంటిది.ఇలా ఆనంద సంధాయకమైన కళావికాసాలు భారతదేశంలో కోకొల్లలు,ఈకళలన్ని సమాజ వికాశానికి హితవుగా మనకు గోచరిస్తాయి.కొన్నిరుచులకు,ఆనంద అనుభవాలకు మాటలు ఉండవు.అవి అనుభవం ద్వారా తెలుసుకోవడమే!అసలి సొలసిన మనిషికి సేదతీర్చేది,అక్కునచేర్చుకుని ఆనందపరిచేవే లలితకళలు. మనం కోరకుండానే ఇవి మనపూర్వీకులు మనకు ఇచ్చిన వరాలు.అగ్ని జల్లినా,అమృతం కురిసినా.అందం,ఆనందానికి పరమావధి,అని తిలక్ అన్నమాట ఒక్క కవిత్వానికేకాదు. కళలన్నింటికి వర్తిస్తుంది. డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.