Lord Krishna - mahabharata - చంద్ర శేఖర్ కోవూరు

Lord Krishna - mahabharata సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే పాండవులతో ఉన్నా గాని వాళ్ళకి కష్టాలు తప్పలేదు, జూదం లో ఓటమి తప్పలేదు, ద్రౌపది అవమానం తప్పలేదు, వనవాసం తప్పలేదు. యుద్ధం తప్పలేదు. యుద్ధంలో పుత్రశోకం తప్పలేదు. భగవంతుడితో ఉన్నా కూడా ఇవన్నీ తప్పలేదు అంటే కర్మఫలం ఎంత ప్రభావితం చేస్తుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే దేవుడు కూడా మాయ చేసి కర్మలని తప్పించలేడు. అది సృష్టి విరుద్ధం. దేవుడి ప్రత్యక్షంలో ఉండే వాళ్ళకే అవన్నీ తప్పలేదు అంటే సర్వ సాధారణమైన మనమెంత. అంటే ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే ఎటువంటి కర్మఫలం ఆశించక కర్మలు చేయక తప్పదు. ధర్మం ఆచరించక తప్పదు. కర్తవ్య నిర్వహణ తప్పదు. ఇది తెలియక చాలామంది ప్రతి చిన్న కష్టానికి దేవుడు రాలేదు దేవుడు లేడు అని అజ్ఞానంతో దేవుని నిందిస్తూ ఉంటారు. దేవుడు మనిషిగా అవతరించినపుడు కూడా ఎంత శాంతంగా ఉంటాడో ఎంత ప్రేమతో ఉంటాడో ఎంత తర్కంతో ఉంటాడో ఎంత వినయంగా ఉంటాడో ఎంత ఋణానుబంధంతో ఉంటాడో శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటే అర్థం అవుతుంది. కృష్ణుడు కొన్ని ముద్దు పేర్లు సరదాగా... ================= చిన్ని కృష్ణుడు యశోద కృష్ణుడు అల్లరి కృష్ణుడు కొంటె కృష్ణుడు రేపల్లె కృష్ణుడు గోకుల కృష్ణుడు దేవుడు సర్వాంతర్యామి. కృష్ణం వందే జగద్గురుమ్ సర్వేజనా సుఖినోభవంతు

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు