SMART PHONE మహత్యం - చంద్ర శేఖర్ కోవూరు

SMART PHONE మహత్యం ☘మనం డబ్బు ఎంత వరకు అవసరమో అంతే ఖర్చు పెడతాము. ☘ఆహారం ఎంత కావాలో అంతే తింటాం. ☘పరీక్షలుకు ఎంత చదవాలో అంతే చదువుతాం. ☘Job ఇంటర్వ్యూకి ఎంత అవసరమో అంతే prepare అవుతాం. ☘ఆఫీసులో కూడా ఎంత పని చేయాలో అంతే చేస్తాం. ☘ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. ☘దేవుడికి ఎంత సేపు పూజ చేయాలో అంతసేపే చేస్తాం. ☘ఎంత నిద్ర కావాలో అంతే నిద్రపోతాం. ☘ ఎవరికెంత సహాయం చేయాలో అంతే చేస్తాం. ☘ఆరోగ్యం బాగోలేకపోతే బాగయ్యే వరకే మందులు వాడతాము. ☘ టీవీ ఎంతసేపు చూడాలో అంతసేపే చూస్తాం. ☘చివరికి మనం రోజు వాడే పప్పులు ఉప్పులు కూడా ఎంతవసరమో అంతే వాడతాము ఏ పని చేస్తున్నా స్మార్ట్ ఫోన్ వాడతాం కానీ, స్మార్ట్ ఫోన్ వాడేటపుడు మాత్రం ఏ పని చేయాలనిపించదు... 🤷‍♂ ఇన్ని విషయాల్లో ఆచితూచి అడుగేసే మనం ఒక్క మొబైల్ వాడకం విషయంలో మాత్రం ఎందుకు కంట్రోల్లో ఉండలేకపోతున్నాము. 24 hours దాన్ని ఎందుకు అంటిపెట్టుకుని ఉంటున్నాము. నిజంగా మొబైల్తో అంత అవసరం ఉందా అని ఎపుడైనా ఆలోచించామా. టైం ఉన్నా లేకున్నా, ఆకలేసినా, నిదరొచ్చినా, బిజీగా ఉన్నా , ఛార్జింగ్ ఉన్న లేకున్నా ఛార్జింగ్ పెట్టి మరి వాడుతుంటాం. ఇది టెక్నాలజీ విజయమా, మొబైల్ విజయమా, మన విజయమా. ఎవరి ఆధీనంలోకి ఎవరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లిన purse మరిచిపోతారేమో ఇంకేమన్నా మరిచిపోతారేమో కానీ మొబైల్ మాత్రం ఎవ్వరు మరిచిపోరు. 🙏వారేవా ఓ మొబైల్ ఫోనా ఆలస్యంగా వెలుగులోకి ఓచినా అందరి హృదయాల్లో చొచ్చుకుపోయి అందరికి ఒక ప్రాణవాయువులా ఐపోయావు చూడు అందుకు నిను అభినందించాలసిందే.🙏 ఒక్క క్షణం మొబైల్ చేతిలో లేకపోతె ఉండలేని పరిస్థితి. ఒకపుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేవాళ్ళు. తర్వాత మనీ మేక్స్ ఆల్మోస్ట్ ఎవెర్య్థింగ్ అన్నారు. చివరికి మొబైల్ మేక్స్ ఎవెర్య్థింగ్ లాగా అయిపొయింది. Mobile నుండి పూర్తిగా బయట పడాలంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ, control చెయ్యడం కోసం ఒక సలహా "రోజుకి కనీసం రెండు, మూడు గంటలు (నిద్ర పోయే సమయం కాకుండా) మీ ఫోన్ కి దూరంగా ఉండండి" దీని వల్ల ఎంతో అంత మార్పు ఖచ్చితంగా వస్తుంది.