సింధూ ప్రజల తాత్విక చింతన - __పిళ్లా కుమారస్వామి

సింధూ ప్రజల తాత్విక చింతన

సింధూ ప్రజల తాత్విక చింతన __పిళ్లా కుమారస్వామి, 9490122229 వేదకాలం కన్నా ముందే మన దేశంలో సింధు ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. అంటే ఆర్యులు రాక ముందే ఉన్న ప్రజల తాత్విక చింతన కూడా నేటి తాత్విక చింతన లో భాగంగా ఉండి తీరుతుంది. సింధు ప్రజలు నేడు మనం పాటిస్తున్న ఆధునిక విధానాలను వారు అవలంబించారు.వారికో భాష ఉంది.దానికో బొమ్మలలిపి ఉంది. ఇది స్వదేశీ లిపి.దీన్ని 1853లో కనుగొన్నారు.అయితే దానిని ఇంతవరకు ఎవరూ చదవలేకపోయారు. వీరి జీవనవిధానం క్రీ.పూ.6000 నుండి క్రీపూ.1750 వరకూ సాగింది. వీరు హరప్పా మొహంజదారో ప్రాంతం లో నివసించారు.ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్ల లో సింధ్,పంజాబ్ ప్రావిన్సులలో,పశ్చమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్స్ వరకు ఉంది.వీరు నేటి నాగరిక విధానాలను ఆనాడే అవలంబించారు. తరువాత కాలంలో ఆర్యులతో వీరు కలిసి పోవడమో దూరంగా పారిపోయి దక్షిణ భారత దేశంలో కి రావవడమో జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు. సింధూ ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. వేదాలలో ఈ దేవుడు లేడు. పశుపతిని ముద్రిక ద్వారాతెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను ,అగ్ని ని కూడాపూజించేవారు.పశువులను బలిచ్చేవారు. (ఆంధ్రులు నాగుల్ని పూజిస్తారు) మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదాలను బట్టి వేదకాలపు ఆర్యులకు,సింధూ ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి.వేదాలలో అక్కడక్కడా వీరి ప్రస్తావన ఆధారంగా సింధూ ప్రజలు శివున్ని(పశుపతి), శక్తి (అమ్మతల్లి)ని, లింగాన్ని ఆరాధించే వారని తెలుస్తోంది.అక్కడ లభించిన విగ్రహాలు దీన్ని రూఢీ చేశాయి. సింధూప్రజలు మనిషి మరణిస్తే పూడ్చేవారు.తరువాత వలస వచ్చిన వేదకాలపు ఆర్యులు మాత్రం కాల్చేవారు(దహనం చేసేవారు).