మన తెలుగు తేజాలు - Raj

మన తెలుగు తేజాలు ------------------------------------------ మన తెలుగు తేజాలు, Illustrious Children of Telugu Talli - రాజ్ -------------------------------------------- గమనిక: ఏవేని తప్పులున్న మన్నించగలరు ముందుమాట : తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. మన తెలుగు తేజాల గురించి ఓక సంకలనం చేయ ప్రయత్నం. పేరేన్నికగన్న తెలుగు వారు ఎందరో ఉన్నారు, కొందరి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అంతర్జాలంలో ఎంతో సమాచారం దొరుకుతుంది, కానీ దాని విశ్వసనీయత మనము సొంతంగా సరిచూసుకోవాలి, ఇది గమనార్హం. నాకు దొరికిన సమాచారం పొందుపరిచాను. మూడు పేరేన్నికగన్న శైవ క్షేత్రాలున్నవి త్రిలింగ దేశమనే పేరు నుండి తెలుగు శబ్దం వచ్చిందేమో. తెనుగు అని కూడా వ్యవహరించేవారు తెలుగు వాడే తెలుగు వారు ధన్యులు, జై తెలుగు తల్లి. భాష జీవితానికి మూలం, మనిషి అభివృద్ధికి సహకరిస్తుంది, సులువైన భాష తొందరగా అర్ధమవుతుంది, జీవితంలో ఉపయోగపడుతూ ఎంతో తోడ్పడుతుంది ఆంగ్లం ఎంత వస్తే అంత తెలివి గలవారనుకోవటం తెలివి కాదు The development of people, to some extent, depends on their language skills. English language knowledge is not equal to intelligence Languages, mother tongue and other useful language tools, taught in schools should help in understanding things clearly and communicating effectively in real life, they should be taught in a pragmatic way. మాతృ భాష బాగా వచ్చిన వారు అద్భుతంగా భావ వ్యక్తీకరణ చేయగలరు, ఆలోచనలు కూర్చి క్రోడీకరించగలరు, అనువాదం కూడా చక్కగా చేయగలరు, పాలిగ్లాట్ (Polyglot) బహుభాషావేత్తలు కాగలరు. -------------------------------------------------- కొందరు మహనీయులు, పేర్కొనదగిన పని చేసిన వారు, కృషీవలురు : త్రైలంగ స్వామి స్వామి గణపతి సరస్వతి వీరి పేరు హిందూ యోగి, శివరామ విజయనగరం నుండి వారణాసి వెళ్ళిరని అంటారు 280 ఏళ్ళు జీవించిన యోగి శ్రీ రామకృష్ణుల వారు వీరిని " వారణాసి లోని నడిచే శివుడు " అన్నారు. (Walking Shiva of Varanasi) గిడుగు వెంకట రామ్మూర్తి తెలుగు రచయిత సామాన్యులకు అర్ధమయ్యే సులువైన వ్యవహారిక భాష కోసం తపించి కృషి చేసారు. వీరి జన్మదినం 29 ఆగష్టు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మంచి పని చేసావు బాబు అనాలనిపిస్తోంది కదూ. తాళ్లపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామిపై సంకీర్తనలు రచించిరి పుట్టిన ప్రదేశం మరియు తేదీ: 22 మే, 1408 తాళ్లపాక, విజయనగర సామ్రాజ్యం ఈనాటి రాజంపేట, కడప జిల్లా వీరి గీతాలు : కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ... ఎన్నెన్నో రత్నాలు రాసారు అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము॥ అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥ చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్నదేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥ కైవల్యపదము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనవి భావింప సకలసంపదరూపమదివో పావనములకెల్ల పావనమయము॥ భావములోనా బాహ్యమునందును భావములోనా బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె అచ్యుత యచ్యుత శరణనవో మనసా త్యాగరాజు పాటలతో రాముడిని పొగిడిన వాగ్గేయకారుడు ఆయన కీర్తనలు శాస్ట్రీయ సంగీత రసజ్ఞులకు తెలిసినవే పంచరత్నాలు ఎంత బాగుంటాయో ఎందరో మహానుభావులు..... మన తెలుగు రాష్ట్రంలో కూడా త్యాగరాజు పాటల కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుండును కదా పల్లవి: నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి నన్ను బ్రోవగ రాద? శ్రీరఘువర నీ ॥న॥ అను పల్లవి: నగరాజధర! నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడువారలు గారె? యిటు లుండుదురే? నీ ॥న॥ చరణము(లు): ఖగరాజు నీ యానతి విని వేగ చనలేఁడో? గగనాని కిలకు బహు దూరం బనినాఁడో? జగమేలే పరమాత్మ! యెవరితోనీ మొఱలిడుదు? వగ చూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత! ॥న|| శ్రీకృష్ణ దేవరాయాలు (చరిత్ర ప్రకారం పాలనా కాలం : 1509 –1529) సాహితీసమరరాంగణా చక్రవర్తి ఆంధ్రభోజ తెలుగుకు సువర్ణ కాలం అయన రాజ్యమేలిన కాలం కన్నడ, తెలుగు భాషలకు ఒకే లిపి ఏర్పడింది అని చరిత్ర చెప్తోంది, మనము ఈ సారూప్యం గమనిస్తాము రెండు భాషలూ ఆ కాలంలో అభివృద్ధి చెందాయి విద్యారణ్యులవారి గొప్ప సహాయం చేతనే హరిహరరాయ - బుక్క రాయ వారు విజయనగర సామ్రాజ్యన్ని ఏర్పరచి హైందవ సనాతన సంస్కృతిని కాపాడారు, వన్నె తెచ్చారు. తెలుగుకు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన సేవ అనితరసాధ్యం అనిపిస్తుంది, చరిత్ర ఇదే ఘోషిస్తోంది. భువనవిజయం, అష్ట దిగ్గజాలు, తెనాలి రామకృష్ణ చాతుర్యం మనము యెరుగుదుము తెలుగు రాజు ఒకరి పేరు చెప్పమంటే ఏమని చెప్తారు? శ్రీకృష్ణ దేవరాయలు, విజయనగర సామ్రాజ్యం. పోరాటమైనా, సాహిత్య రసజ్ఞత, కవితా సాహిత్య పోషణ అయినా వీటిలో ఈయనకీయనే సాటి చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి హంపి, విజయనగరం, రాయల వారు ఏలిన రాయలసీమ, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి జనవరి,1565 నాగరికతల, జీవన విధానాల, రాజ్యాల, రాజ్యకాంక్షల యుద్ధం Battle of Talikot, Clash of Civilizations తల్లికోట, నేటి కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రదేశం రామరాయలు, తిరుమల రాయలు, ఇత్యాదులు తలైకోట యుద్ధంలో ఓడటంతో ఈ సామ్రాజ్యం నేలకూలింది, మనకు, మన భాషకు కష్టాలు పెరిగాయి యుద్ధంలో గెలిస్తే మన రాజ్యము, భాషా నిలబడ్తాయి కాలం చెప్పే పాఠాలు తెలివున్న వారు త్వరగా నేర్చుకుంటారు, లేని వారు మరల మరల అవే నేర్చుకుంటారు తెలుగు సామ్రాజ్యం, తెలుగు భాషా నేలకొరిగెను ఆనాడు కాలమే అన్నిటికీ మందు కదా తిరగ ఓక శ్రీకృష్ణదేవరాయల వంటి తెలుగు రాజు వచ్చు గాక అల్లూరి సీతారామరాజు మన్నెం దొర, ఫితూరీలతో బ్రిటిష్ పోలీసులను ఎదుర్కొన్న పోరాట యోధుడు ఓక కధ ఉన్నది : అల్లూరి సీతారామరాజు తండ్రి అల్లూరిని చెంప దెబ్బ కొడ్తాడు, గుర్రంపై వెళుతున్న బ్రిటిష్ ప్రభుత్వ బంటు వేషధారణ, దర్పం చూసి సెల్యూట్ చేసినందుకు అతను అల్లూరి అయ్యాడు, తన తండ్రి సంస్కరించటంతో బ్రిటీషు వారిపై సమరం జరిపాడు. పట్టి చెట్టుకు కట్టి గుండెపై ఒక గుండు కాలిస్తే మరణించి, వీరుడిగా నిలిచి అమరుడయ్యాడు తర్వాత అల్లూరి శరీరాన్ని మంచంపై కట్టి ఊరేగించారట మరొకరు ఎదుర్కోకుండా భయపడ్తారని. వర్తకమని మోసగించు, ఆక్రమించు, అధర్మం ఉపయోగించి యుద్ధం చేసి ఓడించు, చంపు భయపెట్టు, ఇదేగా బ్రిటిష్ వారి తెలివి, సంఘసేవ అల్లూరి నిజమైన చిత్రపటం చూపిస్తున్నామా, సినిమా చూపిస్తున్నామా సినిమాలో ఏదేదో చూపిస్తారే, అదంతా నిజమా లేక అబద్ధమా, పిల్లలకు నిజాలు చెప్పాలే ఆయన్ని పట్టుకున్న తర్వాత చెట్టుకు బంధించి గుండెపై ఒకటే గుండు కాల్చారని కొంత తెలుస్తోంది (అయన చనిపోయినప్పటి ఫోటో, ఛాతీ పైన మందుగుండు గుర్తు చూపిస్తోంది) సినిమాలో అల్లూరిమరణం "సినిమాటిక్"గా తీశారు, ఏవేవో సత్యదూరమైనవి తొందర్లో ఊహించి, లేని చొరవ తీసుకుని రచయితలు రాశారు, దర్శకుడేదో తీసాడు, మమ అనిపించాడు నటుడి ( యాక్టర్ ) చేత చరిత్ర తిరగరాయటం సబబు కాదు, ఇది ముమ్మాటికీ ఘోరమే ఉన్నది చూపాలి, లేనిది కాదు, ఊహలు వేరు చరిత్ర వేరు సినిమా స్టార్ కృష్ణ వేరు, అల్లూరి సీతారామరాజు వేరు పిల్లలకి నేర్పాల్సింది, చూపాల్సింది నిజమైన చరిత్ర, నిజమైన అల్లూరి పటం ఈ బాధ్యత మనది తల్లి, తండ్రి, గురువు, చరిత్రకారులు నిజమైన చరిత్ర నేర్పాలి చూచిన వారు లేకుంటే మిన్నకుండాలి, ఆనవాళ్ళు, ఆధారం లేని చరిత్ర నిజమైన చరిత్రయా అన్నది చెప్పటం కష్టం " విన్నదేది గుడ్డిగా నమ్మలేము చూసిన దాంట్లో సగమే నమ్మోచ్చట " ధ్రువీకరించుకోవాలి మనము ఉన్న వాటితో పొట్టి శ్రీరాములు ఈయన గురించి చెప్పేదేముంది, తెలుగు రాష్ట్రం రావటానికి ఆత్మ త్యాగం చేసిన తెలుగు భాషాభిమాని, నవ తెలుగు జాతికి సైద్ధాంతిక తండ్రి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎదురైన అణచివేత, చేదు అనుభవాలనుంచి పుట్టిందే స్వంత తెలుగు రాష్ట్ర కోరిక రాష్ట్రమివ్వండి అని అడిగితే నెహ్రూ ఇవ్వలేదు తమిళ నాయకుడు రాజగోపాలచారి, నెహ్రూ కలిసి చేసిన పనులు చరితకు తెలుసు చచ్చాక రాకా తప్పలేదు, రాష్ట్రం ఇవ్వకా తప్పలేదు నెహ్రూకు చేవ లేని వారు ఏది సాధించలేరు నిరాహార దీక్ష, ఆత్మ త్యాగం, తెలుగు చేవ, తెలుగు బిడ్డ తెగువ, సాధనా పటిమ ఉన్న మొనగాడు మన పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళ వారికింద అణగారిన తెలుగు జాతి అలనాడు ఆంధ్ర మాత గౌరవానికై పాటుపడింది, పోరాడి తెలుగు రాష్ట్రం సాధించుకుంది ఆంధ్రమాత అని మనం పిలుచుకున్నాము, మన తెలుగు తల్లి అని పిలుచుకున్నాము, మన హక్కులు సాధించుకున్నాము అడగనిదే అమ్మైనా పెట్టునా? నేటికీ తల్లిని గౌరవించి " మా తెలుగు తల్లికి మల్లెపూ దండ " పాట పాడుకుని, పిల్లలతో పాడించే తెలుగు బిడ్డలు ఉన్నారు, వారు నిజంగా ధన్యులు ఘంటసాల ఈయన తెలుగు పాటలు అందరికి తెలుసు. తేనె వంటి మధుర గాత్రం నాకు నచ్చినవి : అహో ఆంధ్ర భోజ....శిలలపై శిల్పాలు...... నీలి మేఘాలలో గాలి కెరటాలపై నేను పాడే పాట వినిపించునీవేళ..... ఈయన పాటలు, అబ్బో ఎంతో మధురమైనవి, చిరస్మరణీయుడు ఈ గాన గంధర్వుడు, సౌమ్యుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామరావు ఈయన గురించి ప్రతి తెలుగు వాడికి తెలుసు 2 రూపాయలకే కిలో బియ్యం పధకం ఇచ్చిన ప్రజా హృదయ నాయకుడు తెలుగు భాషాభిమాని తెలుగు భాషకు తగిన గౌరవం ఇచ్చిన వ్యక్తి పుటలు చాలవు వీరి గురించి రాసేందుకు కళాకారుడు, నటుడు, సినీ నాయకుడు ప్రజా నాయకుడు రెండునూ, తెలుగు భాషాభిమాని, తెలుగు అనర్గళంగా మాట్లాడటం గాని, చలన చిత్ర సంభాషణలు గాని, అద్భుతం తెలుగుకు వీరు చేసిన సేవ అజరామరం, అద్భుతం, అనితరసాద్యం, వారికీ వారే సాటి, నా అభిమాన ముఖ్య మంత్రి. రెండు రూపాయలకు కేజీ బియ్యమిచ్చిన మహానుభావుడు, ప్రజా హృదయ నాయకుడు వీరు ప్రజా పాలనలో తెలుగుకు నిజమైన వెలుగునిచ్చిన వ్యక్తి, తెలుగును సమున్నతంగా గౌరవించారు ఢిల్లీ వారు తెలుగును గౌరవించలేదని ఆత్మ గౌరవం చూపి రాష్ట్రమంతా తిరిగి ఎన్నికైన మహానుభావుడు తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున వజ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి తెలుగు పదం అంటేనే వీరికి ఎంతో ప్రీతి మంచి హృదయం ఒక పాట రాయించారు ముచ్చట పడి... తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది..... ఎంత మంచి హృదయం కదూ నందమూరి బాలకృష్ణ చక్కని తెలుగు మాట్లాడే వ్యక్తి. హిందూపురం ఎమ్మెల్యే గా కృషి చేస్తున్నారు నాన్నగారు చూపిన దారిలో ప్రజా సేవ చేస్తూ ఓక ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్నారు భాగ్యనగరంలో వైస్సార్ యెదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి వీరి గురించి ఇప్పటి ప్రతి తెలుగు వాడికి తెలుసు ఎందరికో విద్యా ఆరోగ్య సహాయాన్ని అందించిన మంచి వ్యక్తి పంచెకట్టులో చక్కని తెలుగుదనం, మంచి తెలుగు , చక్కని తెలుగు చేవ, పనితనం చూపిన వ్యక్తి వీరు ఎందరికో ఆదరణీయులు, అభిమాన నేత కార్యోన్ముఖత, పట్టు, ప్రజా శ్రేయస్సుకై తపన, పనితనం వీరి వద్ద నేర్చుకోవచ్చు తెలుగు ప్రజా శ్రేయస్సుకై కృషి సలిపిన ధీసాలి విద్యార్ధి దశలోనే, తెలుగు విద్యార్థులకోసం ఎంబిబియస్ చదివే సమయంలోనే నేతగా వారికి తోడ్పాటు అందించారు, నాయకత్వం వీరి రక్తంలో తిరుగుతోందా అన్నట్టుండేది వీరి వైనం ప్రజలకు మంచి చేసే ఆలోచనలు గాని, పధకాలు గాని క్షణాల్లో ఆమోదించటం వీరికే చెల్లింది పులివెందుల పులి అని ముద్దుగా పిలుచుకుంటారు అంతా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎన్నో పాటలతో అలరించారు వీరికి తెలుగంటే ఎంతో అభిమానం తెలుగంటే ప్రాణం పెడ్తారు ఈయన వీరి పాటల ద్వారా, సంగీత కార్యక్రమాల ద్వారా, ఈ టీవీ పాడుతా తీయగా కార్యయజ్ఞం ద్వారా ఎంతో సేవ చేసిన మహానుభావుడు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇతర భాషల్లో సుమారు నలభై వేలకుపైగా పాటలు పాడారట పాటల మాంత్రికుడు, ఎందరికో డబ్బింగ్ కూడా చెప్పారు. వై యెస్ జగన్ యె సం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్య మంత్రి వీరి పనితనం మనం చూస్తున్నాము, ప్రజాదరణ చూరగొన్న మంచి నేత మహానేత వైస్సార్ గారి పుత్రుడు తండ్రికి తగ్గ తనయుడిగా పని చేస్తున్నారు పనితనం, ప్రజలకోసం పధకాల రచన మనం చూస్తున్నాము, నేర్చుకొనదగినవి ఈ లక్షణాలు తెలుగు బిడ్డ గావున, తెలుగు చేవతో ప్రజా సేవకై ఎంతో కష్టాన్ని ఎదుర్కొని 2009 నుండి 2019 వరకు శ్రమించి ముఖ్యమంత్రి అయ్యారు తెలుగు ప్రతి పాఠశాలలో ఒక సబ్జెక్టుగా బోధించేలా చర్యలు తీస్కుంటామని చెప్పినారు దేవుడి దయ మీపై ఉండాలి బాబు. పులివెందుల పులి బిడ్డగా, వైస్సార్ గారిలా, వారి తనయుడు పని చేస్తున్నాడు, ప్రజలు కూడా తండ్రి పనితనం వలే ఈయన పనితనం అద్భుతంగా ఉందని ఆనందిస్తున్నారు. ఇంకేం కావాలి రాజన్న రాజ్యం మరలా వచ్చాక, అన్నీ, అందరికీ మంచి పధకాలుగా ఇచ్చాక పవన్ కళ్యాణ్ కొణిదల కళ్యాణ్ బాబు ప్రతి ఇంట్లో వీరి అభిమానులున్నారు తెలుగు హృదయ నేత వీరు ప్రజా రాజ్యం అనే పార్టీ ద్వారా తెలుగు ప్రజా సేవ చేస్తున్నారు తెలుగు అంటే ప్రేమ ఉన్న వ్యక్తి వీరు కూడా ప్రజా సేవకై శ్రమిస్తున్న ధీశాలి వీరిని దేవుడు చల్లగా చూడాలి ముఖ్య మంత్రి అయితే వీరు ఎంతో సేవ చెయ్యగలరు మన తెలుగు జాతికి కృషి, దేవుడి దయ, ప్రజా దీవెనలు, మంచిపధకాలు, వీరి వద్ద మెండుగా యున్నవని అంటారు అభిమానులు పవర్ స్టార్ పవన్ వీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విఖ్యత సివిల్ ఇంజనీర్ భారత రత్న మైసూరు స్టేట్ దివాన్ గా సేవ చేసారు రోడ్లు, డామ్స్, కాలేజీలు, బ్యాంకు, ఎంతో సేవ చేసిరి విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు. కె ల్ రావు కానూరు లక్ష్మణ రావు సివిల్ ఇంజనీర్ పద్మభూషణ్ గ్రహీత యూనియన్ మినిస్టర్ అఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ గా సేవాలందించారు ఎంపీ విజయవాడ (1962 నుండి 1977) నాగార్జున సాగర్ డామ్, ఆనకట్ట కోసం కృషి చేసిరి. పుస్తకం వ్రాసి ఇరిగేషన్ కోసం కృషి చేసిరి. వారి పుస్తకాలు : రీఇంఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ RCC ఇండియాస్ వాటర్ వెల్త్ India's Water Wealth క్యూసెక్స్ కాండిడేట్ Cusecs Candidate రివర్స్ అండ్ తెయిర్ డెవలప్మెంట్ Rivers and Their Development ఇరిగేషన్ Irrigation ఆ సాం రావు A S Rao ఎకాఇంలి (ECIL) కోసం ఎంతో సేవ చేసిరి మంచి ఇంజనీర్ దార్శనికుడు, ఎలక్ట్రానిక్స్ అభివృద్దికి పని చేసి ఎందరికో ఉద్యోగాలు వచ్చేలా తోడ్పడిన మహానుభావుడు యె ఎస్ రావ్ నగర్ (A S Rao Nagar) అని పేరు పెట్టుకుని గౌరవించుకున్నాము గల్లా రామచంద్ర నాయుడు పారిశ్రామికవేత్త పుట్టిన ప్రదేశం, తేదీ 10 జూన్, 1938, చిత్తూరు ఎలకర్టికల్ ఇంజనీరింగ్, జనెటెయు (JNTU), అనంతపురము అమర రాజా గ్రూప్ అఫ్ కంపెనీస్ అధిపతి బాటరీ తయారీ సంస్థ స్థాపించిరి కావ్యా వద్దాడి విమానశాస్త్రం ఆధారంగా విమానం డిజైన్ తయారు చేసేను ఓక అమెరికా విశ్వవిద్యాలయంలోని సి ఎఫ్ డి (computational fluid dynamics, cfd) పరిశోధన శాలలో వీరి డిజైన్ సరియైనదే అని నిరూపణ చేయబడింది శతక కర్తలు శతకము లన్నియు సలక్షణమైన కావ్వ భాషలోనే యుండును శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకము లోని ప్రతి పద్యంలో చివర నున్న సంబోధనా పదమే మకుటము. ఈ మకుటము తప్పని సరిగా సంబోధన గానే వుండవలెను. *** ఒకరిలా అనిరి : తెలుగున తొలి శతకము..... మల్లికార్జున పండితారాధ్యుని శ్రీ గిరి మల్లికార్జున శతకము. ఇందలి మకుటము శ్రీగిరి మల్లికార్జునా అని యుండుట చేత నిందు చంపక మాల, ఉత్పల మాల పద్యములు తప్ప వేరు వృత్తములు ఇమడనేరవు. తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూఢీగా చెప్పవచ్చు. శతకాల వైశిష్యం, ప్రాచుర్యం, సాహితీ ప్రక్రియలలో మొదటి స్థానం : తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు - పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా....అందరిలోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనవచ్చు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పవచ్చు. ఇది అతిశయోక్తి కాదు. *** భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది. తెలుగు శతకాలు నాకు తెలిసిన తెలుగు శతకాలు వేమన, సుమతీ శాతకాలు ఇవి గాక ఎన్నెన్నో శతకాలు ఉన్నవి, వీటిని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, వాటి పద్యాలను ఒక్కొకటి అయినా పాఠ్యంశాలలో చేర్చి వేమన శతకం వేమన గొప్ప తత్త్వవేత్త, సులభంగా సులువుగా, అర్ధమయ్యేలా తత్వ సారం పిండి పద్యాలు రాసాడు మచ్చుకి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు గాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలకుననా విశ్వాదాభిరామ వినురవేమ Sri Kumaragiri Vema Reddy popularly known as వేమన, wonderful poet సుమతి శతకం బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యాలు తెలియని తెలుగువారు మరీ అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలు సామెతలుగా వాడుకలోఉన్నాయి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కిచావదె సుమతీ తన కోపమే తన శత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ అప్పిచ్చు వాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ -------------------------------------------------- తెలుగు భాషకు సేవ చేసిన వారు మధ్యయుగం వారు Medieval కవి త్రయం నన్నయ, తిక్కన, ఎల్లాప్రగడ అన్నమాచార్య Annamacharya (కాలం : 1408–1503) తిమ్మక్క అన్నమాచార్యుల వారి పత్ని సుభద్ర కళ్యాణం రచించిరి శ్రీకృష్ణదేవరాయలు రసజ్ఞత కలిగిన రాజు రచనలు కూడా చేసిరి అష్ట దిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం లో : Eight Elite Poets అల్లాసాని పెద్దన, వికటకవి కవి తెనాలి రామకృష్ణ, ధూర్జటి, పింగళి సూరన మొదలైన వారు మొల్లమాంబ అటుకూరి మొల్ల మొల్ల రామాయణం కవయిత్రి బమ్మెర పోతన పోతన భాగవతం భద్రాచల రామదాసు భద్రాచల రామునిపై కీర్తనలు -------------------------------------------------- ఆధునికులు Modern times కందుకూరు వీరేశ లింగం గురజాడ అప్పారావు గుర్రం జాషువా విశ్వనాథ సత్యనారాయణ గుంటూరు సేషేంద్ర శర్మ యుగ కవి బీరుదాంకితులు --------------------------------------------------- కొందరు పాటల రచయితలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఆరుద్ర శ్రీశ్రీ అత్రేయ వేటూరి సి నారాయణ రెడ్డి సిరివెన్నెల సీతారామ శాస్త్రి చంద్రబోస్ -------------------------------------------------- ప్రభుత్వ పదవులు చేపట్టిన వారు : ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గా సేవాలందించిన వారు: (3) నీలం సంజీవ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణన్ వి వి గిరి వైస్ ప్రెసిడెంట్ అఫ్ ఇండియా గా సేవలందించిన వారు: ఎం వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి గా సేవాలాందించిన ఏకైక తెలుగు బిడ్డ పా వెం నరసింహా రావు P V Narasimha Rao నాకు నచ్చిన ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం పంతులు, కాల్చమని ఛాతీ చూపినన ధైర్యం ఎన్టీఆర్, ప్రజాసేవా దురంధరుడు డాక్టర్ వైస్సార్, మహా నేత, ప్రజా సంక్షేమమంటే తెగ ఇష్టం --------------------------------------------------- విద్యారంగం కట్టమంచి రామలింగా రెడ్డి, ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేక ఆంధ్రా విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతి/ వైస్ ఛాన్సెలర్ (AU Visakhapatnam) జె ఎన్ రెడ్డి (మెకానికల్ ఇంజనీర్, Texas A&M University) రాజ్ రెడ్డి (Computer Science, CMU, IIITH) వుండెల మలకొండా రెడ్డి (సివిల్ ఇంజనీర్, COE Guindy, Cbit Hyderabad) సూరి భగవంతం ఫిజిక్స్ ప్రొఫెసర్ డి రి డె ఆ (DRDO) డైరెక్టర్/ నిర్దేశాకునిగా పని చేసారు, ఐ ఐ ఎస్ సి (IISc or Tata Institute) కు డైరెక్టర్ గా పని చేసారు, ప్రిన్సిపాల్ ఆంధ్రాయూనివర్సిటీ సైన్స్ కాలేజీ యెల్లాప్రగడ సుబ్బారావు సైంటిస్ట్ ప్రాణం నిలిపే మందులు కనుగొన్నారు డొరోన్ అంట్రిమ్ సుబ్బా రావు గురించి ఇలా అన్నాడు : "నీవు సుబ్బా రావు గురించి ఎప్పుడూ విని ఉండవు. అయినా, అయన బ్రతికినందుల్లే నువ్వు బకతికావ్, నువ్వు ఎక్కువ కాలం బతకాలని అయన బతికాడు" American author Doron Antrim said about Subba Rao: "You’ve probably never heard of Dr. Yellapragada Subba Rao. Yet, because he lived, you may be well and alive today; because he lived you may live longer.” -------------------------------------------------- కొందరు అవధానులు తిరుపతి వేంకట కవులు ఈ కాలం వారు: గరికపాటి నరసింహా రావు మేడసాని మోహన్ మాడుగుల బులుసు అపర్ణ టాటా సందీప్ కుమార్ --------------------------------------------------- ఆటగాళ్లు క్రికెట్ బుచ్చి బాబు నాయుడు వెంకటపతి రాజు వి వి ఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు చదరంగం కోనేరు హంపి పెండ్యాల హరికృష్ణ బాడీ బిల్డింగ్ కోడి రామ్మూర్తి నాయుడు లక్ష్మణ్ రెడ్డి వెయిట్ లిఫ్టింగ్ దండమూడి గోపాల్ రావు కరణం మల్లీశ్వరి బాడ్మింటన్ పి వి సింధు జ్వాలా గుత్త శ్రీకాంత్ కిదంబి -------------------------------------------------- నాకు నచ్చిన దర్శకులు విఠలాచార్య, బాపు, విశ్వనాథ్ త్రివిక్రమ్, క్రిష్ తెలుగు చిత్రసీమ నటులు/ నటీమణులు సౌకార్ జానకి, సావిత్రి, భానుమతి, అంజలీ దేవి, శారద, జమున, కృష్ణ కుమారి, సూర్య కాంతం, జయలలిత వాణిశ్రీ, మాధవి, భానుప్రియ, శ్రీదేవి, జయ ప్రద జయ సుధ, సుమలత, రాధ నిర్మలమ్మ, అన్నపూర్ణ విజయశాంతి, రోజా ఊహ, రంభ, రాశి, రవళి, మీనా, సంఘవి సౌందర్య అనుష్క, తమన్నా,... చిత్తూరు నాగయ్య ఎస్ వీ రంగా రావు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు గుమ్మడి, జగ్గయ్య, రమణారావు, రేలంగి, పద్మనాభం, సీఎస్సార్, చలం, రాజి బాబు కైకాల సత్యనారాయణ రావుగోపాల్ రావు, నాగభూషణం, గొల్లపూడి మారుతీ రావు శోభన్ బాబు కృష్ణంరాజు ఘట్టమనేని కృష్ణ సోమయాజులు కోటా శ్రీనివాస రావు బాబు మోహన్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, నరేష్, చంద్ర మోహన్, రాజేంద్రప్రసాద్, భానుచందర్, శ్రీకాంత్, సాయి కుమార్, రజినీకాంత్, ... పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మొదలగు వారు... మధుషాలిని, స్వాతి, అర్చన, హరి ప్రియా, గీతాంజలి, బిందు మాధవి,... గాత్రం జానకి, జిక్కి, శైలజ చిత్ర, సునీత, ఉష గీతా మాధురి, రావూరి శ్రావణ భార్గవి, మాళవిక,.... ఘంటసాల వెంకటేశ్వర రావు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం హేమచంద్ర,.... --------------------------------------------------- పేర్కొదగిన భషాభిమాని చా ఫి బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (ఆంగ్లం: Charles Phillip Brown) తెలుగు సూర్యుడు, తెలుగు సేవ చేసిన సి పి బ్రౌన్ దొర వంటి తెలుగు వారు మనకు ఉన్నారంటే ఇది మన భాష సొబగు, హృదయాలు కరిగించే అందం, అట్టి మహనీయుల కృషి ఆయన్ని ఆంధ్ర భాషోద్ధారకుడు అన్నారట, ఆ బిరుదు ఇంకా పెద్దది, కొన్ని చోట్ల ఆంగ్ల అక్షరాలలో పేర్కొనబడింది , అది సరిగ్గా దొరకలేదు, సరిగ్గా గ్రంధస్థం కాబడలేదేమో అమెరికా, ఫ్రెంచ్ ఇతర దేశస్థులు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు, మీ మంచి మనసుకు ధన్యవాదాలు. --------------------------------------------------- తెలుగుదనానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచింది : ఎన్టీఆర్ తెలుగు కోసం ప్రాణం పెట్టింది కూడా, ఎన్టీఆర్ గారే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు, ఈ కాలంలో ఎన్టీఆర్ ఇది మనము చూస్తే పోల్చుకోదగిన నిజం వారు శ్రీకృష్ణదేవరాయలేనేమో అన్నది నా భావన తెలుగు వారు, తెలుగుదనం ఉన్న వారు ఉన్న భూమి, తెలుగు భాషాభిమానులు నడయాడిన, పని చేసిన భూమి మనది. వీరి సేవలకు పులకించితిని. జై తెలుగు తల్లి పాటంటే ఇలాగే ఉండాలి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ధన్యోస్మి హరి ఓం రాజ్

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు