ఠక్కున చెప్పండి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఠక్కున చెప్పండి.

పురాణప్రశ్నలు-సమాధానాలు

 1)దశరధుడు ఎవరితోపోరాడే సమయంలో కైకేయికి వరాలు యిచ్చాడు.?

2)విశ్వామిత్రుని తో వెళ్లిన రాముడు తాటకిని ఎన్నో రోజున సంహరించాడు.

3)అహల్య పేరుకు మరో అర్ధం ఏమిటి?

4) సీతాపహరణ సమయంలో రాముని వయసు ఎంత?

5)వాలి సుగ్రీవుల పోరాటంలో,సుగ్రీవుడు ధరించిన పూలమాల పేరేమిటి?

6) సుగ్రీవుని రాజును చేసి,రామ లక్ష్మణులు నివసించిన పర్వతంపేరేమిటి?

7)రామకార్యంపై వెళ్లే హనుమంతుని అడ్డగించిన నాగమాతపేరేమిటి?

8)సుగ్రీవుని వానర సైన్యాధిపతుల పేర్లేమిటి?

9)అనరణ్యుడు ఎవరిని శపించాడు?

10)లంకానగరం నాలుగు ప్రముఖ ద్వారాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి?

11)లంకా నగరం అంతా ఎవరి పరివేక్షణ లోఉంది?

12)ఓక యోజనం అంటే ఎన్ని మైళ్లు?

13)నాగులరాజ్యం భోగవతి దీన్ని పాలించేరాజు పేరేమిటి?

14)అహిరావణుడు ఎవరి చేతిలో మరణించాడు? 15)రావణుని శ్రీరాముడు ఏఅస్త్రంతో సంహరించాడు?

సమాధానాలు:

1)శంభరాసురుడు.2)మూడవరోజు. 3)సంధ్యవెలుగు. 4)ముఫైఎనిమిదిమైళ్లు. 5)గజపుప్పమాల.6)ప్రసరణ.7)సురస. 8)ద్వివిదుడు-మైందుడు-నీలుడు-నలుడు-వికటుడు-ధధిముఖుడు-కేసరి-కుముదుడు-గఘుడు-గవాక్షుడు-జాంబవంతుడు. 9)రావణుని. 10)తూర్పున ప్రహస్తుడు.దక్షణం మహాదరుడు. మహాపార్మ్వుడు.పడమర ఇంద్రజిత్.ఉత్తరం రావణుడు. 11)విరూపాక్షుడు. 12)ఐదు. 13)దర్విశరుడు.14)హనుమంతుని 15)బ్రహ్మస్త్రం.