టంగుటూరి ప్రకాశం పంతులు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

టంగుటూరి ప్రకాశం పంతులు .

బహుముఖ ప్రజ్ఞాశాలి టంగుటూరి ప్రకాశం పంతులు.
(మే 20 తేదిన వర్ధంతి సందర్బంగా)
ప్రకాశం వారు 1872/ఆగస్టు /23 వతేదిన నేటి ప్రకాశం జిల్లాలోని
వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్నించారు.మొత్తం ఆఇంట ఆరుగురు సంతతి.వీరిది వంశపారంపర్యంగా
గ్రామ కరణం వృత్తి. ప్రకాశం వారు తన పదకొండవ ఏటనే తండ్రిని కోల్పోయారు. తల్లి పూటకూళ్ళ(భోజనశాల)నడుపుతున్న గడవని స్ధితి.ధనికుల ఇళ్ళలో ప్రకాశం వారాలకు కుదిరారు.చదువుతూనే నాటకరంగానికి సేవలు అందించేవారు.వల్లూరులో మిషన్ పాఠశాల ఉపాధ్యాయులు ఇమ్మినేని హనుమంతురావు నాయుడు పరిక్ష ఫీజు కట్టడంతో మెట్రిక్ ఉత్తిర్ణత పొందిన అనంతరం ప్రకాశం వారిని రాజమండ్రి తీసుకువెళ్ళి ఎఫ్.ఏ.చదివించారు ఆయన.
అనంతరం మద్రాసు 'లా'కాలేజిలో చేరి ఉత్తిర్ణులైనారు.తన అక్కకూతురు హనుమాయమ్మను అద్దంకిలో వివాహం చేసుకున్నారు.కొంతకాలానికి తల్లిమరణించారు. ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి,1894లో రాజమండ్రి చేరి డబ్బు,పేరు పుష్కలంగా సంపాదించారు.
1940 లోఇంగ్లాండ్ వెళ్ళి 'బారిష్టర్' చదువు పూర్తి చేసుకుని వచ్చి
1901లో మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందారు.
ఆరుపైసలకు కిలోబియ్యం అమ్మేరోజుల్లో ఓ కేసు గెలిచి 70 వేలరూపాయల ఫీజుపొందారాయన. హాలెండ్,డెన్మార్క,స్వీడన్,ఇటలి,జర్మని వంటి పలుదేశాలు సందర్శించారు.
రాజకీయాలపై ఆసక్తితో తన 35వఏట 1903 లో రాజమండ్రి మునిసిపల్ ఛైర్మెన్ గా ఎన్నిక అయ్యారు.1921 లో గాంధీజి పిలుపుకు స్పందించి నెహు గారితో కలసి జనవరి 24 న కోర్టులు బహిష్కరించారు ప్రకాశం.
ఆసంవత్సరమే 'స్వరాజ్యం'అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభించారు.ఈపత్రిక మూడుభాషల్లో 14 ఏళ్ళు నడచింది. 1926 శాసనసభకు ఎన్నికై నాలుగేళ్ళు సేవలు అందించారు.
1928 ఫిబ్రవరి 3 న 'సైమన్' కమీషన్ వ్యెతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిపారు.
లో 1930 లోజరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గోని చెరసాల శిక్ష అనుభవించారు.1937 లో మద్రాసు రాష్ట్ర మంత్రి మండలిలో రెవిన్యూ మంత్రిగా పనిచేసారు.తెన్నేటి విశ్వనాధం వారి సహాకారంతో జమిందారి వ్యవస్ధ నిర్మూలనకు ఆరు వేల పేజిల రిపోర్టు తయారు చేసారు.1941 వ్యక్తి సత్యాగ్రహం. 1942 లో 'క్విట్ ఇండియా'ఉద్యమాలలో పాల్గేని చెరసాల శిక్ష అనుభవించారు.
అంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు మద్రాసులో 13నెలలు ముఖ్యమంత్రిగా,రాష్ట్రం ఏర్పడిన తరువాత కర్నులులో ముఖ్యమంత్రిగా ఉన్నారు.వీరి పరిపాలనా కాలంలోనే తిరుపతిలో శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయం ఏర్పడింది.ఒంగోలు జిల్లాగా ఏర్పడినపుడు దానికి వీరి పేరున'ప్రకాశం'జిల్లాగా మార్చారు. తన యావదాస్ధి ప్రజాహితాలకే వినియోగించిన ఈ మహనీయుడు.తన 84వ ఏట హైదరాబాద్ వెళుతూ వడదెబ్బకు లోనై ఈధన్యజీవి 1957/ మే/20 వ తేదిన తుది
శ్వాసవిడిచారు.

మరిన్ని వ్యాసాలు

లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు