అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం) - డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్

అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం)

అశ్రద్దకు ఆనవాళ్లు ..!! (వ్యాసం ) నిత్య జీవితంలో మన జీవనవిధానం సాఫీగా సాగిపోవాలంటే కొన్ని తప్ప  ని సరి నిత్య కార్యక్రమాలు ఉంటాయి . వాటిల్లో ఏది దారితప్పినా  మన జీవన శైలిలో ఎలాంటి మార్పు వచ్చినా ,దాని ప్రభావం మొత్తం శరీరం మీద పడే అవకాశం వుంది ,అంతమాత్రమే కాదు ,కొన్ని సమస్యలు  మొదలై మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం వుంది.  ఇక్కడ అశ్రద్ధయే ప్రముఖ పాత్రవహించి ,సమస్యలకు కారణం అవుతుంది చాలా మంది ,తమ అశ్రద్ధవల్లనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్న విష యం ,గుర్తించరు-గమనించరు. తాము చేస్తున్న పనిమీద అంత నమ్మకం  ఉంటుంది . అందుకే అది కనిపించని అశ్రద్ధ అవుతుంది .  మనిషి ఉదయం లేవగానే,అతని లేదా ఆమె గురి కాలకృత్యాలమీద పడు  తుంది. ఈ కాలకృత్యాలలో ఒక ముఖ్యమైన భాగం ‘దంత ధావనం’అంటే  పళ్ళు తోముకోవడం అన్నమాట !ఇది కొంతమంది ఎంతో శ్రద్దగా,పద్దతిగా  చేస్తే,కొంతమంది చేయాలికాబట్టి అన్నట్టు ,ఏదో పని చేసుకుంటూనే లేదా  పేపరు చదువుకుంటూనో ,అయింది అనిపిస్తారు. వెంటనే కాఫీనో ,టీనో ..  తాగడానికి దంతధావనం ఒక లైసెన్సు అనుకుంటారు . ఇలాంటి వారిలో నూ ,శ్రద్దగా దంతధావనం చేసినా ,అది శాస్త్రీయ పద్దతిలో చేయకపోతే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి . అంటే పళ్ళు తోముకునేటప్పు  డు ,బ్రష్ గానీ ,పంటిపుల్ల గానీ ,మొత్తం పంటి భాగాన్ని శుభ్రం చేయని  పరిస్థితుల్లో ఎదురయ్యే ముఖ్య సమస్య ‘పంటి గార ‘ (అంటే గట్టిపడ్డపాచి) దీనిని చాలామంది గమనించరు . పలుచని పొరలు .. పొరలుగా ఏర్పడిన  పాచి (plaque)క్రమంగా గట్టిపడిపోతుంది . గట్టిపడిన పాచి ,బ్రష్ తో ఎట్టి  పరిస్థితిలోను శుభ్రపడదు . అంతే కాదు పంటికి చిగురుకు సమస్య లు సృష్టిస్తుంది .  ప్రాధమిక స్థాయిలో గార ఏర్పడుతున్న పరిస్థితి తెలియదు . ఎందుచేత-- నంటే ,ఈ గార పంటికీ -చిగురుకు మధ్య ఏర్పడితే అసలు వున్నట్టే తెలీదు . తరువాత క్రమంగా పరిశుభ్రం కానీ ఆ .. గార పంటి భాగంపై  చిగురును ఆనుకుని ఏర్పడుతుంది . కొందరిలో పంటిని మూసేసే స్థాయి లో పెరిగిపోతుంది . చాలామంది దానిని ఒక సమస్యగా గుర్తించరు సరి- కదా ,బ్రషింగ్ మాని ,పళ్ళను చేతితో తోమడం మొదలుపెడతారు. దీనివల్ల పంటి పాచి మరింతగా పెరిగే అవకాశం ఉంది . ఈ గార గురించిన అవగాహన లేనివారు నష్టం జరగడం ప్రారంభం అయ్యేవరకూ అసలు దానిని పాటించుకోరు సరికదా ,దానిని ఒక సమస్య గా గుర్తించి దానికి  అసలు ప్రాధాన్యత నివ్వరు అప్పుడే ఈ సమస్య ,మరింత పెద్ద సమస్యగా  రూపాంతరం చెందుతుంది .  మరి .. ఈ గార (గాటిపడ్డ పాచి ,టార్టార్ లేదా కాల్ క్యులస్ )ఎలాంటి సమస్యలను సృష్టిస్తుందన్నది ఇప్పుడు తెలుసుకోవలసిన ముఖ్య విష యం . పంటి పింగాణీ పొర -చిగురు,సరిహద్దు భాగంలో నల్లగా గానీ,గోధు- మ,రంగులోగాని గార పొరలు పొరలుగా ఏర్పడి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది.ఒక్కోసారి ఆ గార ఎక్కువై ముక్కలు -ముక్కలుగా  రాలిపోవచ్చును . ఇలా గారపెరిగే కొద్దీ చిగురు దురాక్రమణకు గురై అరిగి  పోవడం మొదలవుతుంది , చిగురు అరిగిపోయిన భాగమంతా ‘ గార ‘ఆక్ర మించుకుని ఉంటుంది .  ఈ గారలో ,వ్యాధిని కలిగించే బాక్తీరియాలు కూడా ఉండడం మూలాన చిగురు వ్యాధి గ్రస్తమై ,చిగురులోని అతి సున్నితమైన రక్త నాళాలు పెళుసుగా మారి రక్త స్రావం జరుగుతుంది . పళ్ళు తోముకునే టప్పుడు  చిగుళ్ళనుండి రక్త స్రావం ఎక్కువై ,బ్రష్ కూడా రక్తంతో ఎర్రగా మారుతుంది చిగుళ్ళనుండి రక్తం కారుతుండడం వల్ల,భయపడి బ్రష్ తో పళ్ళు తోము-- కోవడం మానేస్తుంటారు . అలా చేయడం కరెక్టు పద్దతి కాదు . వీలయినం త సున్నితంగా పళ్ళు తోముకోవడం చిగుళ్ళను మర్దనా చేయడం మంచిదే ! చిగుళ్ళనుండి రక్తం కారడం వల్ల ,నోరు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.  ఇది ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అంశమే !పైగా రక్తంలోని విష పదార్ధా లు ,మొత్తం శరీరానికి సరఫరా చేసే మంచి రక్తంలో కలిసిపోయి ,శరీర- సంబంధమైన ,అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండు గా ,ఉంటాయి . అందుచేత ఈ .. గార విషయంలో అశ్రద్ధ అసలు పనికి రాదు .  తరువాత ,అతి ముఖ్యమైన విషయం ఏమంటే ,పంటి పటిష్టత ,గట్టిదనం , ఆరోగ్యం ,చిగురు ఆరోగ్య పరిస్థితి మీద ఆధార పడి  ఉంటుందన్నవిషయం  చాలా మందికి తెలియదు . ఎప్పుడైతే చిగురు వ్యాధి గ్రస్తమవుతుందో  అప్పుడు పన్ను పటిష్టత తగ్గి కదలడం మొదలవుతుంది . తర్వాత దాని- కదే రాలిపోయే ప్రమాదం వుంది . లేదా పంటి కదలిక భరించలేక ,తీయిం చుకునే పరిస్థితి ఏర్పడవచ్చు . అందు చేత పంటి -గారను ఎట్టి పరిస్థితి  లోనూ అశ్రద్ధ చేయకూడదు . మరి ,పంటి గార వల్ల ప్రమాద పరిస్థితి  ఏర్పడకముందే ,గారను గమనించి నట్లైతే ఏమి చేయాలో తెలుసుకుం-- దాం .  పళ్ళు తోముకోవడంలో ఎలాంటి లోపంవున్నా ఎక్కడైతే పన్ను పరి - శుభ్రతకు నోచుకోదో అక్కడ పాచి పేరుకుని పొరలుపొరలుగా ఏర్పడుతుం ది కదా !ఇది పైకి కనిపించేది దీనిని దంతవైద్యులు సున్నితమైన పరికరా ల ద్వారా తొలగిస్తారు . ఈ ప్రక్రియను ‘స్కేలింగ్ ‘ అంటారు . పరికరాన్ని  ‘స్కెలర్ ‘అంటారు . ఇది చేసేముందు రోగనిరోధక బిళ్ళలు(యాంటీ -బయోటిక్స్ )బాధానివారణా బిళ్ళలు (యాంటీ -ఇన్ఫలమేటరీ ) వాడి స్తారు . చిగుళ్ళనుండి రక్తం రాకుండా ‘స్టాలిన్ -ఆర్ ‘వంటి పేష్టులు  కూడా వాడి స్తారు . చిగుళ్ల వాపు తగ్గిన తర్వాత,చిగుళ్ళనుండి రక్తం  రావడం తగ్గిన పిదప ‘స్కెలింగ్ ‘ సహాయంతో పంటి గారను తొలగించి  పంటిని శుభ్రం చేస్తారు . గారను తొలగించిన వెంటనే చిగురు వాపు , చిగుళ్ళనుండి రక్తం కారడం పూర్తిగా తగ్గిపోవడమే కాక ,చిగురు అరుగు- దల కూడా తగ్గి ,నోటి దుర్వాసన ,పళ్ళు కదలడం వంటి సమస్యలు తొలగి  పోతాయి .  ఇలా కాకుండా ,మనకు కనిపించకుండా ,పంటికీ -చిగురుకు మధ్య గార  పేరుకుని ఉండవచ్చు . ఇది స్కెలింగ్ పద్దతిలో తీసే అవకాశం ఉండదు .  చిన్న శస్త్ర చికిత్స పద్దతిలో చిగురును పన్నునుండి వేరుచేసి పంటి - మూలం (రూట్ )గార ,ఇతర వ్యాధి కారక పదార్ధాలను వేరుచేసి తిరిగి  చిగురును పంటికి అతికిస్తారు . దీనిని సాంకేతిక పరమైన భాషలో  ‘క్యురేటాజ్ ‘అంటారు . ఇలా పంటి గారను తొలగించిన తర్వాత దంత - వైద్యులు కొన్ని జాగ్రత్తలు గుర్తు చేస్తారు . వాటిని తప్పక పాటించాలి .  కొన్ని జాగ్రత్తలు --- శాస్త్రీయ పద్దతిలో పళ్ళు తోముకోవడం ఎలాగో అడిగి తెలుసుకుని ఆ ..  విధంగా దంతధావనం చేసుకోవడం ద్వారా దంతాలను సంరక్షించు కో - వచ్చును .  ‘సాఫ్ట్ -బ్రష్ ‘లు వాడడం ఆరోగ్యకరం . అయిదునిముషాలకు మించి పళ్ళను తోమకూడదు . బ్రష్ పై ఎక్కువ వత్తిడి పెట్టి పళ్ళు తోమకూడదు.  ఉదయం ఒకసారి ,రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మరొకసారి బ్రష్ - చేసుకోవడం మంచిది .  నచ్చిన పేస్ట్ తోగాని ,దంత వైద్యులు సలహా మేరకు వాడుతున్న ఔషధ - పరమైన పేస్ట్ తోగానీ ,బ్రష్ తో తోముకున్న తర్వాత ,’గం టోన్ ‘వంటి పొడితో రెండు నిముషాలపాటు చిగుళ్లపై రుద్దడం వల్ల చిగుళ్ల ఆరోగ్య పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది . ఈ పొడి కూడా రెండుపూట- లా వాడడం మంచిది . తరచుగా దంతవైద్య పరీక్షలు చేయించుకుని మళ్ళీ గార రాకుండా జాగ్రత్త పడాలి . గుండె జబ్బులు ,మూత్రపిండాల - జబ్బులు ,కీళ్ళకు సంబందించిన జబ్బులు వున్నవాళ్లు ఈ గార విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి .  ఎలాంటి ఆహార పదార్ధాలు తిన్నా ,పానీయాలు త్రాగినా శుభ్రంగా మంచి - నీటి తో నోరుపుక్కిలించే అలవాటు చేసుకోవడం మంచిది .  మనిషి ఆరోగ్యంగా వుండి బ్రతికి బట్టకట్టాలంటే ,బ్రతికినంత కాలం దంతాలను సంరక్షించుకోవాలి . ఆహారాన్ని క్షుణ్ణంగా నమలడంలోనూ  నమిలిన ఆహారం చక్కగా జీర్ణమై రక్తంగా మారడంలోనూ ,దంతాల పాత్ర  చాలా ముఖ్యమైనది . అందుకే జీవితంలో ‘దంత -సంరక్షణ ‘కూడా అంతే  ముఖ్యమన్న విషయం మరువరాదు !      *** డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మ కొండ .  

మరిన్ని వ్యాసాలు

డా.సర్వేపల్లి రాధాకృష్ణ
డా.సర్వేపల్లి రాధాకృష్ణ
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
తెన్నేటి విశ్వనాథం.
తెన్నేటి విశ్వనాథం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.
బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రక్తం -రక్తదాన ఆవశ్యకత
రక్తం -రక్తదాన ఆవశ్యకత
- కందర్ప మూర్తి
మంగళంపల్లి బాలమురళికృష్ణ.
మంగళంపల్లి బాలమురళికృష్ణ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మొక్కపాటి నరసింహ శాస్త్రి.
మొక్కపాటి నరసింహ శాస్త్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
న్యాయపతి రాఘవరావు.
న్యాయపతి రాఘవరావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.