గుడిపాటి వెంకట చలము - ambadipudi syamasundar rao

గుడిపాటి వెంకట చలము
తెలుగు సాహిత్యములో తేజోమూర్తి, తెలుగు సమాజములో సంచలనము సృష్టించినా చలము గాప్రసిద్ధి కెక్కిన గుడిపాటి వెంకట చలము చాలా ప్రత్యేకతలు ఉన్న రచయిత ఒక రకముగా చాలా వివాదాస్పద రచయిత జీవికితాంతము స్త్రీ స్వేచ్ఛ,కోసము ఆందోళన చెంది తన జీవితాంతము రచనలు చేసిన వ్యక్తి. దొంగ మర్యాదలు, దగాకోరు మాటలను ద్వంద నీతుల్ని అసహ్యించు కొనేవాడే చలము. హిపోక్రసి వద్దనేవాడు ఈయనది చాలా అరుదైన వ్యక్తిత్వము స్త్రీ స్వేచ్ఛకోసము తాపత్రయ పడటమే అయన పాలిట శాపములా మారింది తానూ నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ సాంప్రదాయాలకు విరుద్ధముగా కీవితము కొనసాగించాడు ఎన్నో ఇబ్బందులకు గురైనాడు బహుశా తెలుగు రచయితలలో సన్మాలనాలకన్నా దూషణ తిరస్కారాలను పొందిన రచయితా ఈయన ఒక్కడే అనుకుంటా ఒకటైమ్ లో ఇంట్లో చలము రచనలు కనిపిస్తే చాందస భావాలు ఉన్న పెద్దవారు ఒప్పుకొనేవారుకాదు అందునా ఆడవారు చలము నవలలు చదవటం నిషిద్దము చలము కాలము నాటికి నేటి సమాజ పరిస్తుతులకు చాలా తేడావుంది సమాజములో స్త్రీలు పురుషులతో సమానముగా ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఈ దిశలో చాలా రకాల శాసనాలు తెచ్చాయి ఇంకా ఏంతో మార్పు రావలసిన అవసరము ఉంది. అందుకే నూరేళ్ళ తరువాత కూడా చలము రచనలు అజరామరంగా నేటికీ దర్శన మిస్తున్నాయి.
చలము గారు మద్రాసు లో1894 మే 19న ఒక సంపన్న చాందస బ్రాహ్మణ కుటుంబములో కొమ్మూరి సాంబశివరావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు తాతగారైన గుడిపాటి వెంకట్రామయ్యగారు చలము ను దత్తత తీసుకోవటం వలన ఇంటి పేరు గుడిపాటి అయింది సాంప్రదాయకుటుంబములో పుట్టటం వలన చిన్నప్పటినుండి బుద్దిగా త్రికాల సంధ్యావందనము , గాయత్రి జపము చేసేవాడు. హైస్కూలు చదువు పూర్తికాకమునుపే రామాయణ, భారత భాగవతాలను క్షుణ్ణముగా చదవటం పూర్తిచేసాడు చిన్నతనములోనే సీతమ్మ భూమాతలోకి ఎందుకు ప్రవేశించింది అని ఆవేదనతో ఆ నాటి సమాజానికి ఎదురు ప్రశ్న వేసాడు కుటుంబము విషయానికి వస్తే తండ్రి తన తల్లిని వేధించటం చలము పసి హృదయము పై చెరగని ముద్ర వేసింది. అలాగే తన చిన్నారి చెల్లెలికి బాల్య వివాహము చేస్తున్నప్పుడు ఆడవాళ్లు ఎంతటి అబలలు అని వాపోయాడు 1911లో చలము పిఠాపురం మహారాజా కాలేజీలో చేరి బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నము గారి బ్రహ్మ సమాజము వైపు ఆకర్షితుడైనాడు. తర్వాత మద్రాసు వెళ్లి బిఎ చదివాడు.చలము చిన్నవయస్సులోనే రంగనాయకమ్మను వివాహము చేసుకున్నాడు బిఎ చదువుతున్నప్పుడు తన భార్య చిట్టి రంగనాయకమ్మను సెయింట్ థామస్ కాన్వెంట్ లో చేర్పించి ఆవిడను రోజు తన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని కాన్వెంట్ కు తీసుకెళ్లేవాడు. ఆనాటి సమాజము ఈ దృశ్యాన్ని వింతగా చూసేది దీంతో చలము మామగారు తన ఇంటి గడప తొక్కవద్దని శాసించాడట.పెళ్లిచేసుకుంది మీ ఇంట ఉండటానికి కాదు అని భర్తతో ఉండటానికి సిద్దపడింది. అప్పటికి ఆవిడా వయస్సు 13 ఏళ్లు
ఆ రోజుల్లోనే చలము స్త్రీ స్వేచ్ఛగురించి ధర్మసాధన అనే పత్రికకు వ్యాసాలు వ్రాసేవాడు. డిగ్రీ పూర్తిచేసిన చలము కాకినాడ కాలేజీలో ట్యూటర్ ఉద్యోగమూ లో చేరి కాకినాడలో కాపురము పెట్టాడు. అప్పటి నుండి బ్రహ్మ సమాజము ఉద్యమములో చురుకుగా పాల్గొంటూనే రత్తమ్మ తో స్నేహము, ప్రేమలో పడ్డాడు వంటి నవలలు వ్రాసాడు. 1920లో టీచర్ ట్రైనింగ్ కు రాజమండ్రి వెళితే చెడిపోయిన చలము అని ముద్రవేసి ఎవరు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి ఒప్పకోకపోతే పశువులపాకలోతలదాచుకున్నాడు. సొంతవాళ్ళు అనుకున్నవాళ్ళే చలాన్ని దూరము పెట్టారు భోజనము పెట్టె వాళ్ళే కరువయ్యారు అటువంటి పరిస్థితిలో టీచర్ ఉద్యోగానికి హొస్పెట్ వెళ్ళాడు అక్కడ కొంతకాలము పనిచేసి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగమూ సంపాదించి రాజమండ్రి వచ్చాడు రాజమండ్రిలో ఉండగానే చలము తన పదునైనభావాలకు అక్షర రూపము ఇచ్చి నవలలు, కధలు, నాటికలు వ్యాసాలు ఆత్మకథ లాంటివి ఎన్నో వ్రాసాడు. వీటన్నిటిలో అయనకు స్త్రీల పట్ల ఉండే ఆర్తి, ఆవేదన స్పష్టముగా కనిపిస్తుంది.తనకు దైవము తరువాత స్త్రీయే ఆరాధ్య దైవము అని స్వయముగా ప్రకటించుకున్నాడు చలము. స్త్రీలు బాధపడుతుంటే తానూ భరించలేనని అంటాడు.
ఈయన రచనలలో పెద్ద పెద్ద సమాసాలు, అర్ధము కానీ పదాలు ఉండవు సాధారణముగా ఇళ్లలో మాట్లాడుకొనే భాషే ఉంటుంది అయన రచనలలో మనిషిలోని మనస్సు మాట్లాడుతున్న భావము కలుగుతుంది. చలము రచనలను పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు కొందరు చలము స్త్రీ పక్షపాతి అంటే కొందరుచలము స్త్రీలను చెడగొట్టాడని అన్నారు "నాపుస్తకాలు చదవద్దని పిల్లలను హెచ్చరించే కొంతమంది పెద్దలు వాటిని ఎవరి కంటబడకుండా పేపర్ లో చుట్టి మేడ మీదకు తీసుకెళ్లి చదివి నన్ను తిడతారు"అని చలము అంటుండేవాడు. 1925లో స్త్రీ వ్యాస సంకలనానికి ముందు మాట వ్రాస్తూ,"స్త్రీ కి శరీరము ఉంటుంది,దానికి వ్యాయామము కావాలి, ఆమెకు మెదడు ఉంటుంది దానికి జ్ఞానము ఇవ్వాలి ఆమెకు హృదయము ఉంటుంది దానికి అనుభవము ఇవ్వాలి అని గుర్తించని ఈ దేశానికి నేను వ్రాసే సంగతులు అర్ధము అవుతాయా?అని సూటిగా ప్రశ్నించి ,తనను తిడతారని కూడ నాకు తెలుసు" అని అంటాడు. ఇష్టము లేనిదే ప్రేమ లేనిదే భర్తకైనా శరీరాన్ని అర్పించరాదని స్త్రీలను ఉద్భోధించాడు ఈ రకమైన భావజాలము వల్ల చలము వివాహ వ్యవస్థను ధిక్కరిస్తున్నాడని విశృంఖలత్వాన్ని ప్రజల మీదకు ఉసిగొల్పుతున్నాడని స్వేచ్చాప్రణయాన్ని ప్రోత్సహిస్తున్నాడని చలము ఆడవాళ్లను లేచి పొమ్మంటున్నాడని సాంప్రదాయ వాదులు గగ్గోలు పెట్టారు.అవహేళన చేసినవారిని ధైర్యముగా ఎదుర్కొనండి చలము హెచ్చరించాడు.పిరికితనాన్ని ఎదిరించేవాడు అయన. ఆయనకు హిపోక్రసి నటన, మెచ్చుకోలులు నచ్చేవి కావు. స్త్రీకి తన జీవితము మీద శరీరము మీద మనస్సు మీద సంపూర్ణాధికారము ఉండాలని వాదించేవాడు అవసరమైతే ఈ అధికారము కోసము స్త్రీలు పోరాడాలని అంటుండేవాడు ఆ ఎదుర్కొనే శక్తిని స్ఫూర్తిని తన రచనల ద్వారా స్త్రీలకు అందించే ప్రయత్నమూ చేసేవాడు. చలము రచనలను బూతు సాహిత్యముగా జమకట్టి వెలివేసినంత పని సాంప్రదాయ వాదులు చేస్తే చలము 1950 ఫిబ్రవరిలో తనవారితో భగవాన్ రమణమహర్షి ఆశ్రమమం అరుణాచలం చేరాడు అక్కడ ఆధ్యాత్మిక జీవనము సాగిస్తూ రవీంద్రుని గీతాంజలిఅనువాదం, వనమాలీ, భగవాన్ స్మృతులు వంటి రచనలు చేసాడు. అక్కడ ఆశ్రమములో కూడా ఎందరో మోసపోయిన స్త్రీలకూ, సంసార సమస్యలతో వచ్చేవారికి ఆశ్రయము కల్పించేవాడు.
మీరచనల ద్వారా సంఘాన్ని మార్చగలరా అని అడిగితె "ఎందరో మత ప్రవక్తలు ,ఈ ప్రపంచములోకి వచ్చి వారి రక్తాన్ని చిందించారు బలిదానాలు చేశారు మనుషుల్ని ఏమి మార్చగలిగారు? అలాంటిది నావల్ల మనుషుల్ని మార్చటం నావల్ల అవుతుందా?"అని జవాబిచ్చాడు. అలాంటప్పుడు మీరు వ్రాయటము ఎందుకు అన్న ప్రశ్నకు కాకులు కూయటం వాటి స్వభావము అలాగే నా స్వభావాన్ని బట్టి నేను ఉండబట్టలేక వ్రాసాను అని సమాధానము ఇస్తాడు. చలము అక్షర ఋషి ఆయనను అర్ధము చేసుకోవటం అంత సులువైన పని కాదు స్త్రీ స్వేచ్ఛ సమానత్వము కోరేవారికి చలము రచనలు ఆదర్శప్రాయము స్త్రీ స్వేచ్ఛ కోసము అహర్నిశలు శ్రమించిన చలము అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమములో 1979 మే 4న కన్ను మూశారు. శ్రీ శ్రీ ,చింతా దీక్షితులు వంటి సాహిత్య ఉద్దండులకు యోగ్యతా పత్రాలు ఇవ్వగలిగినస్థాయి అర్హత ఉన్న మహా రచయిత చలము ఒక్కడే