ఒక కార్టూన్ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది!
గీతలతో గిలిగింతలు పెడుతూనే.. పదునైన వ్యంగ్యంతో సత్యాన్ని ఆవిష్కరరింప చేస్తుంది. "హాస్యానందం" మరియు "సత్యకళాభారతి" సంయుక్తంగా నిర్వహించిన "తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం - మే 20 వ తేదీన " హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ మహోత్సవానికి ఎందరో ప్రముఖులు విచ్చేసి సభకు మరింత శోభను చేకూర్చారు.
- మాజీ తెలంగాణ సలహాదారులు, డాక్టర్ కె.వి. రమణా చారి (IAS),
- ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ వి.ఎన్. ఆదిత్య,
- 'కార్టూన్ వాచ్' ఎడిటర్ శ్రీ త్రయంబక్ శర్మ,
- బాపురమణ అకాడమీ నుండి శ్రీ వి. సుబ్బరాజు, మరియు అక్షజ్ఞ పబ్లికేషన్స్ అధినేత శ్రీ అక్షజ్ఞ వెంకట్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమాన్ని అక్షరాలా విజయవంతం చేసిన నిర్వాహకులు.. సత్య కళాభారతికి చెందిన జె. సత్యనారాయణ గారు, సమన్వయకర్త బ్నిమ్ గారు, మరియు హాస్యానందం రాము.వి ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు.
డాక్టర్ కె.వి. రమణాచారి గారి ఆశీస్సులతో, హాస్యానందం నిర్వహించిన కార్టూన్ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు కార్టూన్ లోకంలో విశేష ముద్ర వేసిన మహానుభావుల పేరిట ప్రతిష్టాత్మక అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు.
- తలిశెట్టి రామారావు అవార్డు
- శేఖర్ అవార్డు - 2026
- బాపురమణ పురస్కారం - 2026
- అక్షజ్ఞ పురస్కారం - 2026
- బ్నిమ్ పురస్కారం - 2026
మరియు... తెలుగు కార్టూన్ రంగానికి చేసిన అమూల్యమైన సేవలకు గానూ, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ ప్రసాద్ కాజగారికి ప్రతిష్టాత్మక "కార్టూన్ మిత్ర 2026" పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు.
బాపురమణ అకాడమీ, అక్షజ్ఞ పబ్లికేషన్స్ హాస్యానందం సమర్పించిన ఈ అద్భుతమైన వేడుక.. తెలుగు కార్టూన్ల వైభవాన్ని, కార్టూనిస్టుల ఆత్మగౌరవాన్ని మరోసారి చాటిచేప్పింది.
సభా నంతరం విందు వినోదాలతో ఈ కార్యక్రమం సంతోష సంబరాలతో ముగిసింది.

