మన సినిమాల్లో వాడుక భాష. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మన సినిమాల్లో వాడుక భాష.

మన సినిమాల్లో వాడుక భాష.(సినిమా వ్యాసం)
తెలుగు సినిమాలు ప్రారంభ దశలో పౌరాణిక చిత్రాలే ఎక్కువరావడం ఆచిత్రాలలోని భాష నాటకాలలో వలే గ్రాంథిక భాషను వాడారు. కృతివెంట నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ' ప్రేమ విజయం'(1936) (ఈచిత్రానికి ' రాణి పేమలత'అనే మరో పేరు ఉందంటారు.)అనే తొలి సాంఘీక చిత్రంలో కూడా గ్రంధిక భాషనే వాడారు అలా సినిమా తీయడానికి కారణం నాడు రంగస్ధలంపై నటులు నాటక రచయితలు సంగీత దర్శకులు అంతా గ్రాంథిక భాషదారులే.
ఆరోజుల్లో నిర్మాత,దర్శకుడు హెచ్.యం.రెడ్డి నిర్మించిన'భక్త ప్రహ్లాద'
(15/సెప్టెంబర్/1931) విడుదలైన ఏకైకచిత్రం ఇది. 'పాదుకా పట్టాభిషేకం' (జనవరి 1932)-'శకుంతల'(1932) విడుదల అయ్యాయి.విషేషం ఏమిటంటే భక్త ప్రహ్లాద భాగవత అంశమైతే పాదుకా పట్లాభిషేకం రామాయణాంశము శకుంతల మహాభారత అంశము. ఇస్టిండియా కంపెని,కృష్ణా ఫిలింస్ అనే రెండు సంస్ధలు పోటాపోటీగా చెరో 'సతిసావిత్రి' నిర్మించి ఒకేసారి 4/2/1933న విడుదల చేసారు. ఇంకా 'రామదాసు'
(17/జూన్ /1933)-'పృద్విపుత్ర'-''చింతామణి' చిత్రాలు (1933) విడుదల అయ్యాయి. (1934)లో'అహల్య'-'లవకుశ' (9/ఫిబ్రవరి /1934)-'సీతాకళ్యాణం' మూడు చిత్రాలే విడుదల అయ్యాయి. 'శ్రీకృష్ణతులాభారం'(12/ ఏప్రియల్ /1935)-' సతీ సక్కుబాయి'
(21/ మే /1935) "' భక్త కుచేల' (6/ జూలై /1935)' హరిశ్చంద్ర' 16 /నవంబర్/1935) 'శ్రీకృష్ణలీలలు'(1/ జూలై /1935) (ఈ చిత్రంలో సాలూరి రాజేశ్వరరావు బాలనటుడిగా పరిచయం చేయబడ్డారు.) ఇంకా'సతీ అనసూయ'( 4/అక్టోబర్/1935)-'అనంతరం' రాణి-ప్రమీల'-'భక్త కబీరు'చిత్రాలు విడుదల (1936) లో విడుదల జరిగింది ఇంకా 'భక్తదృవ-అనసూయ' ( ఇది తొలి బాలల చిత్రం.ఇందులో బాలనటులుగా గాయని బాలసరస్వతి-కృష్ణవేణీ(జిక్కి)లు బాల నటులుగా పరిచయం చేసారు. )-'ద్రౌపతి వస్రాపహరణం'(29/ ఫిబ్రవరి/1936) (ఈచిత్రం ద్వారా నటుడు సి.యస్.ఆర్. శ్రీ కృష్ణుడుగా పరిచయం అయ్యరు.ఇంకా అర్జునుడిగా దొమ్మేటి సత్యనారాయణ, చొప్పవల్లి సూర్యనారాయణ ధర్మరాజుగా, దొమ్మేటి సూర్యనారాయణ భీముడిగా, యడవల్లి సూర్యనారాయణ దుర్యోధనుడిగా, వెల్లంకి వెంకటేశ్వర్లు కర్ణుడిగా, నెల్లురు నగ రాజారావు శకునిగా,కన్నాంబ ద్రౌపతిగా,కన్నాంబ భర్త కడారు నాగభూషణం అశ్వత్ధామగా నటించారు, ఈచిత్రం కొల్హాపూర్ లో నిర్మించి విడుదలచేసారు. నాటి గౌవర్నర్ చూడటానికి ధిల్లిలో ప్రదర్శింపబడిన ఏకైక తొలి తెలుగు చిత్రం ఇదే.ఈచిత్రాన్ని హెచ్.యంమ్.రెడ్డి పరివేక్షించారు. 'ద్రౌపతి మాన సంరక్షణం'( 24/మార్చి/1936) బొంబాయి లోను నిర్మించారు. ఇందులో శ్రీకృష్ణుడుగా బందా కనకలింగేశ్వరరావు, దుర్యోధనుడిగా బళ్ళారి రాఘవ, మునిపల్లె సుబ్బయ్య భీముడిగా, ద్రౌపతిగా సురభి కమలాబాయి,కర్ణుడిగా డా.శివరామకృష్ణయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య,దైతాగోపాలం,పారుపల్లి సుబ్బారావు.శ్రీరంజని తదితరులు నటించారు. (24/మార్చి/ 1936)న ఈచిత్రం విడుదల అయింది.ఇవి రెండు పోటి చిత్రాలు.
ఇంకా ' సతీ సులోచన' (ఈచిత్రంలో మునిపల్లె సుబ్బయ్య రావణుడుగా,ఇంద్రజిత్ గా ద్విపాత్రాభినయంచేసారు.)'వీరాభిమన్యు'-'మాయబజార్' 'సతీ తులసి' -' లంకాదహనం'-' ప్రేమ విజయం' చిత్రాలు (1936)లోనే విడుదల అయ్యాయి. వరకు వచ్చిన చిత్రాలన్ని గ్రాంథిక భాషలోనే ఉండేవి.(1937) లో 'బాలయోగిని'-'దశవతారాలు'-'మోహిని రుక్మాంగద'-'నరనారాయణ'-'రుక్మిణి కల్యాణం'-'విప్రనారాయణ'-'విజయ దశమి' -' సారంగధర' (ఇది తేలి చారిత్రక చిత్రం)ఇదే సంవత్సరం విడుదలైన 'కనకతార' తొలి జానపద చిత్రంగా చెప్పుకోవచ్చు.
1924లో తెలుగు నేలపై తొలిమూకి సినిమాథియోటర్ 'కృష్ణ సినిమా' రాజమండ్రిలో నిడమర్తి సూరయ్య గారు నిర్మించారు. అనంతరం ఇది టాకీ ధియోటర్ గా మారింది.
గూడవల్లి రామబ్రహ్మంగారు తెలుగు నేలపై చిత్రనిర్మాణానికి ఇచ్చిన పిలుపుకు స్పందించిన నిడమర్తి సూరయ్య గారు,(1936)తన సోదరుడు దుర్గయ్యతోకలసి 'దుర్గ సిని టోన్'సూడియో రాజమండ్రిలో తమ తోటలలో నిర్మించారు.సూరయ్య గారికుమారుడు ఎన్.ఎస్.మూర్తి సినీ ఆడియో లో శిక్షణ పొంది వచ్చి 'సంపూర్ణ రామాయణం' అనే చిత్రం నిర్మించి ఆర్ధికంగా దెబ్బతిని స్టూడియో మూసివేసారు.
ఆరోజుల్లో కాకినాడలో 'యంగ్ మేన్స్ హ్యాపి క్లబ్'అనే నాటక సంస్ధనుండి వచ్చిన వారు ప్రముఖ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్యగారు.వీరు మాట్లాడే భాషలో ప్రాంతీయ యాస వినిపించేది. వీరు రెండు 'లవకుశ' చిత్రాలుకు (తొలి లవకుశ 9/ ఫిబ్రవరి /1934)-మలి లవకుశ చిత్రం( 29/మార్చి /1963)వీరి దర్శకత్వంలో విడుదల అయ్యాయి.
వీరు దుర్గా సిని స్టూడియోని నెలకు వేయి రూపాయలు బాడుగకు తీసుకుని 'ఆంధ్రాటాకీస్' అని పేరు పెట్టి ఆవు దూడ పతాక చిహ్నంతో నవపధానికి బంగారు బాటలు వేస్తు'శ్రీ సత్యనారాయణ వ్రతం' అనే చిత్రాన్ని వాడుక భాషలో నిర్మించారు ఈచిత్రానికి రచనా సారధ్యం ముద్దుకృష్ణ నిర్వహించారు ఈసినిమాలో సత్యనారాయణుడిగా వాడ్రేవు కామరాజు, ఇతర పాత్రలలో దేవరకొండ రామ్ముర్తి,రేలంగి,కడియం మల్లాచారి, హైమావతి,లక్ష్మి నరసయ్య,యనమండ్ర రామకృష్ణయ్య,గొట్టిమాకుల కోటేశ్వరరావు తదితరులు నటించారు.
అలా వాడుక భాషలో చిత్రనిర్మాణం ప్రారంభం అయింది తెలుగు భాషా సాహిత్యాలలో వాడుకభాషను గిడుగు వేంకట రామ్ముర్తిగారు వ్యాప్తిలోనికి తీసుకు రావడానికి విషేషంగా కృషిచేస్తే,దానికి గురజాడ వారు మద్దత్తు పలికినట్లు సినిమాల్లో సి.పుల్లయ్యగారికి ముద్దుకృష్ణ మద్దత్తు పలికారు. ఆరోజుల్లో ఏచిత్రమైనా 14 నుండి16 వేల అడుగుల నిడివి ఉండేవి. వ్రతకల్పం ఆధారంగా నిర్మింపబడిన 'శ్రీ సత్యన్నారాయణ వ్రతం' చిత్రం పదివేల అడుగుల నిడివి మాత్రమే కావడంతో ఈచిత్రానికి అన్నవరం సత్య నారాయణ స్వామి డాక్యుమెంటరిని జతపరిచారు.
ఇంకా వందనరావు,కాళ్ళకూరి హనుమంతురావు, సుందరయ్య, శ్రీహరి,తులసినటించిన 'కాసులపేరు'అనే చిన్న చిత్రాన్ని మరియు సుబ్బారావు,పుష్పవల్లి(హిందీ నటి రేఖ తల్లి)నటించిన 'చల్ మోహనరంగా' నృత్యాన్నికూడా జతపరిచారు. 1938 జనవరి 12 న విడుదల జరిగిన తొలి తెలుగు వాడుక భాషాచిత్రంగా ఇది గుర్తింపు పొందింది.