ఆపద్భాంధవుడు - కందర్ప మూర్తి

ఆపద్భాంధవుడు

ఆపద్భాంధవుడు సమాజంలో సేవా దృక్పథంతో దానధర్మాలు చేసే చాలమంది మానవతావాదులు బడుగు బలహీన వర్గాల్లో ఆహార , వసతి , ఆరోగ్య ఇబ్బందులతో మానసిక శరీర వైకల్యంతో బాధ పడేవారికి ధన వస్తు వైధ్య పరంగా సహాయ పడుతూంటారు. అటువంటి వారు నిస్వార్థంగా పబ్లిసిటీ అవసరం లేకుండా సేవలు అందిస్తారు. వారికి ప్రాంతీయ కుల మత తారతమ్యాలుండవు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే వారి లక్ష్యం. ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు. క్రికెటర్ , కోట్లు కూడబెట్టిన సినేమా హీరో కాదు. సంపన్న వ్యాపారవేత్త, సామాజంలో పలుకుబడి కలిగిన సెలబ్రిటీ అసలేకాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన కాయకష్టంతో ఎదుగుతు సినేమా రంగంలో చిన్న పాత్రల సామర్థ్యంతో వచ్చి నేటి కరోనా మహమ్మారి విసిరిన పంజాతో విలవిల లాడుతు దీనావస్థలో ఉన్న బడుగు బలహీన వర్గ ప్రజలకు అన్ని విధాల ఆపన్న హస్తం అందిస్తూ దేశ ప్రసార మాధ్యమాల్లో పేరు మారు మోగుతున్న వ్యక్తి , ఆయనే సోనూసూద్. " నిన్ను వదల బొమ్మాళీ" అంటూ 'అరుంధతి ' సినేమాతో తెలుగు వారికి పరిచయమైన విలన్ గుండె నిండుగా దయా గుణం గల ఆపధ్భాంధవుడు సోనీసూద్ రియల్ హీరో. గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి కారణంగా అకస్మాత్తుగా లాక్ డౌన్ వల్ల అన్ని రవాణా ప్రయాణ సాధనాలు స్థంభించిన వేళ పొట్ట కూటికోసం స్వగ్రామాలను వదిలి జీవనోపాధి కోసం వేల కిలోమీటర్ల దూరంలో పరాయి రాష్ట్రాల్లో కుటుంబాలతో చిక్కుకుపోయిన వారికి తన స్వంత డబ్బుతో తగిన రవాణా తిండి ఏర్పాట్లు చేసిన మహోన్నత వ్యక్తి సోనూసూద్. దేశంలో చాలా ప్రాంతాల్లో హాస్పిటల్స్, ఇతర స్థలాలలో కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలను కాపాడు కోడానికి మృత్యువుతో పోరాడుతుంటే ఆపద్భాందవుడిగా ముందుకు వచ్చి ఎందరికో స్ఫూర్తిగా ఉంటున్నాడు ఈ హీరో. ప్రాంతీయ భేదం లేకుండా ఏ రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ప్రసార మాధ్యమాల ద్వారా కాని ప్రత్యక్షంగా ఆయన దృష్టికి వస్తే తక్షణం సహాయం అందచేస్తున్నాడు. నాదీ , నా కుటుంబం అంటూ స్వార్థంతో బతికే నేటి రోజుల్లో పెద్ద రాజకీయ నాయకులు చెయ్యలేని ప్రజాసేవ చెయ్యడం అభినందించ వల్సిన విషయం. ఆయనకు వెనుక సాయంగా ఎంతమంది మానవతావాదులు ఉన్నా ముందుండి సారధ్యం వహిస్తున్న సోనూసూద్ ఎందరికో మార్గదర్సకుడు. నిజమైన తెరముందు కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. భగవంతుడు వారిని ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరుకుందాము. 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు