చిలకవర్తి లక్ష్మి నరసింహం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

చిలకవర్తి లక్ష్మి నరసింహం.

 దేశంనాకు ఏంయిచ్చింది అనుకొకుండా దేశానికి నేనేమి యిచ్చాను అని తమసర్వస్వాన్ని దేశంకొసం అర్పించిన మహనీయులు ఎందరో వారిలో ఒకరైన..
గయోపాఖ్యానం సృష్టికర్త,కవి,ప్రసిధ్ధనాటక కర్త,హస్యనవలా రచయిత, పాత్రికేయుడు,వక్త,సంఘ సంస్కర్త,దేశభక్తుడు, జాతీయవాది, ఆంధ్రమిల్టన్ ,బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చిలకమర్తి వారు 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమగోదావరిజిల్లా వీరవాసము అనేగ్రామంలో వెంకయ్య వెంకటరత్నమ్మ గార్లకు జన్మించారు.వీరి తొలి పేరు పున్నయ్య.
1887 లోమెట్రిక్య్ లేషన్ పూర్తిచేసారు.1892 లో రాజమండ్రి ఇన్నిస్ పేటలోని పాఠశాలలో నెలకు పన్నేండు రూపాయల జీతంపై ఉపాధ్యాయుడిగా పనిచేసారు.
అదేసమయంలో ఇమ్మినేని హనుమంతురావుగారు రాజమండ్రిలో హిందూ నాటక సమాజాన్ని స్ధాపించి నాటక రంగానికి ఎంతోసేవచేసారు. అప్పుడే చిలకమర్తి వారు"కీచకవధ" "గయొపాఖ్యానం" "పారిజాతా పహరణం" "నలవిలాసం" "శ్రీరామజననం" "ద్రౌపతిపరిణయం" వంటి పలు నాటకాలు రాసారు.తను తొలిసారి ధవళేశ్వరంలో తిరుపతి వేంకటకవుల సమక్షంలో "అష్టావధానం"చేసారు. అప్పుడు ఆయన వయసు యిరవై నాలుగు.1894 లో న్యాయపతి సుబ్బారావు గారు నిర్వహించిన నవలల పోటిలో "రామచంద్రవిజయం" కి ,1896 లో చారిత్రాత్మక నవల"హేమలత"కు ,1897లో "అహల్యబాయి" రచనలు ప్రధమ బహుమతి పొందాయి.సమసమాజంకోరుతూ 1899 లోదళితుల కొరకు పాఠశాల ప్రారంభించారు.1915లో జాతీయ పాఠశాల కార్యదర్శిగాఉంటూ వయోజనుల కొరకు "వివేకానంద" పాఠశాల ప్రారంభించారు.రచయితగా "వేర్రిపప్పియ" "వెక్కిరింతల వెంగళప్ప" "నరకాసురవధ"1906 లో"ప్రహ్లదచరితము"1927 లో"చతుర చంద్రహస" 1922 లో"బమ్మెరపోతనా" "ప్రఛ్ఛనపాండవము" "పార్వతిపరిణయం" "ఆత్మగౌరవము" ద్రౌపతి వస్రాపహరణం" మరెన్నో సంస్కృతనాటకాలను అనువాదంచేసారు.టంగుటూరి ప్రకాశం పంతులుగారితో కలసి పలునాటకాల్లో స్త్రీ పాత్రలుపోషించారు. 1943 లోవీరి ని"కళాప్రపూర్ణ"బిరుదుతో ఆంధ్రకళాపరిషత్తువారు సత్కరించారు. తనఆత్మకథనురాసుకున్న చిలకమర్తివారు, సంఘసంస్కరణ ఉద్యమంలో కందుకూరు.గురజాడలకు తోడుగా నిలిచారు."మనోరమ" "సరస్వతి" "దేశమాత" వంటి పత్రికలను సమర్ఢవంతంగా నిర్వహించారు."భరతఖండమ్ము చక్కని పాడియావు,వంటిపలు గేయరచనలు చేసిన ఈసత్యాన్వేషి నిరాడంబరుడు 1946/జూన్ / 17న శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు.