చదువెందుకు ? - రఘు కుంచే

చదువెందుకు ?

ఆ చదువురాని గొర్రెలు పండిస్తేనే మనం తింటున్నాం ....

ఆ చదువురాని గొర్రెలు ఓటు వేస్తేనే మనం గెలుస్తున్నాం ....

ఆ చదువురాని గొర్రెలు అభిమానిస్తేనే మనం ' Celebrities ' అని Tags తగిలించుకుని మరీ Feel అవుతున్నాం ......

చిన్నప్పుడు మా ఊరిలో ఒక సామెత బాగా వినేవాడిని
"చదవేస్తే ఉన్న మతి పోయిందట " అని ..
ఆ సమయంలో చదువుని ఎటకారం చేస్తుంటే కోపం వొచ్చేది ... ఇప్పుడు కొంత మంది మేధావులుని చూస్తున్నపుడు ఆ సామెత నిజమే కదా అనిపిస్తుంది .
విషయానికొస్తా ...
తరతరాలుగా నమ్మకానికి , సైన్సుకి మధ్య ఉన్న పోరాటాన్ని డిసైడ్ చేసేది చదువు మాత్రమే కాదు ,
ఇక్కడ కేవలం అవసరం, ఆశ .
ఆ రెండు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తాయి ... ఇప్పుడు ఇక్కడ ఉన్నది మిణుకు మిణుకుమంటున్న మనిషి ప్రాణాలకి సంబందించిన ఒక ఆశ ...
మీ భాషలో "HOPE".
ఆ ప్రాణాన్ని ఎక్కడో ఒక “తీగో ,ఆకో ,పసరో, గింజో “ కాపాడుతుంది అంటే ,
గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ దొరక్కో , ప్రవేట్ హాస్పటల్లో చేరి లక్షల కి లక్షలు కట్టే స్థోమత లేకో ,
ఆ సమయంలో ఎక్కడో ఎవరో ఉచితంగా ఇచ్చే మందు వల్ల ప్రాణం నిలబడుతుంది అనే ఆశతో ఎంత దూరమైనా పరిగెత్తే వాళ్ళ నేరం ఏంటో ఒకసారి చెప్పండి ?
సరే ...
వాళ్ళ ఆత్రంతో , ప్రాణాలు కాపాడుకోవాలి అనే భయంతో
భౌతిక దూరాన్ని పాటించడంలేదు శాష్ట్రీయత గురించి తెలియదు , కేవలం మూర్ఖత్వం ,మూఢ నమ్మకం అనే అనుకుందాం !
Ok i agreed.
మరి విడుదలైన మొదటి రోజు పొద్దున్నే సినిమాలకి , రాత్రి పూట pub లకి , pravate పార్టీ లకు , House పార్టీలకి, function లకి వెళ్ళినపుడు మనం కూడా ఓఓ అంటూ Hug ల తో ముద్దుల్తో
వొళ్ళు వొళ్ళు రాసేసుకుంటాo కదా ...? ఇవన్నీ 2020 / 21 లో కూడా జరిగాయి కదా .. కరోనా ని అంటించుకున్నారు కదా చాలామంది ..
దాన్నేమనాలి ?

ఏమన్నా అంటే ....

What the heckkkk
What the F...
What’s Happening Der ?
omg 😱
ఏం జరుగుతుంది ఈ దేశంలో ?
ఈ జనం ఇంతే మారరు
వీళ్ళు గొర్రెలు , మూర్ఖులు
Etc Etc .....

ఇలాంటి ' Free Expressions ‘
Emoji లు ,
దెబ్బతిన్న మీ మనోభావాలు
Type చెయ్యడానికో , Troll చెయ్యడానికో ,
మీ దృష్టిలో చాలా బలంగానూ శాస్త్రీయంగాను ఉంటాయి
కానీ ....
ఇప్పుడు ఆ చదువు రాని , శాస్త్రీయత తెలీని గొర్రె తన పేద ప్రాణాన్ని నిలుపుకోడానికో , ఎవరినో నమ్మి గుండెని అరచేత్తో పట్టుకుని ఎక్కడికో బిక్కు బిక్కు మంటూ పరిగెడుతుంటే ...
నీకు నీ శాస్త్రీయత , నీ తొక్కలో ఎటకారం ఇపుడే గుర్తొచ్చాయా ?
వాళ్ళని నువ్వు ఎందుకు proper గా Educate చెయ్యవ్ ? నీకా బాధ్యత లేదా ?దెప్పుతావెందుకు .
వీలైతే నువ్వక్కడికి వెళ్లి మైక్ పట్టుకుని హెచ్చరించు ,
అవకాశం లేదు అనుకుంటే ,
మనం పొద్దున్న లెగిసిన కాడినుంచి
మన మనో భావాలని , మన future Analysis ని , మన సంస్కారాన్ని
స్వేచ్ఛగా విప్పి చూపించుకునే అవకాశాన్ని ఇచ్చిన
ఈ Fecebook ,Twitter ,insta whatsap తదితర 'ఉచిత 'మాధ్యమాలనుంచి వాళ్ళకి అర్థం అయ్యేలా భౌతిక దూరం ,mask , శుభ్రత గురించి వివరంగా ఓపిగ్గా వాళ్ళకి అర్ధమయ్యేలా తెలియచేయ్ ... కొంతమందికైనా చేరుద్దిగా మీ సందేశం .
ఏం ..కేవలం ప్రభుత్వాలకేనా ఆ బాధ్యత ?
మనకి లేదా ..?
ఇంటికో పోలీసుని
పెట్టలేవుగా ప్రభుత్వాలు మాత్రం ?
Explain చెయ్యండి sir & Madam ...
చెప్పండి ఎలుగెత్తి 🙏
అందరు బాగా చదుకున్నవాళ్ళేగా,
మేధావులo అని మీకు మీరే ఒక self Tag ని మనసులో వేసుకుని తిరిగేవాళ్ళేగా .
చెప్పండి .....
"మీరనుకునే " ఆ చదువులేని గొర్రెలకి అర్థం అయ్యేలా , గొంతెత్తి మరీ చెప్పండి ...
తప్పేముంది ?
ఈ సమయంలో Ego లు దెబ్బతీసుకోడాలు , ఒకరి మీద ఎటకారపు యుద్దాలు , లేదా లేచిన దగ్గరనుంచి
అధికార పక్షం మీదో , ప్రతి పక్షంమీదో బురదలు చల్లుకోడాలు ఎందుకు ...?
అవతల వాళ్ళది కూడా ప్రాణమే కదా....
వీలైతే సహాయం చేద్దాం ,అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి
Free గా వొచ్చే సందేశం అయినా పంపిద్దాం .
అంతే కానీ ఈ satire లు ఎందుకు , వాళ్ళమీద చిరాకు ఎందుకు ?
వాళ్ళు మీలా మనిషులేగా ?
ఏం ..? చెప్పలేరా proper గా
కష్టమా ? సర్లెండి
అర్ధం చేసుకోగలను మిమ్మల్ని ,
మీ పరిస్థితిని ,మీ అసహనాన్ని .

నేను మాత్రం మీకు ఇంకేం చెప్పగలను
God bless you , Stay safe , మాస్క్ ధరించండి , చేతులు శుభ్రంగా కడుక్కోండి అని మాత్రం చెప్పగలను .
ఉంటాను Brother , Madam & Sir 🙏

....రఘు కుంచే🇮🇳