కన్నెగంటి హనుమంతు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కన్నెగంటి హనుమంతు.


కన్నెగంటిహనుమంతు-
పుల్లరి పోరాటంచేసి ఎందరికో స్వాతంత్ర్యోద్యమ సమరానికి దారిచూపిన వారు కన్నెగంటి.వీరు గుంటూరుజిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి సమీపంలోని కోలేకుట్ట శివారు ప్రాంతమైన మించాలపాడులో వెంకటయ్య అచ్చమాంబలకు1870 జూన్ లో జన్మించారు.వీరిది వ్యవసాయకుటుంబం.వీరు నివసించే ప్రాతంలో నీటికొరతవలన దుర్బిక్షం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి,జెట్టిపాలెం,రెంటచింతల ఏర్పడింది.పసువులను అడవిలో మేపుకునే వారిపై 'పుల్లరి'పన్నువిధించి, పన్నుచెల్లించనివారి పసువు లను బందెలదొడ్డిలో బంధించేవారు. వేధించసాగారు నాటి బ్రిటీష్ పాలకులు.ఉన్నవలక్ష్మినారాయణగారి సహాకారంతొ కన్నెగంటి పుల్లరి ని నిరాకరిస్తూ ఉద్యమం ప్రారంభించారు.అదేసమయంలో(1920) లో గాంధీజీ పిలుపుతో దేశమంతా సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు చురుగ్గా పాల్గన సాగారు.(1921మార్చి31)ఇదే విషయంపై విజయవాడలో జరిగిన కాంగ్రెసు సమావేశంలోమహాత్మ గాంధీ,కస్తూరిబాగాంధీ, ఆలిసోదరులు, వల్లభాయిపటేల్ ,విఠల్ బాయిపటేలు,జమునాలాల్ బజాజ్ ,మోతిలాల్ నెహ్రు,జవహర్ లాల్ నెహ్రు,లాలాలజపతిరాయ్ ,చిత్తరంజన్ దాసు, రాజేంద్రప్రసాద్ ,సరోజినిదేవి,అజాద్ ,అన్సారి,కిచ్లూ,సత్యపాల్ ,గిద్వాని,సేన్ గుప్తా,టండన్ ,రాజాజి,ప్రకాశం,డాక్టర్ పట్టాభి,వెంకటప్పయ్య, సాంబమూర్తి,గిరి,ఉన్నవ,కృపానిధి వంటివారి ప్రసంగాలతో ప్రజలు ఉత్తేజితులైనారు.గుంటూరుజిల్లా సహాకారోద్యమానికి ఉన్న వ లక్ష్మినారాయణగారు నాయకత్వంవహించారు.కన్నెగంటి పిలుపుతో అక్కడి ప్రజలు పుల్లరి కట్టకుండా అటవిశాఖ,రెవెన్యూ అధికారులను సాంఘీక బహిష్కరణ చేసారు.ఈఉద్యమాన్ని అణచివేయదలచిన నాటి ప్రభుత్వం కుట్రపన్నింది.మించాలపాడు నూటఇరవై ఐదు కుటుంబాలు ఉన్న కుగ్రామం.గ్రామానికి మూడు వైపులా కొండలు,ఉత్తరదిక్కున ట్టమైన అడవి.1922ఫిబ్రవరి 22 మహాశివరాత్రి పర్వదిన వేడుకలలో గ్రామప్రజలు నిమగ్నమై ఉన్నసమయంలో, వందమందితెల్లదొరల మిలటరీ వారు మించాలగ్రామం చేరుకుంది.కోలగట్ల కరణం సదాశివయ్య,దుర్గి సబ్ ఇన్ స్పెక్టర్ రాఘవయ్య మిలటరీకి దారిచూపుతున్నారు.అదెసమయంలో మించాలపాడు ఊరికి దక్షణభాగంలో కొండలోయ వద్దనున్న మంచినీళ్లబావి వద్దకు వచ్చిన పసువులను అడ్డగించిన మిలటరీ పసువులను తోలుకుపోసాగారు.పసుపులేటిచిన్నయ్య పసువులను వదలవలసిందిగా మిలటరీవారినికొరగా,అతన్ని విచక్షణలేకుండా కొట్టారు.ఆవిషయం తెలుసు కున్న కన్నెగంటి గ్రామ ప్రజలతో వచ్చాడు.కరణం సదాశివయ్య హెచ్చరించడంతో మిలటరీవారు గ్రామ ప్రజలపై కాల్పులుజరిపారు.ఆసంఘటనలో కన్నెగంటి పాలేరు యల్లంపల్లిశేషు అక్కడే అసువులు బాసాడు.మరోఇరవై ఎనిమిది గాయపడ్డారు.కన్నెగంటి శరీరానికి ఇరవైనాలుగు తూటాలు తగిలాయి.అయినా రెండు గంటలపాటు భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి ప్రాణంతో పోరాటం చేసి తుదిశ్వాస వదిలాడు కన్నెగంటి.ఆరాత్రి క్షతగాత్రులకు మంచి నీళ్లుకూడా అందకుండా మిలటరి కావలికాసింది. మరుదినం కన్నెగంటి దేహాన్నికోలగట్లసమీపంలోని దంతెవాగు వద్దకు తరలించి శవపరిక్షలు జరిపి ఖననం చేసారు.1946 కన్నెగంటి సమాధి నిర్మించారు.అదిశిధిలంకాగా 2004 పునర్నిర్మించారు.ఇటీవలే విగ్రహాప్రతిష్టచేసారు.ఆయనసమాధిపై నాటి గ్రామప్రజలు ఏర్పాటుచేసిన శిలాశాశనం కన్నెగంటి పోరాట స్పూర్తిగా మౌనసాక్షిగా నేటికి కనిపిస్తుంది.