కాలచక్రం యమఫాస్టు - కందర్ప మూర్తి

Kalachakram yama fastu

కాలచక్ర గమనం ఫాస్టేమీ కాదు.అది తన పద్దతిలోనే సాగుతోంది. ఆధునిక ప్రపంచంలో మనిషే సూపర్ ఫాస్టుగా పోతూ అలసట ఆతృత ఆందోళనలతో సతమత మవు తున్నాడు. ఊపిరి సలుపని వత్తిడి మానసిక ఆందోళనలతో రోజులు సాగుతున్నాయి.ప్రతీదీ తక్షణమే జరిగిపోవల్సిందే.నిరీక్షణ పనికిరాదు. దానికి తగ్గట్టు ఆధునిక సమాజంలో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి.కాలు కదపకుండా కూర్చుని అనుకున్నది సాధించ గలుగుతున్నాడు. అంతర్జాలం (ఇంటర్ నెట్ )అందుబాటులోకి వచ్చి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రంపంచమే చేతిలో కొచ్చింది.భూమ్మీద ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ప్రపంచ దేశాలతో అనుబంధం వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరిగిపోయాయి.ఆంధ్రా అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్లి జరగడం ఆ వేడుకకు వెళ్లలేని బంధువులు మిత్రులు ఇంటి దగ్గర్నుంచే వీడియోలో చూసి అభినందనలు తెలిపే అవకాశం చిక్కింది. అలాగే ఏ వేడుకైనా అంతర్జాల సాయంతో ఇంటి వద్దే సకుటుంబంతో చూడగలుగుతున్నారు. ఇంటి దగ్గరుండి మొబైల్ ఫోన్ తో నిముషాల్లో వేడివేడి పదార్థాలు రెష్టారెంట్లు హోటళ్ల నుంచి రప్పించుకోవచ్చు. సినేమా రైల్ బస్ టికెట్లు ఫ్లైట్ టూరిస్టు పేకేజీలు కాలు కదపకుండా సమకూర్చుకో వచ్చు. కొత్త సినేమాలు ఇతర వినోద కార్యక్రమాలు ఇంటి వద్దే వీక్షించవచ్చు. స్కూల్ విధ్యార్థులు డిజిటల్ చదువులు లేప్ టాప్ టేబ్ ల ద్వారా పుస్తకాలు అవుసరం లేకుండా నేర్చుకునే సౌలబ్యం కలిగింది. దేవుడి పూజల్లో ఫాస్టు, ప్రసాదాల్లో మార్పులు, కేసెట్లతో మంత్రోచ్ఛారణ , పూజల్లో ఆడంబరాలు గోచరిస్తున్నాయి.వివిధ ఆలయాల్లో దేవుడు డబ్బుకు అమ్ముడు పోతున్నాడు.డబ్బు ఖర్చు చేసిన వారికి ఒకలాగ సామాన్యులకు ఒకలాగ అతిథి వసతి పూజలు జరుగుతున్నాయి.జీవితం మీద నమ్మకం లేదు. బ్రతికుండగానే జీవితాన్ని అమ్ముకుంటున్నారు(లైఫ్ ఇన్సూరెన్సు చేసుకుని)మానసికాందన్లతో వత్తిడి పెరిగింది. యోగ ఆసనాలు ధ్యానం వాకింగ్ జిమ్ములతో జీవిత గమనాన్ని నియంత్రించాలని చూస్తున్నాడు. పాతరోజుల్లో కూరగాయలు ఆకుకూరలు పళ్లు గంపలతో సైకిళ్ళు తోపుడుబళ్లతో వీధులంట అరుచుకుంటు అమ్మే వారు. నేటి ఫాస్ట్ కాలంలో రికార్డెడ్ మైక్ సెట్లతో మోపెడ్లు, మోటర్ సైకిళ్లు ఆటోల మీద వ్యాపారం జరుగుతోంది. నలుపు తెలుపు సినిమాలు పదహారు పద్నాలుగు రీళ్లు ఉండి మూడుగంటల కాలక్షేపం ఉండేది.ఇప్పటి రంగుల సినిమాలు పన్నెండు రీళ్లతో సరిపెట్టవలసి వస్తోంది. పాత తరం వారిలా పండగలు పెళ్లిళ్లు వేడుకలకు ప్రత్యక్షంగా వెళ్లి ఆప్యాయతలు అనురాగాలు కనబరిచే అవకాశం ఉండటం లేదు. మొబైల్ ఫోన్లలో మూగభాషల (మెసేజ్ లు , చాటింగ్ లు) తో సరిపెడుతూ కుటుంబ మానవ సంబంధాలకు దూరమౌ తున్నారు. బ్రహ్మదేవుడి సృష్టికి ప్రతిసృష్టిని విశ్వామిత్రుడు చేసినట్టు ఇప్పుడు మానవ శాస్త్రవేత్తలు క్లోనింగ్ ద్వారా మనిషిని పోలిన మనిషిని జంతువుల్నీ పక్షులు సృష్టించే సామర్థ్యం సంపాదించాడు.దీర్ఘకాల పంటలకు బదులు సూక్ష్మ కాల పంటలు కూరగాయలు పుష్పాలు హైబ్రీడ్ పద్దతిలో తయారు చేస్తున్నారు. మనిషి తను తయారు చేసిన డబ్బే (మనీ)మానవ సంబంధాల్ని శాసిస్తోంది. భూమ్మీద అన్ని రంగాల్లో మానవుడు యమఫాస్టు నుంచి సూపర్ ఫాస్టు ట్రాక్ మీద పరుగెడు తున్నాడు. పాత రోజుల్లో క్రికెట్ ఐదు రోజుల క్రీడగా నడిచేది.వీక్షకులు ఓపికతో ఆటను చూసి ఆనందం ఆస్వాదించేవారు. అప్పట్లో యువకులు ఉద్యోగులు రేడియో , ట్రాన్సిస్టర్లతో కామెంటరీలతో మజా పొందేవారు.క్రమేపి రోజులు జోరెక్కాయి.జనాల్లో ఓపిక తగ్గింది. కాలంలో జోరు పెరిగింది. ప్రసార సాధనాలు అందుబాటులో కొచ్చాయి. యువతలో ఆధునిక పోకడలు మొదలయాయి. ఐదు రోజుల క్రికెట్ టెస్టు మ్యాచ్ కాస్తా డే నైట్ మేచ్ లయాయి.తర్వాత టి_20 మ్యాచ్ లుగా రూపాంతరం చెందాయి.తర్వాత టి--10 గాఉదయం ఒకటి రాత్రి ఒకటిగా మ్యాచ్ లు జరిగే అవకాశం రావచ్చు. మహిళా రంగంలోనూ మార్పులు చేసుకుంటున్నాయి. తల్లి గర్భంలో శిసువు 9 నెలలు మోసే ఓపిక లేక శస్త్ర చికిత్సతో ముందుగా అనుకున్న రీతిలో తిథి వార నక్షత్రాల సమయంలో ప్రసవించ వచ్చు.మరి జ్యోతిష సిద్ధాంతులు ఏ లెక్కన జాతక ఫలితాలు రాస్తారో వారికే తెలియాలి.కంప్యూటర్ జాతకాలు ఎలానూ ఉన్నాయి. పెళ్ళి సంబంధాలు , పెళ్ళి చూపులు, పెళ్లిళ్లు అంతర్జాలంలో జరిగిపోతున్నాయి.ప్రపంచీకరణ పేరుతో ఒకదేశంలో అమ్మాయితో వేరొక దేశం అబ్బాయికి ప్రేమ పెళ్లి జరిగి ఇష్టం ఉన్న రోజులు కాపురం చేసి తర్వాత డైవోర్స్ ((విడాకులు)తీసుకోవచ్చు. కొడుకులు విదేశాల్లో తల్లిదండ్రులు స్వదేశంలో వృద్ధాశ్రమాల్లో ఉండే అవకాశం ఏర్పడింది. వారి అంతిమ యాత్రలో ఆఖరిచూపులు కర్మకాండలు అంతర్జాలంలో వీడియో లో చూసే అవకాశం ఏర్పడింది కుటుంబ సబ్యులకు. పాత తరం రోజుల్లో పదిమంది పిల్లల్ని కంటే సంతాన లక్ష్మి అని పొగిడేవారు.ఇప్పటి రోజుల్లో ఒకరిద్దరు పిల్లల్ని కనాలంటే అమ్మో అంటున్నారు. గర్భస్త పిండం ఆడ శిసువని తెలిస్తే కడుపులోనే కరిగించేస్తున్నారు. స్త్రీల లోను వేష భాష విషయాల్లో యమ మార్పులు వచ్చాయి. పంటలు, అలాగే కొన్ని ఫలాలు పండి పళ్లయే వరకూ ఓపిక లేదు. మర్కెట్ చేసి డబ్బులు సంపదించాలన్న యావతో కృత్రిమంగా సోడియం కార్బైడ్ వంటి రసాయనాలతో రంగులు తెప్పించి అమ్మి రోగాలు వ్యాప్తి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రోడ్డు పక్కన చిలక జ్యోస్యం చెప్పేవారు, మెట్రో నగరాల్లో నాలుగు రోడ్ల కూడలిలో బెగ్గింగు చేసేవారు మీ దగ్గర కేష్ లేకపోయినా స్వైపింగ్ మిషిన్ తో పని జరిపేస్తున్నారు.మార్కెట్ లలో వ్యాపారాలు ధరలు స్మార్ట్ ఫోన్లలో జరిగి పోతున్నాయి. యువత వాట్సప్ ఫేస్ బుక్ ట్విస్టర్ వంటి ఆధునాతన ప్రసార సాధనాలతో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు సైబర్ నేరాలు క్రైమ్ లు ఇలా ఎన్నెన్నో నేరాలు ఘోరాలు స్మార్ట్ ఫోన్లలో యమ ఫాస్టుగా జరిగి పోతున్నాయి. సీనియర్ సిటిజన్లు ఇదివరకటిలా వారి జీవన్ ప్రమాణ్ పత్రాలు (లైఫ్ సర్టిఫికేట్లు )బేంక్ ల దగ్గరకెళ్లి ఫారాలు నింపి గంటల కొద్దీ సమయం వ్యర్థం చేసే బెడద ఈ స్మార్ ఫోన్లు వచ్చిన తర్వాత తప్పింది. వయసుకి రాని ఆడపిల్లల్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టేవారు, పాడి పశువులు తొందరగా ఎక్కువగా పాలు చేపాలనీ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు,జుత్తు నల్లగా నిగారింపు పాల తెలుపు చర్మం,ముసలి వయసులో యవ్వనంలోకి రావాలని కోరికలు, చిన్నోళ్లు తొందరగా పెద్దోళ్లయి క్రికెటర్ అవాలని ఉబలాటం, నర్సరీలలో పూల మొగ్గలు తొందరగా పువ్వులు పూయాలని రసాయన స్ప్రే లు, వ్యవసాయ పనులకు సంప్రదాయ దుక్కిటెడ్లు నాగళ్లకు బదులు ట్రాక్టర్లు బుల్ డ్రోజర్లు, అంతస్థుల భవన నిర్మాణంలో ఆధునిక యంత్రాలు ఇలా అన్నిటా యమఫాస్టుగా జరిగి పోతున్నాయి. అమెరికా దేశం సూర్యుణ్ణి తన గుప్పెట్లో ఉంచుకోవాలని, చైనా దేశం చంద్రుణ్ణి భూమ్మీదకు రప్పించాలనీ ఉబలాట పడుతుంటే భారత దేశం ఉపగ్రహాల్ని చుట్టిరావాలని యాతన పడుతోంది. వార్తా పత్రికలు , మేగజైన్లు, చదివే ఓపిక సమయం లేక ఎలక్ట్రానిక్ వార్తాపత్రికలు , ఇంటర్ నెట్ వెబ్ వీక్లీలు మాస పత్రికలు ఇలా ఎన్నెన్నో యమఫాస్టు మీడియా, హనుమంతుడి తోకలాంటి సీరియళ్లకు బదులు సింగిల్ పేజీ కార్డు కథలు ప్రాచుర్యంలో కొస్తున్నాయి. భూమ్మీద మానవుల సూపర్ ఫాస్టు యాక్షను చూసి పైనున్న పంచభూతాలు దేవతలు భయాందోళనకు గురవుతున్నారు. యమపురిలో చిత్రగుప్తుల వారి మృత్యులేఖిని చిట్టాలో లెక్కలు మారిపోయి శిరోవేదనతో బాధ పడుతున్నారు. నవ గ్రహాలకు నిద్ర లేకుండా పోయింది. దేవతలకు దానవులకన్న నేటి మానవులంటేనే చెమటలు పడుతున్నాయి. భూమండలం మీది వాయు కాలుష్యం నీటికాలుష్యం ఆహార కాలుష్యం శబ్ధ కాలుష్యానికి భయపడి త్రిలోక సంచారి నారదుల వారు, అలాగే వినాయక నవరాత్రుళ్లకు భువికి వచ్చే విఘ్న నయకుడు మానవ శాస్త్రవేత్తలు తనకి డూప్లికేట్లు చేసేస్తారేమో నని భయం పట్టుకుంది. పగటి వేషగాళ్లనుకునే భ్రమకలుగు తుందని ఆందోళన పడుతున్నారు దేవతలు. కాలచక్రం కదులుతోంది యమఫాస్టుగా... ×*. ×*. ×*