వి.వి.గిరి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వి.వి.గిరి.

వి.వి.గిరి.
వరహగిరి వెంకట గిరి అనే వీరు 1894 ఆగస్టు 10 న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందినబర్హంపురి పణంలో జన్మించాడు. ఈ జిల్లా, పట్టణం ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరహగిరి వెంకట జోగయ్యప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళాడు.
గిరి గారు 1913 లండన్ లోని డబ్లిన్లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు కానీ ఐర్లాండ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. 1914 లో బ్రిటన్ లో గాంధీజిని కలిసారు.వారి సలహామేరకు బ్రిటన్ రెడ్ క్రాస్ లో చేరారు.అక్కడే భారతీయవిద్యార్ధి సంఘాన్ని స్ధాపించి కార్యదర్శిగా పనిచేసారు.1916 భారత దేశం వచ్చి న్యాయవాద వృత్తి చేపట్టారు. భారతీయ కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నారు.అనిబీసెంట్ ప్రారంభించిన హాంరూల్ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు.జాతీయ కాంగ్రెసులో చేరారు.సహాయనిరాకణ ఉద్యమంలో పాల్గోని ఏడాది చెరసాలశిక్ష అనుభవించారు. అనంతరం క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు..గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.1934-37 వరకు భారత శాసనసభ్యునిగా ఎంపిక అయ్యారు.1927 లో జనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశానికి హాజరైనారు.అనంతరం బొబ్బిలి రాజావారిపై పోటీ చేసి గెలుపొందారు.1937 రాజాజి మంత్రివర్గంలోనూ, 1946 ప్రకాశం పంతులుగారి ప్రభుత్వంలోనూ కార్మిక మంత్రిగా పనిచేసారు.అనంతరం శ్రీలంక లో భారత్ హైకమీషనర్ గా ఉన్నారు. 1957-60లోఉత్తరప్రదేశ్, 1960-65కేరళా,1965-67 మైసూర్ రాష్ట్రాలకు గౌర్నర్ గా పనిచేసారు. 1967 భారత ఉపరాష్ట్రపతిగా ఎంపిక అయ్యారు. నాటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1969 మే 3 వతేదిన మరణించడంతో 1969 ఆగస్టు 24న భారత నాల్గవ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసారు. పలువిశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్ అందుకున్నవీరిని 'భారతరత్న'వరించింది.
పదవి విరమణ అనంతరంవీరు చెన్నయ్ లోని స్వగృహంలో 1980 జూన్ 24 న తుదిశ్వాసవిడిచారు.

 

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గంగోత్రి.చార్ థామ్ యాత్ర
గంగోత్రి.చార్ థామ్ యాత్ర
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యమునోత్రి.చార్ థామ్ యాత్రలొ తొలి ఆలయం.
యమునోత్రి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.