ఆచార్య ఎన్.జి.రంగా. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఆచార్య ఎన్.జి.రంగా.

ఆచార్య ఎన్.జి.రంగా.
65 సం" చరిత్రకలిగిన పార్లమెంటేరియన్ వీరి పూర్తిపేరు గోగినేని రంగనాయకులు. 1900 నవంబర్ 7 న గుంటూరుజిల్లా నిడుబ్రోలులో జన్మించారు.వీరేశలింగంగారి రచనల ప్రభావం వీరిపై ఉండేది.ఉన్నత విద్యకొరకు లండన్ ఆక్సుఫర్డ్ లోచేరి 1923లో డిప్లమో ఇన్ ఎకనమిక్ అండ్ పొలిటికల్ సైన్స్ కోర్సులో ఉత్తిర్ణత సాధిచారు.అక్కడే మరోమారు ఎకనామిక్స్ ఆఫ్ ది కాటన్ ఇండస్ట్రీ ఆఫ్ మద్రాసు ప్రసిడెన్సి అనే అంశపై సిధ్ధాంత వ్యాసం సమర్పించి డి.లిట్ డిగ్రీ పొందారు అనంతరం పబ్లిక్ ఫైనాన్స్ పై అధ్యాయనంచేసి మరోడిగ్రీ పొందారు.1926 భారతదేం వచ్చి మద్రాసు పచ్చయప్పస్ కళాశాలలో మూడేళ్ళు ఎకనామిక్స్ ప్రోఫెసర్ గా చెసారు.
1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా స్వాతంత్రోద్యమంలోపాల్గొన్నారు.1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలోజరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టవాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను మనదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.ఈయన కాంగ్రెస్ నుండి నిష్క్రమించి భారత కృషికార్ లోక్ పార్టి ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజితో కలిసి స్వాతత్ర పార్టిని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.వివిధ ప్రజాసమస్యలపై ఆంగ్ల-తెలుగు భాషలలో ఇరవైరెండు పుస్తకాలు రాసారు.అవికొన్ని ప్రెంచి భాషలోనికి అనువాదించబడ్డాయి.1983లో రాజాజిరత్న అవార్డు,జవహర్లాల్ నెహ్రు లిటరసి అవార్డు,న్యుఢిల్లిలో శిరోమణి అవార్డు,1991 లో టోక్యో ఓస్కా అవార్డు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిజన్మదినాన్ని కిసాన్ దినం గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయవిశ్వవిద్యాలయం వీరిపేరుతో మార్చబడింది.చేపట్టిన ప్రతి పని,పదవికి వన్నె తెచ్చిన ఈమహనీయుడు తన 95 ఏట1995జూన్ 8 న శాస్విత నిద్రలో ఒరిగి పోయారు.