ముట్నూరి కృష్ణారావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ముట్నూరి కృష్ణారావు.

ముట్నూరి కృష్ణారావు.
వీరు 1879 కృష్ణాజిల్లా దివితాలూకా ముట్నురు గ్రామంలో జన్నించారు.బాల్యంలోనే తల్లి తండ్రిని కోల్పోయిన వీరు తన బాబాయి వద్ద పెరిగారు.మంచి విద్యావేత్త అయినవీరికి ఆంగ్లభాషలో మంచి వక్త.బందరులో స్ధిరపడి అప్పటివరకు కొండా వెంకటప్పయ్యగారి సారధ్యంలోని కృష్ణపత్రిక సంపాదకుడిగా చేరారు.కృష్ణా పత్రిక 1899వ సంవత్సరంలో కృష్ణా జిల్లా సంఘం చే జారీ చేయబడిన తీర్మానమునకు అనుగుణంగా 1902 సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రారంభించబడిన తొలి వార్తాపత్రికగా మొదటి సంచికలో పేర్కొన్నారు. ప్రారంభంలో ఉపసంపాదకుడిగా చేరిన ముట్నూరు కృష్ణారావు 1907లో సంపాదకబాధ్యతను చేపట్టి 1945 లో తను మరణించేవరకు ఆ పదవిలో కొనసాగారు. వ్యక్తిగా కాక ఈ పత్రిక తాలూకు శక్తిగా పేరుపొందారు.ఈ పత్రిక పక్షపత్రికగా ప్రారంభమై ఆతరువాత వార పత్రికగా వెలువడింది.భారత స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది. పట్టణాలకే పరిమితమవకుండా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు ఉచితంగా పంచబడి విద్యార్థుల ద్వారా గ్రామీణులందరని చైతన్య పరచింది.ఎన్.జి.రంగా, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, తెన్నేటి విశ్వనాధం తమ చదువులకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో చేరటానికి ఈపత్రిక, ఆంధ్రాపత్రికల ప్రభావం వుందని తెలిపారు. బ్రిటీషు ప్రభుత్వం తమ నివేదికలలో ఈ రెండు పత్రికల ప్రభావాన్ని గుర్తించాయి. 1929లో ఈ పత్రికలకు గుర్తింపుగా విజయవాడలో సెప్టెంబరు 9న స్వాతంత్ర్య సమరయోధులు ఎన్.వి.ఎల్ నరసింహారావు అధ్యక్షతన సన్మానం చేశారు. అదే సమయంలో ఆంధ్రజనసంఘ హైదరాబాదులో గుర్తింపుగా తీర్మానం చేసింది. ఆర్థిక ఇబ్బందులకు గురైనా దాతల విరాళాలతో నడిచింది.
పాత్రికేయుడు పిరాట్లవారు దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు.
కృష్ణా పత్రికలో సహాయ సంపాదకులుగా శ్రీ కమలాకర వెంకట్రావు గారు, శ్రీ రావూరు సత్యనారాయణ గారు చాలా కాలము పనిచేసారు. రావూరు గారు 12 ఏళ్ళు పైనే "వడగళ్ళు" అనే శీర్షికలో హస్యపు చినుకులు కురిపించి తెలుగు పాఠకులకు నవ్వుల విందు చేశారు. అంతేకాక నవలలు, కథలు, రాజకీయ వ్యాసాలు, సినిమా, నాటకాల విమర్శలు ఇంకా ఎన్నో వ్రాసి పత్రికకు ప్రాచుర్యం కలిగించారు. శ్రీ కాజ శివరామయ్యగారు మేనేజరుగా, శ్రీ అద్దేపల్లి మల్లిఖార్జునరావుగారు అకౌంటంట్ గా పనిచేసారు. 'వడగళ్ళు' శీర్షికలో ఈయన మల్లినాధ సూరిగారు దాదాపు వారం వారం దర్శనమిచ్చేవారు. ఏ విషయమైనా కృష్ణాపత్రికలో ప్రచురించిందంటే అది ప్రజలు ఎంతో విశ్వాసంగా స్వీకరించేవారు. శ్రీ ముట్నూరివారి వ్యాసాలు కృష్ణాపత్రికకి కల్కితురాయిలా భాసించేవి. కృష్ణా పత్రికలో శ్రీ తోటా వెంకటేశ్వరరావు గారు చిత్రకారునిగా పనిచేసేవారు. ఆయన సృష్టించిన చిత్రాలు కృష్ణాపత్రికకు సొగసులు దిద్దేవి. పత్రిక ఆవరణలో సాయంకాలాలలో "దర్బారు" నిర్వహించేవారు. బందరులోని కవులు పండితులు, నటులు, గాయకులు, సంగీతకారులే కాక బయటనుంచి కూడా వచ్చి ఈ బర్బారులో పాల్గొని ఆనందించేవారు. వారందరూ విసిరిన చెణుకుల్ని మరుసటి వారం పత్రికలో "పన్నీటి జల్లు" అనే పేరుతో ప్రచురించేవారు. కృష్ణా పత్రికలో తమ రచనలు ప్రకటిస్తే ఎంతో గొప్పగా భావించేవారు. దీనికి కొన్నాళ్ళు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు కూడా సంపాదకులుగా పనిచేసారు. సమాజంలో దేశభక్తిని, కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపిన ఉత్తమ స్థాయి పత్రిక కృష్ణా పత్రిక.ఆదర్శ పత్రికా సంపాదకులు,స్వాతంత్ర్య సమరయోధుడు తత్వవేత్త,అయినవురు 1945 లో మద్రాసులో కాలధర్మం చెందారు.

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు