పుస్తక సమీక్ష - సిరాశ్రీ

book review
పుస్తకం: నివేదన 
విషయం: ప్రముఖుల ఆధ్యాత్మిక అనుభవాలు
రచన: తిప్పావఝుల కుమార్ 
వెల:రూ 200/-
ప్రతులకు: http://kinige.com/book/Nivedana+Spiritual+Experiences+of+81+Celebrities

వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, సినిమా- ఈ మూడు రకాల పుస్తకాల పట్ల ఆసక్తి పెంచుకున్న పాఠకులు ఈ మధ్య కాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకేనేమో ప్రచురణ సంస్థలు కూడా వీటినే మార్కెట్లోకి ఎక్కువగా దించుతున్నాయి. అయితే సరుకుంటేనే ఏ పుస్తకమైనా ఆదరణ పొందేది. "నివేదన" పేరుతో వచ్చిన ఈ 252 పేజీల పుస్తకం ఆధ్యాత్మిక ప్రియులకు నచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇందులో ఏకంగా వివిధ రంగాలకు చెందిన 81 మంది ప్రముఖుల ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో నాలుగేళ్లపాటు సాగిన "నివేదన" శీర్షిక ఇలా పుస్తక రూపంలో వచ్చిందన్నమాట. నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ ప్యాపర్ గా పరిణమించే పరిస్థితుల్లో, ఇలా విలువైన సమాచారం వేస్ట్ అయిపోయి కాలగర్భంలో కలిసి పోకుండా ఒక పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచన మెచ్చుకోదగ్గది. అందుకు తిప్పావఝుల కుమార్ గారిని ప్రశంసించాల్సిందే.

ప్రతి వ్యక్తికి ఎంతోకొంత ఆధ్యత్మిక అనుభవం ఉండి తీరుతుంది. కొందరు చెప్పగలరు కొందరు చెప్పలేరు. అంతే తేడా. చెప్పలేనివారి నుంచి కూడా చెప్పించే నైపుణ్యం ఉండడం ఒక విశేషం. ఆ నిపుణత శ్రీ తిప్పావఝుల కుమార్ లో ఉంది కనుకనే, నాలుగేళ్లు ఈ శీర్షిక నడపగలిగారు.

ఆధ్యాత్మికం అనగానే అందరికీ సాధారణంగా స్వామీజీలు, యోగా గురువులు గుర్తుస్తారు. వాళ్లు చెప్పేవి ఎలా ఉనా, చంద్రబాబు నాయుడు తన ఆధ్యాత్మిక అనుభవం చెప్తే ఎలా ఉంటుంది? మరి చిరంజీవి..? నటీమణులు జయసుధ, వాణిశ్రీ, జమున..? ఇలా ఎందరో..ఒకరా ఇద్దరా...తనికెళ్ల భరణి, మురళీ మోహన్, వెంకటేష్, కే విశ్వనాథ్, వేటూరి, మోహన్ కందా, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ..ఇంకా ఎందరో మొత్తం 81 మంది ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయిందులో. ఇంతమంది అనుభవాలు చదివితే ఆధ్యాత్మికత పట్ల అవగాహన, ఆలోచన.. రెండూ పెరుగుతాయి.

ప్రముఖుల పట్ల పాఠకులకి సహజంగా కొంత ఆసక్తి ఉంటుంది. అలా ఆసక్తి గొలిపే వ్యక్తులు చెప్పే కబుర్లు కూడా బాగుంటాయి. ఆ కబుర్లు ఏవో కాలక్షేపానికి పనికివచ్చేవి కాకుండా ఆధ్యాత్మిక జీవన విశేషాలైతే? అది ఎలా ఉంటుందో ఈ పుస్తకం చదివితే తెలిసిపోతుంది. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి! ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తా.

ఈ పుస్తకంలో ప్రతి అనుభవం ఒక జ్ఞానబిందువు. మొత్తంగా ఈ పుస్తకం ఓ జ్ఞానసింధువు. చదవండి.

- సిరాశ్రీ. 

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్