పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు' - సత్యగౌరి.మోగంటి

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'

పిల్లల ఫొటో విన్యాసాలకు కవితాదర్పణం ' ఆటవిడుపు'(సమీక్ష) -------------సత్యగౌరి.మోగంటి. రచయిత డా.కె.ఎల్ .వి.ప్రసాద్ గారు వృత్తి రీత్యా ధన్వంతరి అనదగ్గ దంతవైద్యుడు.ఇకపోతే ప్రవృత్తి రీత్యా ఆయన రచయిత.సాహిత్యాభిమాని తెలుగు భాషాభిమాని.అక్షరాలా కోనసీమ ముద్దుబిడ్డ,అచ్చమైన తెలుగు సాహిత్య పిపాసి. రచయిత అన్నగారు శ్రీ కె.కె. మీనన్ మంచి సాహితీ వేత్త,నవల /కథారచయిత.ఆయన నుండి రచయిత ఈ రచనా వ్యాసంగాన్నిపుణికి పుచ్చు- కున్నట్లు అనిపిస్తుంది. ఈయన కలం నుండి అనేక విషయాలమీద పలు వ్యాసాలు వెలువడ్డాయి/వెలువడుతున్నాయికూడా కథలు,గేయాలు కూడావెలువడ్డాయి. అనేక పత్రికలకు పరిచయకర్తగాడాక్టర్ గారు ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూచేసిపాటకలోకానికి పరిచయం చేశారు. ఆకాశవాణి/దూరదర్శన్ కార్యక్రమాలలో నేటికీ కొనసాగుతున్నారు.వీరుసామాజిక సేవాతత్పరులు కూడా. ఇదిగో...ఈయన కలంనుండి వెలువడ్డదే ఈ ' ఆట విడుపు' బాల కవితాసంపుటి. స్వయంగా మనవరాలిని దృష్టిలోవుంచుకుని రచన చేయడం ఈ బాల కవితా సంపుటి ప్రత్యేకత. రచయిత ప్రతి క్షణం మనవరాలి పక్కనే ఉండి గమనిస్తూ,ఆడిస్తూ,తాను కూడా ఆడుతూ ఆ.... అమూల్యమైన క్షణాలను,ఒడిసిపట్టి తన ప్రేమ అనే తేనెలో ముంచి మరీ రాశారు రచయిత ఈకవితలు. మనవరాలి పట్లే కాదు ,తెలుగు భాష పట్ల కూడా ఆయనకున్న శ్రద్ద,ప్రేమ చాలా గొప్పవి.పేరు మనవరాలిదైనా...ఇందులోఆయనచెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ వయసు పిల్లలకు వర్తించేవే. 'చలవ కళ్లద్దాలు'కవితలో అమ్మ తనకిచ్చిన బహుమతిపై తాతకుకవితరాయమని ఇచ్చేశా అనుమతి' అంటుంది మనవరాలు. సరళమైన భాష,సుళువైన పదసంపద ఈకవితల ప్రధానలక్షణం 'తేనెల తేటల తెలుగు మాట...లో తెలుగు పట్ల తాత భయం,మనవరాలి అభయం చక్కగా తేనెలూరు కవితగా రాయడం తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారానికి దర్పణం. 'అభినయం' కవిత ద్వారా పిల్లలోని అనుకరణ గురించి అల్లిన కవితచాలా బావుంది. 'మెట్లు' అనే కవిత పిల్లలు హిమాలయాలంత ఉన్నత స్థితికి మెట్టు మెట్టుఎక్కి చేరాలనే భావనతో రాసిన కవిత.నిజంగా ఈకవి ఇక్కడ అత్యంత సహజమైన ఆశను చక్కగా అక్షరీకరించారు అని చెప్పక తతప్పదు. ఓర్పుగా...నేర్పుగా ఫోటోలు తీయడం అవి సందర్భానుసారంగా ఇక్కడ కవితలకుకవి జోడించడం చాలా బావుంది.ఇది కవి అభిరుచిని తెలియజేస్తున్నది.కళాత్మకంగా,సాహిత్య పరంగా కూడాఇదిఎన్నదగిన పుస్తకంఅనిచెప్పక తప్పదు. ఆయన కవితలకే కాదు..ఇక్కడ ఆయన తీసిన ఫోటోలు కూడా అర్థవంతమైన భావాలను పలుకుతున్నాయి. లలిత లావణ్యమైన భావాలతో, తన పెల్లుభికిన ప్రేమను రాగాలతో పూవు నుండి తేనెను తీసినట్టు... పెరుగునుండి. వెన్నను తీసినట్టు కవితలను ఆయన ప్రేమలో ముంచి రాశారుఈ కవితాసంపుటిలో!ఇవి కొన్ని ఉదాహరణ లు మాత్రమే!పిల్లలకోసం రాసిన ఈకవిత్వం పూర్తిగా చదవవలసిందే మరి! కవి డా.ప్రసాద్ గారి కి అబినందనలు . ***

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్