పద్య మండపం : పుస్తక సమీక్ష - సిరాశ్రీ

padya mandapam book review

రచన: డా రాళ్లబండి కవితా ప్రసాద్
వెల: రూ 100/-
ప్రతులకు: డా రాళ్లబండి కవితా ప్రసాద్ (040-23835748, 9949492626)

గత రెండు శతాబ్దాలుగా పద్యం కొత్త ప్రాణం పోసుకుంటూ ఉంది. అందుకు ప్రధాన కారణం అవధానం అని నా అభిప్రాయం. ఆ సాహితీ క్రీడను చూసి మొదట ఆశ్చర్యపడి, తర్వాత ఛందస్సు గురించి తెలుసుకుని, పద్యాలు రాస్తున్న వేలాది మందిలో నేనూ ఒకడిని. సినీ పరిభాషలో చెప్పాలంటే, అవధాన ప్రక్రియ ఈ మధ్య పద్యానికి మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. ఏదో ఎనిమిది మంది పండితప్రకాండులను పిలిపించి అష్టావధానంలో పృచ్చకులుగా కూర్చోపెడితే పాండిత్యం కదం తొక్కుతుంది తప్ప పామరుడికి చేరడం కష్టం. మరి రాళ్లబండి, మాడుగుల, మేడసాని, గరికిపాటి వంటి ఉద్దండ అవధానులు శతాధిక, సహస్రాధిక అవధానాలు చేయడంలో దిట్ట. మరి అంతమంది పండితులు దొరకరు కాబట్టి... పండితులు కానివారిని కూడా పృచ్ఛకులుగా కూర్చోపెట్టవలసి వస్తుంది. అప్పుడు మాస్ అప్పీలింగ్ ప్రశ్నలే వస్తాయి... ఈ పుస్తకంలో అలాంటివి ఎన్నో.

అవధాని రాళ్లబండివారు బందరులోను, బెజవాడలోనూ చేసిన అవధానాల్లోని ప్రశ్నలు, పద్య పూరణలు ఈ 'పద్య మండపం'లో కూర్చోబెట్టారు. ఉదాహరణకి ఇది చూడండి...

"సాక్షి శివానంద్, రమ్య కృష్ణ, రాజశేఖర్, జగపతి" అనే పేర్లిచ్చి కనకదుర్గా దేవిని స్తుతిస్తూ శార్దూల పద్యం చెప్పమన్నారొకరు..

దానికి రాళ్లబండి వారు..

"న్యాయాన్యాయ విచక్షణంబున మనస్సాక్షీ శివానందమై
శ్రేయమ్మున్ కలిగించు శక్తివగుచు శ్రీ రమ్యకృష్ణాకృతిన్...."

తక్కిన రెండు పాదాలు మీరు పుస్తకం సంపాదించి చదువుకుంటే బాగుంటుందని ఇక్కడితో ఊరించి వదిలేస్తున్నా..

అలాగే దోసె, పూరి, వడ, సాంబారు పదాలతో పార్వతీ కళ్యాణం గురించి చెప్పమంటే ఇలా చెప్పారు:

"పూరించెంగద దివ్య శంఖము శంభుడల్లదే నద్రిపై
ప్రారంభించిరి శైవఘోషలట సాంబా! రుద్రా! యంచున్ సదా
స్మేరాస్య ప్రథితాప్తి తా వడకుచున్ సిగ్గిల్లగా పార్వతిన్
చేరెన్ శంభుడు పెండ్లి వేళను ఎదో సెప్పంగ తా ప్రేమతో"

ఇలాంటివి శతాధికంగా ఉన్నాయి ఇందులో. చివర్లో వేరు వేరు సందర్భాల్లో రాళ్లబండి గారు వ్రాసిన శతకాలు, ఆత్మానుగత పద్యాలు కూడా పొందుపరిచారు. అందులో కొన్ని కంఠస్థం చేయాలనిపించేంతగా ఉన్నాయి. సందేహం లేదు.

తెలుగు పద్యం పై మక్కువ ఉన్న ప్రతి వారి దగ్గర ఉండాల్సిన పుస్తకం ఈ పద్య మండపం.

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్