మాడర్న్ స్వయంవరం’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - సాయి సోమయాజులు

modern svayamvaram short flim review

చాలా షార్ట్ ఫిల్మ్స్ అమచ్యూర్ గా తీసినా, కంటెంట్ బాగుండడం వలన యూట్యూబ్‍లో హిట్ అవుతాయి. అలాంటి ఓ షార్ట్ ఫీల్మ్- ‘మోడర్న్ స్వయంవరం (2020)'. ‘అత్తారింటికి దారేది!’ సినిమా పారెడీతో పాపులర్ అయిన ఈ ఫిల్మ్ మేకర్స్, మాడర్న్ స్వయంవరంతో మరింత పాపులర్ అయ్యారు. ఈ చిత్ర సమీక్ష, మీ కోసం- 

కథ:

ఒక బయలాజికల్ డిసస్టర్ వల్ల ఫీమేల్ సెక్స్ రేషియొ అంతకంతకీ తగ్గిపోయి, 2017లో వెయ్యి మంది అబ్బయిలకి కేవలం 527 మంది అమ్మాయిలు మాత్రమే మిగులుతారు. దీనివల్ల, 2018 సంవత్సరంలో, గవర్నమెంట్- మ్యారేజ్ సెక్టార్లో కొత్త పథకాలను రూపొందిస్తుంది. అదే మోబ్ నోటిఫికేషన్. మోబ్ అంటే, MARRIAGE OFFERS FOR BRIDEGROOM. ఇందులో, జాబ్ నోటిఫికేషన్స్ లానే, మొదట పెళ్ళి ఓపెనింగ్స్ అనౌన్స్ చేసి, తరువాత టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా తనకి కావలసిన భర్తని తనే ఎంచుకోగలదు అమ్మయి. ఇక పోతే, 2020లో అసలు కథ మొదలవుతుంది. స్వరూప్ అన్న ఓ నిరుద్యోగి, మౌనిక అనే ఓ అమ్మయి తన మోబ్ నోటిఫికేషన్‍ని ప్రకటించినట్టు తెలుసుకుని, అప్లై చేస్తాడు. అతను ఇందులో సెలక్ట్ అవుతాడా?, మౌనిక స్వరూప్‍ని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అన్నదే స్థూలంగా ఈ కథ!

ప్లస్ పాయింట్స్ :

ఈ లఘు చిత్రం అందరి ఆదరణని పొందడానికి గల కారుణాలు రెండు- కాన్సెప్ట్ అండ్ కామెడీ. ఈ చిత్రంలోని డైలాగ్స్, పంచ్‍లు కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా, రిటన్ టెస్ట్ ఎపిసోడ్ అయితే చాలా హిలేరియస్‍గా ఉంటుంది. ఈ సినిమాలో కనిపించే ఇద్దరమ్మాయిలు చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ‘మౌనిక’ పాత్ర వహించిన నియతి చౌహాన్‍కి చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఎండింగ్‍లో ఇచ్చే తీర్పు చాలా సెటైరికల్‍గా ఉండి అలరిస్తుంది. ఫేస్‍బుక్ కామెంట్స్ లో మీమ్స్ వాడకాన్ని బాగా వాడుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అతి పెద్ద నెగటివ్ పాయింట్- మేకింగ్ అని చెప్పుకోవాలి. ఆర్ట్, మరియూ ఇతర ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోవడం అన్న విషయాన్ని అర్థంచేసుకోవచ్చు, నటన పరంగా, కెమెరా పరంగా, ఎడిటింగ్ పరంగా, వీక్ గా ఉండడం మాత్రం నిరుత్సాహకరం. ఏ ఒక్క నటుడు సరిగ్గా నటించకపోవడం మైనస్ అనే చెప్పుకోవాలి. ఉన్న వాళ్ళలో జ్యోతి స్వరూప్ కొంచెం బెటర్‍గా చేశారు. ‘పూజ’ పాత్ర వహించిన వర్షా రాణి అందంగా కనిపించినప్పటికి, మాటి-మాటికీ కెమెరా వంక చూడడం వలన ప్రేక్షకులకు జర్క్స్ వస్తుంది. తనొక్కత్తే కాదు, చాలా పాత్రలు కెమెరా వంక చాలా సందర్భాలలో చూస్తూ కనిపిస్తారు. చాలా వరకు లఘు సినిమా కామెడీగా ఉన్నప్పటికీ, కొన్ని కుళ్ళు జోకులు విసుకెత్తిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే గే క్యారెక్టర్ అనవసరం. కంటిన్యుటీ చాలా సార్లు బ్రేక్ అయ్యింది. డబ్బింగ్ ఇస్యూస్ కూడా చాలానే ఉన్నాయి. జోక్ జోక్ కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ని సరిగ్గ అప్పై చెయ్యలేదు ఎడిటర్.

సాంకేతికంగా :

ఈ సినిమా సాంకేతికంగా చాలా పూర్ అనే చెప్పుకోవాలి. ప్రోడక్షన్ వాల్యూస్ లేకపోయినా, కెమెరా హ్యాండ్లింగ్ చాలా వీక్ గా చేశారు. ఎడిటింగ్‍లో చాలా వరకు తప్పులని సరిదిద్దుకునే అవకాశం ఉన్నపటికీ, దానిని సరిగ్గా వినయోగించుకోలేకపోయారు.

మొత్తంగా :

ఈ స్వయంవరం టైం-పాస్ కోసం మాత్రమే!

అంకెలలో-

2.75/ 5

LINK-

https://www.youtube.com/watch?v=sUbSbSie0IM

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్