ఆధ్యాత్మిక ప్రయాణం, సాధన అత్యంత దుర్లభమైన మార్గాలు. లౌకిక జీవనంలో అత్యున్నతమైన స్ధాయిలో ఉంటూనే, దైవానుగ్రహాన్ని కూడా అనుదినం స్వంతం చేసుకునే వారిని 'అనుగ్రహసంపన్నులు', 'వరప్రసాదులు' అంటారు. ఇటువంటి వారు ఈ కాలంలో అసలు ఎవరైనా ఉంటారా అని అడిగే వారికి సమాధానంగా ఈ మధ్యనే ఒక పుస్తకం వచ్చింది. అదే, సింగపూర్ కు చెందిన వెంకట వినోద్ పరిమి గారి - 'దైవంతో నా అనుభవాలు'. జె.వి.పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో హైక్వాలిటీతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం అట్ట మీద బొమ్మ చూడగానే, మనసులో ఒక ఆనందం కలుగుతుంది. దైవం యొక్క పాదాలను పెనవేసుకుని పోయిన ఒక పసిపిల్లవాడి చిత్రమది. ఆహా, అనుకుని లోపలి అధ్యాయాలు చదవడం మొదలు పెట్టగానే, మనిషి మేధస్సుకు అందని అనేక అద్భుతాలు మనల్ని స్వాగతిస్తాయి. పోషణ, రక్షణ, పునర్జన్మ, అనేకమంది రూపాల్లో అనుగ్రహాలు, అనేక దివ్య దర్శనాలు, ఊహకందని ఆధ్యాత్మిక అనుభూతులను ఈ పుస్తకంలో మనం చదవవచ్చు. ప్రస్తుతం సింగపూర్ లో ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో ఏసియా ఫసిఫిక్ రీజినల్ డైరెక్టర్ గా ఉన్న వినోద్ గారు, తిరుమల శ్రీవారి భక్తులు. కరోనా, లాక్డౌన్ల కారణంగా స్వామి వారిని దర్శించుకోలేని ఈ తరుణంలో తన మిత్రుడు, రచయిత అయిన రమేష్ సహాయంతో తన జీవితంలో జరిగిన సంఘటనలను ఈ అద్భుతమైన పుస్తకం రూపంలో మన ముందుకు తీసుకొని వచ్చారు. అంతేకాదు ఈ పుస్తకం ద్వారా వచ్చిన నిధులను వారు టిటిడి కీ, గోసంరక్షణకు విరాళంగా ఇస్తున్నారు. దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాల్సిన పుస్తకమిది. ఇతర వివరాలు: పుస్తకం పేరు: దైవంతో నా అనుభవాలు రచయత: వేంకట వినోద్ పరిమి పేజీల సంఖ్య: 176 ధర: 200 రూ. పుస్తకం కోసం సంప్రదించాల్సిన వాట్స్ ఆప్ నెంబరు: 8558899478 లేదా https://books.acchamgatelugu.com/product/daivamto-naa-anubhavalu-దైవంతో-నా-అనుభవాలు/