తెల్లారుఝామున...ఆకాశం నెమ్మదిగా లేత ఎరుపు రంగులోకి మారుతుంది.తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు తన బంగారు కిరణాలను పచ్చని పొలాల మీద చల్లుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది మల్లేశ్వరి. చంద్రబింబంలాంటి ముఖంలో కాంతి తగ్గింది.లేత గులాబీ రంగు నూలు చీర కట్టింది మల్లి, ఆమె ముఖంలో కళ తగ్గినా, నుదుటి మీద కుంకుడుకాయంత కుంకుమబొట్టు ముచ్చట కొలుపుతుంది. ఒక చేతిలో సద్ది బుట్ట, ఇంకో చేతిలో పసిబిడ్డను ఎత్తుకొని ఉంది. మల్లేశ్వరి తలెత్తి ఆకాశంకేసి చూసింది,సూర్యుడు తాటి చెట్లతో పోటీపడుతూ ఇంకా పైకి వెళుతున్నాడు,ఒక క్షణం మల్లేశ్వరి చూపు నిటారుగా గర్వంతో అంతెత్తు ఉన్న ఆ తాటి చెట్లపై పడింది.ఆపై వెంటనే ఏదో విరక్తి భావం కనిపించింది మల్లేశ్వరి ముఖంలో.నెమ్మదిగా నిట్టురుస్తూ అక్కడ్నుంచి అడుగులు సాగించింది మల్లేశ్వరి. వీధి చివరిదాకా వెళ్లి రోజువారి కూలీపనులకి వెళ్లే ఆటోలో ఎక్కి కూర్చుంది.చంటోడు,మల్లి ఒడిలో పడుకున్నాడు. ఆటో ముందుకు వెళ్తుంది, చుట్టుపక్క చెట్లన్నీ వెనక్కు వెళ్తుంటే వాటితోపాటు మల్లి కూడా తన గతంలోకి వెళ్ళింది. మల్లికి పద్దెనిమిదేళ్లు ఉన్నపట్నుంచి తన బావ మురళి అంటే ఇష్టపడటం మొదలుపెట్టింది.
మురళి పెద్దగా ఎం చదుకోలేదు,కుల వృత్తి కావడంతో తాటి చెట్లను ఎంతో సులువుగా ఎక్కగలిగేవాడు.మురళి తన స్నేహితులతో పోటీ వేసుకొని మరి తాటి చెట్లను ఎక్కేవారు.మురళినే గెలిచేవాడుకూడా.తాటి చెట్లు ఎక్కడమంటే భలే సరదాగా ఉండేది మురళికి. నడుముకు తాడు కట్టుకొని తాటి చెట్టుని పట్టుకొని ఎక్కుతుంటే,ఉంగరాల జుట్టు ఉన్న మురళి,మల్లి కళ్ళకు ఇంకా అందంగా కనిపించేవాడు,అంతే ఆసక్తిగా చూస్తుండిపోయేది మల్లి. మురళికి కూడా తన మరదలు మల్లేశ్వరి అంటే ఇష్టమే....కాకపోతే బయటకి చూపించేవాడు కాదు.అలా...తాటిచెట్టు పైకి ఎక్కగానే కాస్త గర్వంతోనూ,ప్రేమతోను అందరికన్నా మొదట అతని చూపు మల్లి మీదే పడేది.ఆలా చూస్తాడన్న విష్యం మల్లికి కూడా తెలుసు.మురళి ఎంత ఎత్తున్న చెట్టునైనా అతి సులువుగా ఎక్కేసేవాడు. చెట్లు ఎక్కడం,అతని స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడం...ఇదే అతని పని. మురళి ఎంత చురుగ్గా ఉంటూ చెట్లు ఎక్కుతున్నప్పటికీ అతనికి తన కుల వృత్తి చేయడమంటే అసలు ఇష్టం లేదు."పట్నంలో ఏ కూలీ పని చేసుకోనైనా బ్రతుకుతాకానీ...ఇలాంటి పనులు చేస్కుంటా నేను బ్రతకలేను నాయన " అంటూ నిక్కచ్చిగా వాళ్ళ నాన్నతో అనేవాడు."
ఇట్టంటి పనులా??ఇన్ని సంవత్సరాలు మీకు కడుపునిండా అన్నం పెట్టిందని ఇట్టంటి పనులు అంటావా!! కుల వృత్తి మనకి తల్లితో సమానం రా. అది కేవలం ఒక తాటి చెట్టు మాత్రమే కాదురా....ఈ మనిషి జాతికి ఎంతో మేలు చేసే తల్లి. దాని విలువ నీకేం తెలుసు రా, తాటాకులు ఇండ్ల కప్పులుగా, మన సంప్రదాయంలో ఆడబిడ్డ పుష్పావతి అయినపుడు చాపల,పందిరి,హస్తకళలకు,బుట్టలకు,విసన కర్రలుగా,గొడుగులు వంటి వాటికీ ఉపయోగపడేదే కాకుండా ఈ కాగితాలు కనిపెట్టకముందు తాటాకులపై రాసి తాళపత్ర గ్రంధాలుగా భద్రపరిచారు. ఇంకా ఎండాకాలం వస్తే తాటి ముంజల రూపంలో ఎండతాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.ఇక తాటి పండ్లు... తాటి పండ్ల గుజ్జుతో తాటి రేగులు,దిబ్బరొట్టె,తాటి గారెలు లాంటి రుచికరమైన వంటలు చేసుకుంటారు. వాటిలో ఎన్నో ఉంటాయి రా మురళి. ఇక తాటికల్లు..పగలంతా అలుపెరగకుండా శ్రమించి ఈ శరీరానికి తాటికల్లు చుక్క పడందే నిద్రపడుతుందా! పైగా తాటికల్లు మనసేరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తాటిబెల్లం రక్తహీనతను తగ్గిస్తుంది.తాటిచెట్టు కాండం మన ఇళ్ల దూలాలుగా వాడతారు.తాటి పీచుతో తాడులు తాయారు చేస్తారు. ఇలా తాటిచెట్టు విత్తనం నుంచి చెట్టు ఆకుల దాక మనుషులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది రా. దీని విలువలు తెలియక ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాయి తాటిచెట్లు. ఇవి ఉన్నంత కాలంమైన వీటి ఋణం తీర్చుకోవాలి రా!!" అంటూ మురళి తండ్రి సూరయ్య,మురళికి అర్ధమయ్యేలా చెప్పిన వినిపించుకునేవాడు కాదు మురళి.
అతని ప్రవర్తనతో విసుగొచ్చిన సూరయ్య...అతన్ని పట్టించుకోడం మానేసాడు. మురళి ఇంటి బాధ్యతలు పట్టించుకునే వాడు కాదు.కష్టం చేసి బ్రతికే ఆలోచనే లేదు అతనికి.మల్లికి కూడా మురళిలో నచ్చని గుణం కూడా ఇదే. మురళి స్నేహితులతో కలిసి రోజు రోజుకు చెడిపోతున్నాడు.ఈమధ్య మందు తాగడంకూడా అలవాటు చేసుకున్నాడు. చెట్టంత కొడుకు ఇలా చేయిజారిపోవడం చూడలేకపోతున్న మురళి తల్లి అంజమ్మ,భర్త సూరయ్య దెగ్గర రోజు పోరుపెట్టడంతో..పెద్దలు మాట్లాడుకొని, మామ కూతురైన మల్లితో ఇద్దరి ఇష్టాలను తెలుసుకొని ఇద్దరికి పెళ్ళిచేసారు. పెళ్లి చేస్తే మారీ బాధ్యతగా ఉంటాడు అనుకున్న కొడుకు,లేని పెద్దరికం తెచ్చుకొని ఇంకా బలాదూర్ లా మారాడు. స్నేహితులతో తిరగడం,తాగడం,పేకాట ఆడటం,సినిమాలకు వెళ్లడం,అప్పుడప్పుడు ఇంటికి ఏ అర్ధరాత్రులు వచ్చేవాడు. ఇష్టపడే పెళ్లి చూస్కున్నాడుగా,ఆ ఇష్టంతోనైనా భార్య మాట విని మారతాడేమో అని మల్లి ఎన్నోసార్లు చెప్పి చూసింది.
తెల్లారి మత్తు దిగాక మల్లితో ఎక్కడని ప్రేమగా ఉండేవాడు, అది ఆ కొంచంసేపే..ఇల్లు దాటి అడుగు బయటపెడితే మనిషి ,కంటికి కనిపించేవాడు కాదు.మళ్ళి ఏ అర్ధరాత్రో మద్యం మత్తులో ఇంటికి వచ్చేవాడు. అదే మత్తులో తాను ఎంతో ప్రేమించే తన భార్య మల్లి పై కూడా చేజేసుకునేవాడు. మురళి ప్రవర్తన అసలేం నచ్చట్లేదు మల్లికి.తాను ప్రేమించి,పెళ్లాడింది ఇలాంటి ఒక పనికిరాని ఒక అసమర్దుడిని అన్న విష్యం ఆమె గ్యానప్తికి వచ్చిన ప్రతిసారి ఆమె మీద ఆమెకే విరక్తి వస్తుంది.ఆ ఇంట్లో మురళితో కలిసి కాపురం చేయాలంటేనే తనకు వొళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యేది. మల్లికి మగపిల్లాడు పుట్టాడు.కొడుకును ఆడించడం,లాలించడం ఇలాంటివి కూడా చేసేవాడుకాదు మురళి. ఇదిలా ఉండగా,ఇంట్లో సంపాదించే మగదిక్కు లేక ఆర్ధికంగా ఇంట్లో ఇబందులు మొదలయ్యాయి."నవాబు సంపాదన బూబమ్మ కుట్టుకే సరిపోయింది" అన్నట్లు మురళి సంపాదించే అరకొర సంపదనంతా అతగాడి పేకాటలకు,తాగడానికే సరిపోతుంది.ఇంట్లో అత్త,మామ ముసలివాళ్ళు అయ్యారు, ఇక ఇంట్లో సంపాదించేది ఎవరు? ఒక్క మల్లి తప్ప. ఎప్పుడు కష్టం చేసి ఎరుగదు మల్లి. మల్లి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే అయినా, వారికీ ఉన్నంతలోనే మల్లిని ఒక మల్లెపువ్వులా అపురూపంగా పెంచారు ఆమె తల్లిదండ్రులు. అలంటి మల్లి ఇప్పుడు ఒక భార్యగా తాను పడుతున్న కష్టాలకు వడలిపోయిన మల్లెల అయింది.ఇంట్లో ఏర్పడిన ఆర్ధిక పరిస్థితికి ఒక్కో పూట కూరకు కూడా ఇబ్బంది అయ్యేది. ఆ చంటిపిల్లాడు కూడా ఇబంది పడేవాడు.
ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన మల్లికి, ఇక తాను పనికి వెళ్లకపోతే వచ్చే కష్టాలు అర్ధమై,పనికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది.పసిపిల్లాడ్ని తీస్కొని కూలీ పనికి వెళ్లడం మొదలు పెట్టింది మల్లి. అంజమ్మ...కోడలు ఒక్కతే ఆ పసిపిల్లాడితో కష్టపడడం చూడలేకపోయింది.మల్లిని ఇంట్లో ఉంటూ ఇంటిని చుస్కోమని చెప్పి అంజమ్మ పనులకు వెళ్ళేది. కానీ కుటుంబం కోసం అంజమ్మ సహాయం కొన్ని రోజులతోనే ఆగిపోయింది.వయ్యస్సు పెరగడంతో పనులు చేయలేక నిరసించి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది.సూరయ్య చేతనైనంత పని చేసి కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. మల్లి పొలం పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. ఇలా కాలం సాగుతుండగా.....మల్లి పొలంలో పని చేస్తుంటే, సూరయ్య కంగారు కంగారుగా "మల్లి...ఓ మల్లి...పెద్ద ఘోరం జరిగిపోయిందే" అంటూ బెంబేలెత్తిపోతు వచ్చాడు. కంగారు,బాధతోకూడిన ఆ అరుపులువిని, ఎలాంటి కబురు వినాల్సి వచ్చిదోనని గాబరపడిపోయింది."ఏంటి మావయ్య,ఏమైంది "అంటూ అడిగింది. "పెద్ద ఘోరం జరిగిపోయింది,మన మురళిగాడు తగిన మైకంలో...పోటీ పెట్టుకొని చెట్టు ఎక్కడంట,ఆ మత్తులో నడుము తాడు పట్టును చుస్కోలేదంట.పట్టు వదిలి అంత ఎత్తునుంచి కింద పడ్డాడంట.చెట్టు కింద బండరాయి ఉండడంతో పడడం పడడం నడుముకి బాగా గట్టిగా తగిలిందంటే.నా తల్లి నీ రాత బాగుండి వాడి తలకు ఎం కాలేదు" అంటూ కళ్ళనీరు కారుస్తూ చెప్పాడు సూరయ్య. వెంటనే సూరయ్య,మల్లి కలిసి హాస్పిటల్ కు పరుగు లంకించుకున్నారు. నడుముకి బాగా గట్టిగ తగలడంతో కనీసం రెండు నెలలపాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని అన్నారు డాక్టర్.
ఇంకేముంది మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు,అసలే ఇంట్లో చాలి చాలక ఇబంధులు పడుతుంటే ఇప్పుడు మురళి ఖర్చులు తోడయ్యాయి. ఇదివరకులా మల్లి మురళితో ప్రేమతో ఉండలేకపోతుంది.మల్లెపువ్వులాంటి మల్లి ముఖంలో నవ్వు కనుమరుగైంది.కోడి కూయకముందే లేచి,ఇంట్లో పని చేసి ,వండిపెట్టి తనకు సద్ది కట్టుకొని సరిగ్గా ఆరింటికి ఆ పసిపిల్లాడితో కూలీ ఆటో ఎక్కుతుంది. సాయంత్రం దాక పొలం పనులుచేస్కోని,నీరసంగా ఇంటికి చేరుతుంది. వచ్చాక..మామ సూరయ్యకు ఆ పూట వండుకోడానికి కూరలకు డబ్బిచ్చి పంపి,కాస్త నీళ్లు వేడి చేసి..ఆ వెంటనే పిల్లాడికి స్నానం చేయించి,తాను స్నానం చేసాక,సూరయ్య తెచ్చిన కూరలు తరిగి వంట మొదలు పెడుతుంది. ఈలోగా అంజమ్మ ఒక గుడ్డను వేడినీళ్లలో ముంచి మురళి ఒళ్ళంతా శుభ్రం చేసేది.వంట పూర్తయ్యాక అందరికి వడ్డించి,తాను తిని పిల్లాడ్ని పాడుకోబెట్టేది. ఇది గత కొద్దినెలలుగా జారుతున్న రోజువారీ ప్రక్రియ. ఎటు కదలకుండా మంచానికే పరిమితమైన మురళి,రోజు ఇంట్లో జరిగేది చూస్తూ,తనలో తాను మధన పడటం మొదలుపెట్టాడు.తాను ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేసాడో ఇప్పుడు అంత మెల్ల మెల్లగా అర్ధమవుతుంది.ఇంటిని,ఇల్లాల్ని,పిల్లాడ్ని,తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా తాను ఎంతపెద్ద తప్పుచేసాడో అర్ధమైంది అతనికి.భార్య ప్రేమను కోల్పోయాడు, పిల్లాడి చిలిపి అల్లరిని,చిలకపలుకులు కోల్పోయాడు.ఎంత ఆలోచించిన అతనికి చివరికి మిగిలిందేమిటి??. పిల్లడు మల్లి ఒడిలో చేరి మల్లి తాళిబొట్టుతో ఆడుకుంటున్నాడు, మురళి చూపు మెల్లగా బాబు మొఖం నుంచి చేతిలో పట్టి ఆడుతున్న తాళిబొట్టు పై పడింది. తాళి....మురళి ఎంతో ఇష్టపడి మల్లి మేడలో కట్టిన తాళి. మురళి ఒక్క క్షణం మల్లి మొఖం చూసాడు...మల్లి ముఖంలో కళ లేదు,ఆ మల్లెపువ్వులాంటి నవ్వులేదు, ఆమె కళ్ళలో మురళిపై ప్రేమలేదు...ఒక్క క్షణం "అందుకు కారణం ఎవరు??"అని ప్రేశ్నించింది మురళి అంతరాత్మ. అతనిని ఇష్టపడి నమ్మి వచ్చిన అమ్మాయిని తాను ఇన్ని కష్టాలు పెడుతున్నాడా??రక రకాల ఆలోచనలతో సతమతం అయిపోతున్నాడు మురళి.మనసు పశ్చాత్తాపంతో నిండిపోయి, ఎనలేని దుఃఖంగా... మారి కన్నీళ్ల రూపంలో బయటకి వస్తుంది. ఆ రాత్రి నిద్రపట్టలేదు మురళికి. కొద్దిరోజులకు ఇదివరకులా నడవడం మొదలుపెట్టాడు మురళి. పిల్లాడితో ఆడుకుంటూ,కుటుంబంతో సమయం గడపదం మొదలు పెట్టాడు.మల్లితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడు మురళి. మల్లికి కూడా మురళిలో వస్తున్నా మార్పు కొద్దికొద్దిగా నచ్చుతుంది. ఇద్దరు మళ్ళి ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడటం మొదలు పెట్టారు. బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాడు మురళి. ఇప్పుడు ఇదివరకులా తాగట్లేదు,స్నేహితులతో బలాదూర్ తిరగట్లేదు,మురళి తన ఊర్లోనే ఆటో వేయడం మొదలు పెట్టాడు.ఇంటిని తానే చుస్కుంటున్నాడు,మల్లి పనులకు వెళ్లడం మానేసి ఇంట్లో ఉంటూ పిల్లాడ్ని చూసుకుంటుంది.

