అవంతి రాజ్యం అమరసేనుడి పాలనలో ఉండేది .ఓకరోజు తనమంత్రి సుబుధ్ధి తో కలసి రాత్రి సమయంలో నగర ప్రయాణం చేస్తుండగా ,ఉరుములు,మెరుపులతో వర్షం ప్రారంభం అయింది. రాజు,మంత్రి తమ గుర్రాలతో పెద్దచెట్టుకిందకు వెళ్ళారు .
' బాటసారులు తమగుర్రలను అక్కడే వదలి ఇలారండి '
అని సమీపంలోని ఆలయ మడపంలో నుండి పిలుపు రావడంతో ,రాజా,మంత్రి ఆమండపం చేరుకున్నారు.
అక్కడ చిన్న చలిమంట వేసిన ఓవ్యక్తి " రాత్రుల ప్రయాణం ప్రమాదకరం అని తెలియదా "అన్నాడు.
" తప్పని సరిగా వెళ్ళవలసిన పని " అన్నాడు మారువేషంలోని మంత్రి.
ఎప్పుడు ఆహరం తిన్నారో ఏమో ఇవిదినండి " అని తన జోలెలోనుండి రెండు పెద్ద దానిమ్మ పండ్లు అందించాడు ఆవ్యక్తి.
" తాతా ఇంతరాత్రి సమయంలో నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నీకు ఉన్న కోరిక ఏమిటి " అన్నాడు మంత్రి.
" గత ఇరవై ఏళ్ళుగా వ్యవసాయ కూలిగా పనిచేసాను, ఇదేనాయిల్లు ప్రస్తుతం యాచనపై జీవిస్తున్నాను, కోరిక ఏదైనా సమాజానికి వినియోగపడిలా ఉండాలి అందుకే మనఊరి షావుకారివద్ద నాసంపాదన దాచుకున్నాను వచ్చవారమే రహదారివెంట భూమికొని ధర్మ సత్రంకడితే తమవంటి బాటసారులకు , మావంటి అనాధలకు,ముఖ్యంగా ఆడవారికి,పిల్లలకు రక్షణగా ఉంటుందని ఆలోచనతో భూమిఇచ్చే దాతలు ఎవరూ లేరు నావద్ద ఉన్న ధనం భూమి కోనుగోలుకు,కట్టుబడికి చాలదు "అన్నాడు నిరాశగా.ఆవ్యక్తి.
అతని నిజాయితీని పరిక్షింపదలచిన రాజు " ఉత్తరం రహదారిలో ఊరి చివర పెద్ద చెరువు ఉంది ఆచెరువుతోసహ ఆ ప్రాంతమంతామాదే నీకు కావలసినంత భూమి తీసుకుని రేపే ధర్మసత్రం పని ప్రారంభించు,ఎవరైనా అడిగి సుభుధ్ధి గారి అనుమతితో కడుతున్నాను అనిచెప్పు "అన్నాడు రాజు.
"మహదానం ఆసుబుద్ది ఎవరో ఆయన పేరే ఆధర్మ సత్రానికి పెడతాను " నమస్కరించాడు ఆవ్యక్తి.
వర్షం తగ్గడంతో రాజు,మంత్రి తమ గుర్రాలపై రాజధానికి చేరుకున్నారు.
రెండురోజుల అనంతరం మారు వేషాలు లేకుండా ఉత్తరం బాటలోని చెరువు వద్దకు చెరుకుని ఆశ్చర్యపోయారు అక్కడ వందమందికి పైగా కూలీలు పనిచేస్తు పునదుల పనిపూర్తి చేసారు, ఆనిర్మాణం చేపట్టిన వ్యక్తి తట్టతో మట్టి పోయడం చూసి ,గుర్రం వద్దకు రమ్మని సైగ చేసాడు.
రాజు,మంత్రులను సమీపంలోనివస్తునే గుర్తించి తనపాగా తీసి నడుముకు చుట్టుకుని నమస్కరించి వినయంగా నిలుచున్నాడు.
" మరో వారంలో ఆగిపోతుంది మహరాజా "అన్నాడు ఆవ్యక్తి.
" ఏంఎందుకని నీవద్ద దాచిన ధనం ఉన్నదా అన్నావుగా "అన్నాడు రాజు.
" నేను ధనం దాచిన షావుకారు ఆస్ధలం తమ తాతగారిద్వారా తనకు సంక్రమించింది అని ఐదు వేలరూకలు తగ్గించి పది హేను వేల రూకలు ఇచ్చి పంపించాడు "
ఆమాటవిన్నరాజుగారు ,షావుకారు పేరు తెలుసుకుని " ఎట్టిపరిస్ధితులలోనూ పనిఆగకూడదు ,రేపటినుండి మారాజభటులు ఇక్కడ ఉంటారు ఆయంత్ర మీరు ఇళ్ళకు వెళ్ళేప్పుడు వారేమీకులి చెల్లిస్తారు రేపటినుండి కూలీలను పెంచండి,బాలకార్మికులను పనికి తీసుకురావద్దు ,తాతా నువ్వు నీడపట్టున కూర్చొ కట్టడం పనులు గమనించుచాలు " అని రాజు,మంత్రి వెళ్ళిపోయారు .
షావుకారుకు పదివేల రూకలు జరిమానా విధించి ఆధనాన్ని ధర్మన్నకు అందజేసాడు రాజు, సత్రం లో అంగళ్ళు నిర్మించి వారాంతరం సంత ఏర్పాటు చేయించి ఆఅంగళ్ళపై వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వాహణకు ఏర్పాటుచేసి ఆసత్రానికి ధర్మన్న ధర్మ సత్రం పెట్టించాడు రాజుగారు.

