స్నిగ్ధ - దినవహి సత్యవతి

స్నిగ్ధ

రాత్రి తొమ్మిదైంది. భోజనం చేసి మంచంపై వాలిన చక్రవర్తి టేబుల్ దగ్గర కూర్చుని ఏదో దీక్షగా వ్రాసుకుంటున్న అర్థాంగి, స్నిగ్ధ ని చూసి ‘రోజంతా పని చేసి చేసీ ఎంత అలసిపోయినా ఇది మాత్రం మానదు! ఏమి వ్రాస్తూ ఉంటుందో? డైరీ ఏమో?’ అనుకున్నాడు.

ఇంతలో “ఇదిగో..సిగ్గూ..సిగ్గా...అబ్బబ్బ నీ పేరేమిటోగానీ నోరే తిరగదు! అయినా అలాంటి పేర్లు పెట్టుకుంటారా ఎవరైనా పిల్లలకి? చోద్యం కాకపోతే! ఓ కోడలు పిల్లా! ఇలారా ఒకసారి” అత్తగారు, జగదాంబ, పిలుపు చెవిన పడగానే, వ్రాత ఆపి హడవిడిగా లేచి పరుగు పరుగున వెళ్ళింది స్నిగ్ధ.

అప్పుడే వంటింట్లో పనంతా ముగించుకుని తన తల్లికి కావలసినవన్నీ అందించి ఇలా వచ్చిందో లేదో అంతలోనే మళ్ళీ ఆవిడ పిలుపు భార్య పరుగూ! భార్య అటు వెళ్ళగానే నెమ్మదిగా లేచి టేబుల్ దగ్గరకి వెళ్ళి చూసాడు, అది డైరీ కాదు ఏదో భాషా పుస్తకం, ఆ ప్రక్కనే ఒక నోట్ పుస్తకం ఉన్నాయి. అర్థం కాలేదు. స్నిగ్ధని అడగాలి తీరుబడిగా అనుకుని తిరిగి వచ్చి మంచంపై వాలాడు.

స్నిగ్ధ వెళ్ళేటప్పటికే “ఏం కావాలమ్మా నాకు చెప్పు” అంటూ వెళ్ళింది కావేరి, స్నిగ్ధ ఆడపడుచు.

“నిన్నెవడు పిలిచాడూ పోయి చదువుకో “ కసిరింది జగదాంబ.

ఏదో అనబోయిన ఆడపడుచుని, అప్పుడే అక్కడికి వచ్చిన స్నిగ్ధ వారించి “చెప్పండి అత్తయ్య ఏంకావాలి?”

అత్తగారు పురమాయించిన పని చేసి “నీ సహనానికి జోహార్లు వదినా” నాటక ఫక్కీలో చెప్పిన ఆడపడుచు పొగడ్తకి చిరునవ్వే సమాధానమిచ్చి తన గదిలోకి వెళ్ళింది.

భార్యలో చక్రవర్తికి ప్రియమైనవి ...మొదటగా ఆమె పేరు...’స్నిగ్ధ’ తెలుగు భాషా పండితుడు కనుక అర్థం ఠక్కున తెలిసింది...స్నేహశీలి...అవును ఆమె స్వభావానికి తగిన పేరు అనుకున్నాడు. చామనఛాయగా ఉన్నా కళగా ఉండే ఆమె ముఖవర్ఛస్సు, పొడవు లేకపోయినా ఎంతో ఒత్తుగా గిరజాలు తిరిగి ఉండే ఆమె కేశ సంపద...ఇలా ఇంకా ఎన్నో! అన్నిటినీమించి ఆమె అందాన్ని ఇనుమడింపజేసేదీ, ఆమెను చూడగానే ఎటువంటి కలతనైనా మరపించి, మదిని మురిపించగలిగే మనోహరమైన ఆమె చిరునవ్వు! అదే ఆమెకు పెట్టని ఆభరణం. అవన్ని అలా ఉంచితే అతగాడికి ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే...ఆమెకు అంత సహనం ఎలా అలవడిందా అనీ! స్నిగ్ధతో పరిచయం తమ పెళ్ళికి దారితీసిన సంఘటనలూ మదిలో మెదిలాయి చక్రవర్తికి...

!+!+!

చిన్నతనంనుంచీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే చదివిన చక్రవర్తికి ఇంగ్లీష్ మాట్లాడటం అంత బాగా రాదు. చదువు పూర్తికాగానే భాగ్యనగరంలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా చేరాడు. ఆంగ్లంలో ఎవరైనా ఏదైనా అడిగితే వాక్యాల కూర్పు కోసం తడుముకోవాల్సిందే అతగాడు!

ఒకసారి దేశ రాజధానిలో జరుగుతున్న తెలుగు సదస్సుకు, విశ్వవిద్యాలయం తరఫున హాజరు కావటానికి వెళ్ళాడు. అక్కడ, విదేశాలనుంచి సదస్సుకు హాజరుకావడానికి వచ్చిన ఒక వ్యక్తి, చక్రవర్తిని ఆంగ్లంలో ఏదో సమాచారం అడిగినప్పుడు బదులివ్వడానికి తడుముకుంటుంటే, అదృష్టవశాత్తూ అక్కడ వాలంటీరుగా పని చేస్తున్న స్నిగ్ధ, సమయానికి దేవతలా వచ్చి విదేశీయుడికి సమాధానం చెప్పి చక్రవర్తిని ఇబ్బందినుంచి కాపాడింది. అలా ఆమె పరిచయం అయింది. ఆమె బ్యాడ్జి చూసి పేరు స్నిగ్ధ అని తెలుసుకున్నాడు. పేరుకి తగ్గట్లే ముగ్ధమనోహరంగా ఉన్న ఆమెని చూసిన క్షణానే మనసు పారేసుకున్నాడు. ఆమె గురించి మరిన్ని వివరాలు సేకరిద్దామనుకున్నా సదస్సు పూర్తయినా మరి ఆమె కనిపించకపోయేటప్పటికి నిరాశ చెందాడు. అయినా ఆమెని మరువలేకపోయాడు.

చక్రవర్తీ వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. అతడికి ఒక చెల్లెల్లు, ఇంటర్మీడియట్ చదువుతోంది. అతడి చిన్న వయసులోనే తండ్రి చనిపోవటాన, పలు కష్టాలకోర్చి తల్లే పిల్లలిద్దరినీ పెంచుకొచ్చింది. చక్రవర్తికి పెళ్ళిచేయాలని అనుకున్నప్పుడు ఒక సంబంధం రావడం, యాదృచ్ఛికంగా ఆ అమ్మాయి స్నిగ్ధే కావడం జరిగింది. ఆ విషయం తెలిసి చక్రవర్తి మనసు ఆనందంతో నాట్యం చేసింది.

సంబంధం తెచ్చిన మేనమామ ద్వారా స్నిగ్ధ గురించి తెలిసినదేమంటే...ఆమె తండ్రి గవర్నమెంటు ఉద్యోగి, తల్లి గృహిణి అనీనూ, తండ్రి ఉద్యోగరీత్యా దాదాపు దేశమంతా తిరగటంలో, దిల్లీలో సదస్సు సమయంలో ఆమె అక్కడ ఉండటం తటస్థించిందనీ, స్నిగ్ధ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఆమె తండ్రికి బాగా సుస్తీ చెయ్యడంతో ఆయన ముందస్తు ఉద్యోగ విరమణ చెయ్యవలసివచ్చిందని దాంతో తాతగారి ఊరికి మకాము మార్చేశారనీనీ.

తాను ఆరోగ్యంగా ఉండగానే ఆమెని ఒక ఇంటి దానిని చేద్దామనుకుంటున్నానని తండ్రి అనటం, ఆయన ఆరోగ్య దృష్ట్యా స్నిగ్ధ అందుకు అంగీకరించటం, ఆ సమయంలో తమ సంబంధం గురించి తెలిసి, రావటం జరిగిందనీనీ!

కాపరానికి వచ్చినప్పటినుంచీ గమనిస్తూనే ఉన్నాడు...ఇంట్లో అందరికీ అన్నీ సమయానికి అమర్చిపెడుతూ, అలసట ముఖంలో ఏమాత్రం కనిపించనీయక తనకొచ్చే ఆదాయంలోనే గుంభనగా సంసారం నెట్టుకొస్తున్న భార్యని. ఆడపడుచునీ అత్తగారినీ ఆదరంగా చూసే ఆమె మనస్తత్వం చక్రవర్తిని ఎంతగానో ఆకట్టుకుంది.

అదే సమయంలో తల్లి, స్నిగ్ధని కొంచం ఎక్కువగానే అవస్థలు పెట్టడం కూడా చక్రవర్తి దృష్టిని దాటిపోలేదు. భార్యంటే విపరీతమైన అనురాగం ఉన్నా, తండ్రి పోయినప్పటినుంచీ అష్టకష్టాలు పడీ తననీ చెల్లినీ పెంచి ఇంతవాళ్ళని చేసిన తల్లికి ఏమీ చెప్పలేని బలహీనత.

!+!+!

“ఇంకా పడుకోలేదా మీరు?” నుదుటిపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అడిగిన భార్య అనురాగపూరిత పలుకులకి ఆలోచనలోంచి బయటపడి “నువ్వు ప్రక్కన లేకుండా నాకు నిద్రెలా వస్తుందీ?” అన్నాడు ఆమెని గాఢంగా కౌగిలిలో బంధిస్తూ. భర్తనుంచి లభించే ఆ ప్రేమా అనురాగాలు అప్పటిదాకాపడిన శ్రమనంతా చిటికెలో మాయం చేయగా ఆతడి చేతులలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది స్నిగ్ధ.

విశ్వవిద్యాలయం వార్షికోత్సవం జరుగుతుంటే భార్యని తీసుకెళ్ళాడు చక్రవర్తి. అన్ని విభాగాలవారూ సరదాగా జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. స్నిగ్ధని అందరికీ పరిచయం చేస్తూ “ఈయన జర్మన్ భాష అధ్యాపకుడు, నాకు మంచి స్నేహితుడూ కూడానూ” భరత్ ని చూపించి చెప్పాడు.

“నమస్తే” చేతులు జోడిస్తూ జర్మన్ భాషలో అతడిని పలకరించిన స్నిగ్ధని చూసి ఆశ్చర్యపోయాడు. అదే కాదు ఆ తరువాత హిందీ, ఫ్రెంచ్ అధ్యాపకులని పరిచయం చేసినప్పుడు కూడా వారి వారి భాషలలోనే అందరినీ స్నిగ్ధ పలకరించటం చక్రవర్తిని అమితాశ్చర్యానికి గురి చేసింది. అందరూ స్నిగ్ధని అన్ని భాషలు తెల్సి ఉండటం గురించి పొగిడి చక్రవర్తికి కూడా అభినందనలు తెలిపారు.

వార్షికోత్సవంనుంచి ఇంటికి వచ్చి అందరికీ భోజనాలు అవీ చూసి, వంటిల్లు చక్కబెట్టి గదిలోకి వచ్చిన భార్యని “ఏమోయ్! నాకెప్పుడూ చెప్పలేదే నీకిన్ని భాషలు వచ్చని?” అడిగాడు చక్రవర్తి.

“మన మధ్య ఆ సంభాషణ ఎప్పుడూ రాలేదు మరి ఇప్పటివరకూ” చిన్నగా నవ్వి టేబుల్ వద్ద కూర్చుని పుస్తకాలు తెరిచింది.

“ఏమిటోయ్ ఇప్పుడూ ఇంకా వ్రాస్తున్నావు? పడుకో చాలా అలసిపోయుంటావు” భార్య వెనకాల వచ్చి భుజం మీదనుంచి ఆసక్తిగా చూసాడు ఆమె చేస్తున్నదేమిటా అని. ఏదో ఒక భాషా పుస్తకంలోని సమాచారాన్ని చూస్తూ నోట్ పుస్తకంలో తెలుగులో వ్రాస్తోంది. ఆ భాషేంటో తెలియలేదు చక్రవర్తికి.

“ఇదేం భాషా పుస్తకం? ఏం చేస్తున్నావు?”

“ఇది ఫ్రెంచ్ భాష. ఇందులోంచి తెలుగులోకి అనువదిస్తున్నాను. నాకు అనువాదమంటే చాలా ఇష్టం. అలాగే ఎన్నో భాషలు నేర్చుకోవాలని కూడా ఆసక్తి. నాన్న ఉద్యోగరీత్యా దేశమంతా తిరగటంవలన కొన్ని భాషలు నేర్చుకున్నాను. ఇంకా చాలా భాషలు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా నాన్నకి ఆరోగ్యం దెబ్బతినటం, పెళ్ళైపోవడంవల్ల మరి కుదరలేదు” అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ధ్వనించిన ఆమె కంఠంలో చివరి మాటలు చెప్తున్నప్పుడు మాత్రం దిగులు గమనించాడు చక్రవర్తి.

“మరి ఫ్రెంచ్, జర్మన్ ఇత్యాది భాషలు ఎలా నేర్చావు?”

“కాలేజీలో ఫ్రెంచ్ రెండవ భాషగా తీసుకున్నాను. జర్మన్ భాష ప్రత్యేకంగా కోర్సు చేసాను. హిందీ ఏమో దిల్లీ లో ఉన్నప్పుడు అలవాటయింది. ఆంగ్ల మాధ్యమంలో చదవడంవల్ల ఇంగ్లీషు వచ్చింది”

“అయితే మాత్రం అనువాదం చేయాలంటే భాషపై పట్టు చాలా ఉండాలి కదా?”

“అవును అందుకనే ఆయా భాషల పుస్తకాలు లైబ్రరీనుంచి తెచ్చుకుని రోజుకి కొంతసేపైనా ఇదిగో ఇలా సమయం దొరికినప్పుడల్లా అనువదించడం చేస్తుంటాను”

అప్పుడు దొరికింది చక్రవర్తికి, రోజూ రాత్రి పనంతా అయ్యాక స్నిగ్ధ టేబుల్ దగ్గర కూర్చుని ఏమి వ్రాస్తుంటుందోనన్న తన సందేహానికి సమాధానం.

“నీకు ఇష్టమైతే ఇప్పుడు నీకు నేర్చుకోవాలని ఉన్న భాషలన్నీ నేర్చుకో” అన్నాడు ఆమె అనువదిస్తున్న పుస్తకం చేతిలోకి తీసుకుని చూస్తూ.

“నిజంగానా? కానీ.......?” వాక్యం పూర్తి చేయలేదు.

“నాకు తెలుసు నీవేమనుకుంటున్నావో! అమ్మ ఏమంటుందా అనేగా?”

“అవునండీ. అత్తయ్యని కష్టపెట్టి ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఇంకా కావేరి చదువూ పెళ్ళీ బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి అని ఆలోచిస్తున్నాను”

“ఖర్చు గురించి నువ్వేమీ ఆలోచించకు. హాయిగా చదువుకో. మిగతావన్నీ నేను చూస్తాను. అమ్మతో నేను మాట్లాడతాను. కావేరి పెళ్ళికింకా చాలా సమయం ఉంది. ఇకపై ఇంటి పనిలో కూడా నీకు సహాయం చేస్తాను. సరేనా?” భార్యని దగ్గరికి తీసుకుని చుబుకం ఎత్తి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు చక్రవర్తి.

“ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేనండీ. నా చిరకాల వాంఛ నెరవేరబోతోంది. మీదెంత మంచి మనసు” చక్రవర్తిని కౌగలించుకుంది.

అలా తన పట్టుదలతో భర్తనుంచి ప్రోత్సాహం పొంది డిగ్రీలో ఆగిపోయిన చదువు పూర్తి చేసింది. చక్రవర్తి పని చేస్తున్న విశ్వవిద్యాలయంలోనే పార్ట్ టైం ఉద్యోగంలో చేరి, సమాంతరంగా దాదాపు పది దేశ భాషలలోను, నాలుగు విదేశీ భాషలలోను డిగ్రీలు, ప్రావీణ్యం సంపాదించుకుంది. చదువైన వెంటనే ప్రభుత్వం తరఫున భాషా-తర్జుమా అధికారిగా ఉద్యోగం సంపాదించుకుంది స్నిగ్ధ.

ఇల్లూ సంసారం సమర్థవంతంగా నిర్వహించుకుంటూ, అత్తగారిని ఆదరంగా చూసుకుంటూ, భర్తకి అన్నిటా చేదోడు వాదోడుగా ఉంటూ, బాధ్యతలలో పాలుపంచుకుని ఆడపడుచు పెళ్ళికి తనవంతు ఆర్థిక సహకారం అందించి వ్యక్తిగా తన ఔన్నత్యాన్ని చాటుకుంది స్నిగ్ధ.

స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బహుభాషా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా భోధిస్తూ, ఎన్నో ఇతర భాషల పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేస్తూ తెలుగు భాషా ప్రాశస్త్యంకోసం, తెలుగు సాహిత్య ప్రచారానికి తనవంతు కృషి చేస్తున్న అర్థాంగిని తలుచుకుంటే గర్వంతో ఉప్పొంగిపోతాడు చక్రవర్తి.

*****శుభం*****

స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బహుభాషా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా భోధిస్తూ, ఎన్నో ఇతర భాషల పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేస్తూ తెలుగు భాషా ప్రాశస్త్యంకోసం, తెలుగు సాహిత్య ప్రచారానికి తనవంతు కృషి చేస్తున్న అర్థాంగిని తలుచుకుని గర్వంతో ఉప్పొంగిపోతాడు చక్రవర్తి.

*****శుభం*****

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల