Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aadarsham small story

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

రా'బందు'లు

బందు బందూకుల నడుమ జీవనం...
బడుగుజీవి బతుకులెంత దుర్భరం!

తుమ్మితే బందు.. దగ్గితే బందు...
అయ్యవారు తలుచుకుంటే అన్నిటికీ ఒకటే మందు!!


డబ్బు డివై'డెడ్'బై డబ్బు

ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న
కోటీశ్వరుల దగ్గర సంపద!

అదేరీతిన చితుకుతున్న
దరిద్ర నారాయణులకిదో ఆపద!!


పెదరాయుళ్ళు

పదవులంటూ లేకపోయినా ఫర్వాలేదు...
పాలిటిక్స్ లో పవర్ ఫుల్ గా వుంటే చాలు!!

సిద్ధాంతాలకు నిలబడకపోయినా ఫికర్ లేదు...
సెటిల్మెంట్లతో మస్తు మస్తుగా ఆదాయాలు!!

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu