Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Mahabalipuram

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (జూలై 12 - జులై 18) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశాలు కలవు. నూతన ప్రయత్నాలలో సమయాన్ని గడుపుతారు. అనారోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. ఫలితలాలో సమస్యలు కలుగుట మూలాన కొద్దిగా మనోవిచారంను పొందుతారు. ఇష్టమైన వారి సలహాలను పాటించుట మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. అధికారులతో మాత్రం స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో నిదానంగా ఉండుట ఆలోచించి పనులను చేబట్టుట ఉత్తమం. పెద్దవాళ్ళతో పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. అలాగే పెద్దలతో సమయాన్ని గడుపుతారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. సమయానికి భోజనం చేయుట మేలు. ఒక వార్త వలన కొంతమేర భాదను పొందుటకు అవకాశం కలదు. ఆశించిన ఫలితాలు నిదానంగా వచ్చే అవకాశం కలదు, ప్రయత్నం పెంచుట మంచిది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వారం చివరలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా బాగాఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.       

వృషభ రాశి
ఈవారం నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. మంచివారితో కలిగిన పరిచయాలు లాభంను కలగజేస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు. పెద్దలలో గుర్తింపును కలిగి ఉంటారు. సమాజంలో ఒక అడుగు ముందుకు వేయుటకు అవకాశం కలదు. ధర్మసంబంధమైన పనులను చేపట్టుట మంచిది. అనుకోని విషయాలో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తొందరపాటు కూడదు. నిదానంగా ఫలితాలు ఆశించుట వలన బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. అధికమైన ఆలోచనలు చేయుట మూలాన మానసికంగా ఇబ్బందులను కలిగి ఉంటారు. నూతన ఆలోచనలు చేయకండి. కొత్త పనులను వాయిదా వేయుట ఉత్తమం. వ్యాపారస్థులు జాగ్రత్తగా ఉండుట ఆలోచించి అడుగులు వేయుట మేలు. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో కలిగిన సమస్యలను వారం చివర వరకు పరిష్కారం చేసుకొనే అవకాశం కలదు. వారం చివర్లో మంచి ఫలితాలను పొందుతారు.       

మిథున రాశి
ఈవారం మీరు కుటుంబంలో సంతోషకరమైన వార్తను వింటారు. సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగిఉంటారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఇష్టమైన వారిని కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారం మధ్యలో స్వల్ప సమస్యలు పొందినను వారం చివరకు విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి. సమయానికి భోజనం చేయుట మేలు. ప్రయాణాలలో ప్రమాదాలు కలుగుటకు అవకాశాలు కలవు. కాకపోతే తగిన జాగ్రతలు పాటించుట ఉత్తమం. బంధువులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. నిదానంగా వ్యవహరించుట మంచిది. స్నేహితులతో కలిసి చేయు పనులలో జాగ్రత్తలు తీసుకోకవడం చేయుపనిని సరిచూసుకోవడం వలన సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు. చేయు వృత్తిలో సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల తగిన జాగ్రత్తలు పాటించుట వలన చాలావరకు ఇబ్బందులను తొలగించుకున్న వారు అవుతారు.

కర్కాటక రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. కావున ప్రతి పనిని ఆలోచించి చేయుట మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. ధార్మిక పనులకు ధనంను ఖర్చుచేసే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలలో ఖర్చును కలిగి ఉంటారు అధికంగా ప్రయాణాలు చేయుట మూలాన అలసి పోతారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చేయండి. ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యహరించుట చేత అనవసరపు ఖర్చును తగ్గించుకొనే అవకాశం కలదు. వారం ఆరంభంలో మాటను పొదుపుగా వాడుట అలానే వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడం చేయండి. అధికమైన ఆలోచనలు చేస్తే ఇబ్బందులను పొందుతారు. కావున ఫలితంను ఆశించకుండా పనులను చేయుట ఉత్తమం. అనారోగ్యం భాదను పొందుతారు జాగ్రత్త అవసరం. అనుకోకుండా తెలియని వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. సంతోషాన్ని పొందుతారు. మరొక ప్రదేశంలో ఉండవలసి రావోచ్చును స్థానచలనం ఉంటుంది. కుటుంబంలో నిర్ణయాలను నిదానంగా తీసుకోవడం మంచిది.

సింహ రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలు రావడం చేత సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. అధికారులతో ఉన్న మంచి అనుబంధాల మూలాన లబ్దిని పొందుతారు. వారం ఆరంభంలో ఉత్సాహంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు ఆస్కారం కలదు. తలపెట్టిన పనులలో శ్రమను చేయుట అందరిని కలుపుకొని వెళ్ళుట ఉత్తమం. ఇష్టమైన వారిని కలుసుకోవడం వారి మూలాన మీరు తలపెట్టిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన విధంగానే ఉండుట చేత ఆనందంను కలిగి ఉంటారు. బంధుమిత్రులతో నిదానంగా ఉండుట వారిని కలుపుకొని వెళ్ళుట ఉత్తమం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు, విజయాన్ని కలిగి ఉంటారు. మీయొక్క వ్యతిరేకులను ఇబ్బంది పెడుతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. నూతన వస్తువులను కొనాలనే ఆలోచన కలిగి ఉంటే మాత్రం వాయిదా వేసుకోండి. అలాగే విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీ /పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు.     

కన్యా రాశి
ఈవారం మీరు బంధుమిత్రులను కలిసే అవకాశం కలదు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మంచి పేరును సంపాదించుకొనే అవకాశం కలదు. అధికారులతో సఖ్యతగా ఉండుట చేత అనుకున్న పనులను నెరవేర్చుకొనే అవకాశం కలదు. ఆ వారం ఆరంభంలో అనవసరపు ఆలోచనలు చేయుట మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ మాటలను పొదుపుగా వాడటం చేత ఖర్చును తగ్గించుకొనే అవకాశం కలదు. ఇష్టమైనవారితో వారం చివరలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అనారోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట సూచన. సరైన సమయానికి భోజనం చేయుట మంచిది. కుటుంబంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సర్దుబాటుగా ఉండుట సూచన. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తిఅయ్యే అవకాశం కలదు. అకారణంగా తిరుగుట మూలాన అలసిపోయే అవకాశం కలదు. కలహములు దూరంగా ఉండుట అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. 

తులా రాశి
ఈవారం బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో కలిసి నూతన పనులను చేపడుతారు. ఉత్సాహంతో పనులను చేపడుతారు. చేపట్టిన పనులలో ఇబ్బందులు కలుగుతాయి. నిదానంగా ఉండుట మంచిది. ఖర్చును అధికంగా పొందుఅవకాశం కలదు. అనవసరపు ఖర్చును తగించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం, లేకపోతే సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ ఆలోచనల మూలాన తోటివారు భాదను పొందుటకు అవకాశం కలదు. మలిన పదార్థములను భుజించే అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మంచిది. గృహం విషయంలో మీరు చేసిన ఆలోచనలు ప్రయోజనం కలిగించే దిశగా అడుగులువేయుటకు అవకాశం కలదు. అనుకోకుండ చేపట్టిన పని విషయంలో ధనలాభంను పొందుతారు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆశించిన ఫలితాలు వ్యతిరేకంగా రావడం మూలాన దుఃఖాన్ని పొందుతారు.   

వృశ్చిక రాశి
ఈవారం తలపెట్టిన కొన్ని పనులలో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ధనలాభంను కలిగి ఉన్నను అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఉద్యోగంలో అధికారుల మూలాన సమస్యలు తగ్గకపోవచ్చును. నూతన ఆలోచనలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన నష్టం తగ్గుటకు అవకాశం ఉంది. ప్రయాణాలలో సమస్యలను పొందుతారు. ప్రమాదాలు జరుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట మేలు. గతంలో మీరుచేసిన ఆర్థిక ఋణముల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. అకారణంగా భయంను పొందుతారు. సమయానికి భోజనం చేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. కటినంగా మాట్లాడకండి సర్దుకుపొండి. మీ హద్దులో మీరు ఉండుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయాలను అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేయండి.  

ధనస్సు రాశి
ఈవారం మీరు చేపట్టే పనులను ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. వారం మధ్యలో ఆరంభించిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. వారితో కలిసి భోజన సౌఖ్యంను పొందుతారు. వారం చివర్లో ఆలోచనలు అధికం కావడం చేత కొంత మానసికంగా సమస్యలను పొందుటకు ఆస్కారం కలదు. అకారణంగా ఏర్పడు కలహముల వలన ఇబ్బంది తప్పక పోవచ్చును. వారం చివర వరకు కూడా తలపెట్టిన పనులలో మొదలు ఉన్న ఉత్సాహంను కొనసాగించే ప్రయత్నం చేయుట మంచిది. కుటుంబంలో నిదానంగా ఉండుట మేలు. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. వారికి అనుగుణంగా నడుచుకొనుట మంచిది. రాజకీయ వ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. విందులలో వినోదాలలో పాల్గొనే అవకాశం కలదు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి
ఈవారం ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ధనధాన్య సంవృద్దిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభం ఉంటుంది. వారం ఆరంభంలో మాత్రం అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. అలాగే కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. వారం చివర్లో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. కొత్త కొత్త ఆలోచనలను కలిగి ఉండి వాటిని చేపట్టే దిశగా అడుగులు వేయుటకు అవకాశం కలదు. సమాజంలో మీరు చేసిన ఆలోచనల మూలాన కీర్తిని పొందుటకు అవకాశం కలదు. వినోదములలో పాల్గొనుటకు అవకాశం కలదు. వాటి యందు మక్కువను కలిగి ఉంటారు. ఉద్యోగంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి. కావున జాగ్రత్తగా ఉండుట మేలు. అకారణంగా భీతిని పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య సమస్యలను అశ్రద్ద చేయకండి. చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. వాటి మూలన మనోవిచారంను పొందుతారు.   

కుంభ రాశి
ఈవారం మీరు కుటుంబంలో వచ్చిన మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. అందరితో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో ఆర్థికపరమైన అభివృద్దికి అనుకూలమైన పనులను చేపడుతారు. తలపెట్టిన పనులలో బంధువుల మూలాన అధికంగా ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు, జాగ్రత్త వహించుట మంచిది. నిర్ణయాలను తీసుకోవడంలో కొంత ఇబ్బందులను పొందుతారు. వారం మధ్యలో ఆర్థికపరమైన లాభంను కలిగి ఉంటారు. వారం చివర వరకు సమస్యలను పొందుటకు అవకాశం కలదు. అనారోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు కలుగుట చేత విశ్రాంతిని కోరుకొనే అవకాశం కలదు. వారం చివరలో కొంత ప్రయత్నాలలో అనుకూలతలు కలుగుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట సూచన అశ్రద్ద చేయకండి. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు. కావున మానసికంగా ప్రాశంతను కలిగి ఉండే ప్రయత్నం చేయుట ఉత్తమం. శత్రువుల మూలాన సమస్యలు తప్పకపోవచ్చును. నిదానంగా ఉండుట వలన మేలు జరుగుతుంది. బాగా అలోచించి నిర్ణయాలు చేయుట మూలాన సమస్యలు తగ్గుతాయి. 

మీన రాశి
ఈవారం ఆరంభంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. ప్రయత్నాలలో విజయంను పొందుతారు. అందుచేత అందరిలోను గుర్తింపును కలిగి ఉంటారు. నూతన ఆలోచనలు కలిగి ఉండి వాటిని అమలుచేసే దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ప్రయాణాల విషయంలోను అలాగే కుటుంబం విషయంలో తీసుకొనే ఆలోచనల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. ప్రయాణాలలో మార్గమధ్యలో ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. బంధువులతో చేపట్టిన పనులలో ఇబ్బందులు కలుగుట అలాగే వారితో మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు. అమ్మ లేదా మాత్రువర్గం వారితో చర్చలు జరుపుటకు అవకాశం కలదు. అనేక కారణముల మూలాన ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. నియత్రించే ప్రయత్నం చేయుట మంచిది. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. నచ్చిన పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. క్రిందిస్థాయి వారి వలన నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
chandamama raave book review