Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhojana priyulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 2012 - -

mirchi music awards south 2012

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ పేరుతో గత మూడేళ్ళుగా అవార్డులు అందిస్తున్న రేడియో మిర్చి నాలుగో సారి ఈ సంవత్సరం కూడా 16 కేటగిరీ లలో అవార్డులను అందజేయనుంది. దీనికి సంబంధించిన  వివరాలను జ్యూరీ సభ్యులు ఈరోజు (జూలై 12) హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, సురేష్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి, కౌసల్య, రమణ గోగుల, ఆర్. పి. పట్నాయక్, చంద్రబోస్, రాజా (మ్యూజికాలజిస్ట్)  గ్రాండ్ జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించి పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ సంగీతాన్ని, కళాకారుల్ని  ప్రోత్సహిస్తూ రేడియో మిర్చి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. "మొత్తం 674 పాటలు, 100 మంది సంగీత దర్శకులు, 120 సినిమాలు వున్నాయి. అందులోంచి అన్నీ కేటగిరీల్లో ఐదుగురు చొప్పున సీక్రెట్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్నాం. ఈ అవార్డ్స్ ఈ నెల 26న చెన్నై లో అందిస్తామని" తెలిపారు 

మరిన్ని శీర్షికలు