Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

జోగారావ్ : నీకు  లలిత కళల పట్ల ఎందుకు అంత మక్కువ?
భోగారావ్: నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకూ ఆర్టుకీ సంబంధం లేదు. లలిత నా మొదటి భార్య. కళ నా రెండవ భార్య!

శివరావ్: నీ ఫోన్ రింగ్ టోన్ బాగుండదయ్యా! శవం ఊరేగింపు.. డప్పు శబ్దం వినిపిస్తుంది! సరే గానీ, నువ్వెక్కడున్నావ్?
శవరావ్: బంజారాహిల్స్ స్మశానవాటికలో... చచ్చి రెండేళ్లయిందిలే!!

సింగారి: మన ప్రేమ ఫలించింది. నువ్వు తండ్రివి కాబోతున్నావ్. నేను గర్భవతిని!!
సింగారం: ఏమిటో, మీ ఆడాళ్ళంతా ఇలానే మాట్లాడ్తారు. నిన్న గంగ నాతో ఇదే చెప్పింది. మొన్న యమున కూడా ఇదే చెప్పింది, ప్చ్!

హిమాలయ స్వామి: మహారాజా, నీకు సంతాన ప్రాప్తి కలగలేదట గదా? నీ మహారాణిని నేనొకసారి పరీక్ష చేయ వచ్చునా?
మహారాజు: అవశ్యం స్వామీ. వురేయ్ భటులారా, స్వామి వారిని, రాణి గారి వద్దకి తీసుకొని పొండు.
(కొంతసేపయిన తరువాత రాజుగారు భటులను పిలుస్తారు)
మహారాజు: భటులారా, రాణి గారిని పరీక్ష చేస్తామని వెళ్ళిన స్వామి వారు ఏరీ? కనిపించరేం?
భటులు: రాణి గారు కూడా కనిపించడం లేదు మహారాజా!

పుల్లరావ్: ఆ పొదల చాటుకి వొస్తావూ? నీకు ఐస్క్రీమ్ కొనిస్తాను
ఎల్లమ్మ: ఇస్క్రీమా? నన్నంత చీప్ గా ఎంచమాకు. నీకు ఎయిడ్స్ అంటిస్తే, ఎంత ఖర్చవుతుందో ఆలోచించుకో!!

భార్యామణి: ఆ ఎదురింటి కుర్రాడు నాకు SMS లు పంపించి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండీ!!
శిరోమణి: ఏం చేశావని?
భార్యామణి: బాత్రూమ్ కి వెళుతూ తలుపు వేయడం మరిచానండీ!


వనితామణి:  కాళ్ళు పీకుతున్నాయి. కాస్త పట్టండీ ప్లీజ్!
భర్తనాయకుడు: ఎవరి కాళ్ళు పట్టనని నేను ప్రతిజ్జ్ఞ చేశాను. అది నా జీవిత ధ్యేయం. నా ఆత్మ గౌరవానికి సవాలు విసరకు. నేను భరించను!

పేషంటు: నా రెండు పళ్ళు ఫ్రీ గా పీకుతారా? ఫీజక్కర్లేదా?
పంటి డాక్టరు: ఔను! అయితే తక్కిన  పళ్ళన్నీ పీకించుకోవాలి. కట్టుడు పళ్ళు నా చేతే కట్టించుకోవాలి.  అదీ కండిషను
పేషంటు: ఎంతవుతుంది, కట్టుడు పళ్ళకి?
పంటి డాక్టరు:   పాతిక వేలు!

రామ్ రావ్: నా వైఫ్ ప్రేగ్నెంటైంది. టెస్ట్ కన్ఫర్మ్ ఐంది. వర్రీగా వుంది  
కిషన్ రావ్: కంగ్రాట్స్! వర్రీ ఎందుకు?
రామ్ రావ్: నా బొంద! నాకు పిల్లలు పుట్టరని డాక్టరు ఎప్పుడో చెప్పేశాడు కదా! అందుకే వర్రీ అవుతున్నాను!

ఋషి పత్ని: ఇంద్రుడు కలలో కొచ్చాడు స్వామీ!
ఋషి: అయితే నేనలా నదీ తీరానికి వెల్లొచ్చెదా?
మరిన్ని శీర్షికలు
Home Remedies