నీనా దావులూరి.. ఇండియాలోని గ్లామర్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడీమె నామజపం చేస్తోంది. విజయవాడకు చెందిన నీనా దావులూరి కుటుంబం, అమెరికాలో సెటిలైపోయింది మూడు దశాబ్దాల క్రితం. మిస్ అమెరికా పోటీల్లో విజయం సాధించడం ద్వారా నీనా దావులూరి వార్తల్లో వ్యక్తి అయ్యింది.
ఆమె కోసం బాలీవుడ్, టాలీవుడ్తోపాటు, కోలీవుడ్ సినీ పరిశ్రమ కూడా ఎదురు చూస్తోందిప్పుడు. ‘ప్రభాస్ అంటే ఇష్టం..’ అని మిస్ అమెరికాగా ఎంపికయ్యాక నీనా దావులూరి తన మనసులో మాట బయటపెట్టింది. దాంతో, సినీ పరిశ్రమపై ఆమె ఆసక్తి ఎంతో స్పష్టమవుతోంది. నీనా దావులూరి తెలుగమ్మాయి కావడంతో సహజంగానే ఆమెపై తెలుగు సినీ దర్శక నిర్మాతల ఆసక్తి వుంటుంది. ఆ ఆసక్తితోనే, ఆమెతో సినిమాలు చేయడానికి అప్పుడే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారట కూడా.
గద్దె సింధూర కూడా అందాల పోటీల ద్వారా లైమ్లైట్లోకొచ్చిన తెలుగమ్మాయే. ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అందాల భామలు, అందాల పోటీల్లో ఓ వెలుగు వెలిగారుగానీ, చాలా తక్కువమంది మాత్రమే గ్లామర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. మరిప్పుడు నీనా దావులూరిపై సినిమా పరిశ్రమ కన్నేయడంతో, ఆమె నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి.
|