Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Chandra Bose

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌: చిత్ర సమీక్ష

Movie Review - Mahesh

చిత్రం: మహేష్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, డింపుల్‌ చొపాడే, జగన్‌, లివింగ్‌స్టన్‌, ఉమా పద్మనాభన్‌, శ్రీనాథ్‌, స్వామినాథన్‌ తదితరులు
ఛాయాగ్రహణం: రానా
సంగీతం: గోపీ సుందర్‌
నిర్మాణం: గుడ్‌ సినిమా గ్రూప్‌, ఎస్‌.కె. పిక్చర్స్‌
నిర్మాతలు: ఆంటోనీ నవాజ్‌, సత్య నారాయణన్‌, ఆర్‌. మాధవ్‌కుమార్‌, సురేష్‌ కొండేటి
దర్శకత్వం: ఆర్‌. మాధవన్‌కుమార్‌
విడుదల తేదీ: 20 సెప్టెంబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే:
శివ (సందీప్‌ కిషన్‌) చదువుపైనే కాదు, జీవితంపైన కూడా పెద్దగా శ్రద్ధ లేని స్టూడెంట్‌. కాలేజీలో సంధ్య (డింపుల్‌) మీద మనసు పారేసుకుంటాడు. అలా వారిద్దరి మధ్యా ప్రేమ పెరుగుతుంది. ఓ సందర్భంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతాయి. వారిద్దరి పెళ్ళీ జరుగుతుంది, ఓ కొడుకు పుడతాడు కూడా. అయినా శివకి జీవితం పట్ల కాస్తయినా సీరియస్‌నెస్‌ పెరగదు. ఈ టైమ్‌లోనే భార్యపై అనుమానం పెరుగుతుంది శివలో. తన భార్యకు గతంలో మహేష్‌ అనే ఓ ప్రేమికుడు వుండేవాడని, అతని ద్వారానే తన భార్యకు కొడుకు పుట్టాడనీ అనుమానిస్తాడు శివ. ఇంతకీ మహేష్‌ ఎవరు? శివ అనుమానం నిజమేనా? ఇవన్నీ తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
సందీప్‌ కిషన్‌ బాగా చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడతడు. యాక్టివ్‌గా, ఎనర్జీతో కన్పించాడు సందీప్‌ కిషన్‌ ‘శివ’ పాత్రలో. డింపుల్‌ క్యూట్‌గా ఆకట్టుకుంది. నటనలోనూ మంచి మార్కులేయించుకుంది. జగన్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని పాత్ర సినిమాకి హైలైట్‌. ఉమా పద్మనాభన్‌, శ్రీనాథ్‌, లివింగ్‌స్టన్‌ తదితరులంతా తమ పాత్రలకు అవసరమైన మేర న్యాయం చేశారు.

ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగేలా కథాంశాన్ని కొంతమేర బాగానే టాకిల్‌ చేసినా, కథలోని పేస్‌ కొనసాగించడంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించలేకపోయాడు. ఫస్టాఫ్‌ అంతా కామెడీ, రొమాంటిక్‌ సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా ఆ మూడ్‌ని కొంతవరకు మెయిన్‌టెయిన్‌ చేసినా, సీరియస్‌నెస్‌ పెరిగి, వేగం తగ్గుతుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. సంగీతం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమా రిచ్‌గానే తెరకెక్కింది.

మాటల్లో చెప్పాలంటే: ఈ మహేష్‌.. జస్ట్‌ మహేష్‌ మాత్రమే

అంకెల్లో చెప్పాలంటే:  2/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu