‘స్నేహగీతం’, ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మధుర శ్రీధర్, నిర్మాతగా ఓ సినిమాని రూపొందిస్తున్నారు. తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.బి. మంజునాథ్ కి దర్శకుడిగా అవకాశం కల్పించారు మధుర శ్రీధర్. షిర్డీ సాయి కంబైన్స్ బ్యానర్ పై ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ అనే చిత్రాన్ని డాక్టర్ ఎం.వి.కె. రెడ్డితో కలిసి సంయుక్తంగా మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘గో తెలుగు డాట్ కామ్’ సమర్పణ. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. ‘గో తెలుగు’ సంపాదకుడు సిరాశ్రీ ఈ చిత్రానికి పాటల రచయిత. ‘జె’ సినిమాటోగ్రఫీ, నివాస్ మాటలు అందిస్తున్నారు. అక్టోబర్ రెండో వారంలో ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ సినిమా ప్రారంభమవుతుంది. నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని దర్శకుడు మంజునాథ్ వెల్లడించారు.
టెక్నాలజీ, ఇంటర్నెట్ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, వక్రమార్గంలో ఉపయోగిస్తే అన్నే నష్టాలున్నాయన్న విషయం ఈ సినిమా ద్వారా చెప్పనున్నారట. టెక్నాలజీని స్వార్ధం కోసం తప్పుగా ఉపయోగిస్తే వచ్చే పరిణామాలు మన జీవితాల్ని ఎంత ప్రమాదకరంగా మార్చుతాయో ఈ చిత్రం ద్వారా చెబుతున్నామన్నారు నిర్మాత మధుర శ్రీధర్.
|