యూత్ ని టార్గెట్ చేస్తూ, ‘సెకెండ్ హ్యాండ్’ అనే ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై మొదట ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకపోయినా, ఆడియో విడుదల వేడుక తర్వాత టాలీవుడ్ లో ఈ సినిమా గురించిన చర్చ బాగానే జరుగుతోంది.
ఆడియో విడుదల వేడుకలో దర్శకుడు కిషోర్ మాటలు ప్రామిసింగ్ గా వున్నాయంటున్నారు తెలుగు సినీ ప్రముఖులు. ఫిలింనగర్ డిస్కషన్స్ లో కిషోర్ గురించి పలువురూ చర్చించుకుంటున్నారు. కిషోర్, ‘స్నేహగీతం’ సినిమాకి స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశాడు. అతనిప్పుడు ఈ ‘సెకెండ్ హ్యాండ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బివిఎస్ రవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పెద్దగా అంచనాల్లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు నమోదు చేస్తుండడంతో, ‘సెకెండ్ హ్యాండ్’ కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తే, దర్శకుడిగా కిషోర్ సంచలన దర్శకుడిగా పేరొందుతాడు.
|