సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంటుంది. ఆయన సినిమా వస్తే చాలు, అంతకు ముందు వచ్చిన సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, కొత్త సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశాన్నంటుతాయి. వర్మ తాజా చిత్రం ‘సత్య`2’ ఇందుకు మినహాయింపు కాదు.
శర్వానంద్ హీరోగా వర్మ ‘సత్య`2’ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆడియో విడుదల ఇటీవలే జరిగింది. ఈ కార్యక్రమంలో వర్మ మీద సెటైర్ వేస్తూ ఓ కామెడీ స్కిట్ చేశాడు జూనియర్ వర్మ (శంకర్). ‘జబర్దస్త్’ కామెడీ షోలో ‘షకలక శంకర్’గా అందర్నీ అలరిస్తోన్న శంకర్, ‘సత్య`2’ పాటల వేడుకలో తనదైన స్టయిల్లో వర్మని ఇమిటేట్ చేసేశాడు.
దీనిపై వర్మ స్పందనని అడిగితే, ‘రివ్యూ రాస్తాను’ అన్నారాయన. ఇలాంటి విషయాల్ని వర్మ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారన్న విషయం విదితమే. మేనరిజమ్స్ కి కొంచెం ‘అతి’ కలిపితేనే అది కామెడీ స్కిట్ అవుతుంది కాబట్టి, స్కిట్ సూపర్బ్ గా వచ్చిందని వర్మ చెప్పడం గమనార్హం. అదలా వుంచితే, ఆడియో విడుదల వేడుకకు వచ్చినవారంతా సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘గో తెలుగు’ సంపాదకుడు సిరాశ్రీ ఈ చిత్రానికి ఆరు పాటలు వ్రాసారు
|