‘సైమా’ అవార్డుల ఫంక్షన్ దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు టాలీవుడ్ సినీ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ కూడా దుబాయ్ కి వెళ్ళారు. సహజంగా పాటల రచయితలకు పెద్దగా జనంలో క్రేజ్ వుండదు. మహా మహులకే ఒకప్పుడు గుర్తింపు వుండేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు, సినిమాకి సంబంధించిన ప్రతి విభాగానికి చెందినవారినీ సినీ అభిమానులు గుర్తుపెట్టుకుంటున్నారు.
అలా, దుబాయ్ లో ల్యాండ్ అయిన భాస్కరభట్ల రవికుమార్ ని అక్కడి ఎయిర్ పోర్ట్ లో వివిద హోదాల్లో పనిచేస్తున్న తెలుగువారు చుట్టుముట్టేశారు. పాటల రచయిత భాస్కరభట్ల వచ్చారంటూ ఆయన వెంట పడి మరీ, ఆయన్ను అభినందించడం, ఆయనతో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం చేశారు.
అభిమానులు తనను చుట్టుముట్టడంతో, ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా వారందరితోనూ మాట్లాడారు భాస్కరభట్ల. ఆటోగ్రాఫ్ లు ఇచ్చి, వారితో ఫొటోలు దిగిన భాస్కరభట్ల, అభిమానుల అభిమానాన్ని తానెప్పుడూ మర్చిపోలేనన్నారు.
|