కళాప్రపూర్ణ పాతూరి నాగబూషణం.జయంతి నేడు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కళాప్రపూర్ణ పాతూరి నాగబూషణం.జయంతి నేడు.

 

కళాప్రపూర్ణ పాతూరి నాగబూషణం.జయంతి నేడు.
నిరాక్షరాస్యతా నిర్ములనకు నడుబిగించిన నాటితరం మనకీర్తిశిఖరం పాతూరివారు గుంటూరుజిల్లా తెనాలి తాలూకా పెదపాలెంలో 1907ఆగస్టు20 న జన్మించారు.నిరక్షరాస్యత జాతీయ జీవనమును నిర్విర్ణంచేస్తుందననీ,ప్రజలు అక్షరాస్యులైతేతప్ప,జాతి పురోగతి సాధించదని భావించి తెలుగు నేలపై ఉద్యమించినవారు గాడిచర్ల హరిశర్వోత్తమరావుగారైతే దానిని బలపరిచి,నిరంతరకృషిసలిపినవారు పాతూరివారు.ఇలా విద్యావంతులు అందరు శ్రమిస్తే స్వతంత్రభారతలో నిరాక్షరాస్యత నిర్ములించ వచ్చు అన్నారు ఆచార్యరంగాగారు.
శనివారపుసుబ్బారావు,ముదిగంటజగ్గన్నశాస్త్రి,పాతూరినాగబూషణం గార్లు తెలుగు సేవాత్రిమూర్తి రత్నాలు.పాతూరివారు దీక్షతో ప్రతిపల్లెన,వాడవాడలా గ్రంధాలయోద్యమం చేపట్టారు.వీరికి మైసూరు,బరోడా సంస్ధానాధిపతులు గ్రంధాలయోద్యమానికి సహకరించగా ఆంధ్రాలో సహకారం అందలేదు.పట్టువదలని విక్రమార్కునిలా నిరంతర కృషితో కొంతవరకు ఫలితాలుసాధించారు.తెలుగునేలపై గ్రంధాలయాల కొరకు కృషి సల్పిన రూపశిల్పి పాతూరివారే.వీరు గ్రంధాలయశాస్త్ర ప్రధమ పాఠములు,గ్రంధాలయ సూత్రాలు,గ్రంధాలయములు-పఠనా మందిరములు,తెలుగుపుస్తకాలవర్గీకరణ, వంటి వందకుపైగా రచనలు చేసారు.'గ్రంధాలయసర్వస్వం'అనేమాసపత్రికను స్వియసారధ్యంలో మూడుసంవత్సరాలు నడిపారు.గ్రంధాలయోద్యమానికి ఐదు దశాబ్దాలు సారధ్యంవహించారు.వీరిసేవలు గుర్తించిన ఆంధ్రవిశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ'బిరుదునిచ్చిగౌరవించింది.వీరుచూపించిన బాటలోవీరి ఆశయసాధనకు 'గాడిచర్లవారు' ' అయ్యంకివెంకటరమణయ్యగారు' 'వెలగావెంకటప్పయ్య'వంటి గ్రంధాలయోద్యమకారులు పయనించారు.స్వరాజ్యం నాజన్మహక్కు అను నినాదం ఫలించాలిఅంటే ప్రజలు విద్యావంతులు కావాలి అనిభావించి,కలకత్త కాంగ్రెస్ సభల్లో ప్రతిపాదించి,ఓఉద్యమం లేవనెత్తిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అందుకే ఆయనను లోకమాన్య అన్నారు.దాదాబాయి నౌరోజీ,మహత్మగాంధి వంటి వారు ఆయన ఆశయాలను బలపరిచారు.అప్పుడు ప్రతి ఉరిలో రాత్రిబడులు వయోజనులకై నడిపేవారు.ఈఉద్యమాన్ని తీవ్రత చేసింది గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు. తిలక్ గారు 1906 లో ప్రారంభిస్తే 1908లో గాడిచర్లవారు ముందుకునడిపి,పలు జాతీయ పోరాటాలలో పాల్గోని తెలుగు నాట తొలిరాజకీయ ఖైదీగా చెరసాలశిక్ష అనుభవించింది గాడిచర్లవారే.వీరిని గ్రంధాలయోద్యమానికి ఆహ్వానించింది పాతూరివారే. అలా పాతూరివారు తమబంధువైన విజయవాడ పడమటిలంక వాస్తవ్యులు కొమ్మా సీతా రామయ్యగారి ఆర్ధిక సహాయంతో గ్రంధాలయోద్యమ సంఘం భవన నిర్మాణంచేసి దానికి గాడిచర్లవారి పేరు పెట్టారు.గ్రంధాలయోద్యమానికి మూలపురుషుడు అయిన పాతూరి వారు 1987జూలై 24 తుదిశ్వాసవిడిచారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు