మీ పేరుకే బంగారం - Shanta K.

మీ పేరుకే బంగారం

పలుకే బంగారం మనిషికి భావ వ్యక్తీకరణ దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి ప్రభావం మరింతగా ఉంటుంది._ _వాగ్భూషణం భూషణం_ _కేయూరాణి న భూషయంతి పురుషం_ _హారా న చన్ద్రోజ్జ్వలా_ _న స్నానం న విలేపనం న కుసుమం- నాలంకృతా మూర్ధజాః_ _వాణ్యేకా సమలంకరోతి పురుషం- యా సంస్కృతాధార్యతే -క్షీయన్తే ఖలు భూషణాని సతతం -వాగ్భూషణం భూషణం._ ఇది భర్తృహరి నీతి శతకంలో శ్లోకాల్లో ఒకటి. *వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం* అన్నాడు భర్తృహరి._ చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సంస్కారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. సరళమైన, సౌమ్యమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,_ _నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను > అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది.. మాటలు పదునైనవి కనుక జాగ్రత్తగా వాడడం అలవాటు చేసుకుని, మితంగా, హితంగా మాట్లాడితే మనిషికి గౌరవమూ కాకుండా ఎప్పుడూ మంచే జరుగుతుంది. పెదవి దాటితే ప్రృథివి దాటుతుంది అనే ఆర్యోక్తి కి ఎంతో అర్ధం వుంది. ఆలోచించకుండా మాట్లాడటం, తొందరపాటు తో అహంకారపూరితమైన మాటలు ఎదుటి వారిని గాయపరచగలవు, నాలుగు మంచి మాటలు గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.. తొందరపాటు మాటంట చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే కొందరు మనసుతో, శరీరంతో మాట్లాడతారు.వారి అభిమానాన్ని , ఆప్యాయత ని వారిని ఒకసారి కలసినవారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎగతాళి,అవమానం, కించపర్చడం లాంటివి ఆయుధాలు గా ఉపయోగించే వారిని మనం విస్మరిద్దాము. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద. ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.ఎంతో విముఖంగా ఉన్న వారిని దగ్గరగా చేర్చాను గలదు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటతీరు మాట విలువ తెలిసినవారికి శత్రువులే ఉండరు.