పెండ్యాల నాగేశ్వరరావు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పెండ్యాల నాగేశ్వరరావు

పెండ్యాల వారి జయంతి సందర్బంగా .(6/4/1917)

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపోకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడని పెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు (1955), ముద్దుబిడ్డ (1956), భాగ్యరేఖ (1957), జయభేరి (1959), మహామంత్రి తిమ్మరుసు (1962), శ్రీకృష్ణార్జునయుద్ధం (1963),

రాముడు భీముడు (1964), శ్రీ కృష్ణ తులాభారం (1966) కొన్ని చాలు - వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

పెండ్యాలగారి తండ్రి సీతారామయ్యగారు సంగీతం మాస్టారు. హార్మోనియమ్‌ వాయించడంలో దిట్ట. హరికథ, నాటకం హార్మోనియమ్‌ వాయిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పేవారు. పిల్లవాడైన నాగేశ్వరరావుకీ ఆ పాఠాలు రుచించాయి. అబ్బాయి ఉత్సాహం చూసి, తండ్రిగారు శాస్త్రీయమైన గాత్ర సంగీతాన్నీ, ఇంకో పక్క హార్మోనియమ్‌నీ నేర్పారు. నాగేశ్వరరావు వీధిబడి నుంచి ఎలిమెంటరీ స్కూలుకీ, ఎలిమెంటరీ స్కూలు నుంచి హైస్కూలుకూ మారాడు. ఒకవేపు చదువులో బడులు మారుతూ, ఇంకోవేపు వరసల పలుకుబడులు సాధించసాగాడు. స్కూల్లో ప్రార్థనాగీతాలు పాడడాలు, చిన్నచిన్న వేషాలువేస్తూ పద్యాలు పాడడాలూ చేసేవారు. తండ్రిగారు ఊళ్ళో లేకపోతే, ఆ శిష్యులకి తానే గురువై సంగీతం నేర్పించేవారు. తరువాత సంగీతం పట్ల శ్రద్ధ, ఆసక్తులు నాగేశ్వరరావుని రంగస్థలనటుణ్ని చేశాయి, హార్మోనిస్టునీ చేశాయి.

తొలిసారిగా ఆయన, కాళ్ళు అందకపోయినా లెగ్‌ హార్మోనియమ్‌ వాయించిన నాటకం శ్రీకృష్ణతులాభారం. అప్పుడు వయస్సు పదమూడేళ్లు! మరుసటి ఏటినుంచి వేషాలు వెయ్యడం కూడా ఆరంభమైంది. శ్రీకృష్ణతులాభారం లో జాంబవతి పాత్రధరణతో నటిగా ఆరంభమైంది రంగస్థలజీవితం. 1966లో డి.రామానాయుడు తీసిన శ్రీకృష్ణతులాభారం చిత్రంలో పామరుల భాషలో ఆ చిత్రంలోని పాటల్నీ, పద్యాల్నీ ఆయన అద్భుతంగా స్వరపరిచారు.

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆ చిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారు గనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికి పూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి (1948)కి పెండ్యాలకు సంగీత దర్శకుడుగా అవకాశం ఇచ్చారు ప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైన పాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీతదర్శకుడుగా స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీ గాయకుల చేత పాడించడం - పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగా వినియోగించుకునే సంగీత దర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరి మీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడు లేడు!. పెండ్యాల గారి వేల పాటల్లో - అది క్లబ్బుపాటైనా అందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీ పాటని అనుసరించినా, పాశ్చాత్య ధోరణిని అనుకరించినా అందులో తెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీ గాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

చిత్రసమాహారం.

ద్రోహి (1948) (మొదటి సినిమా) మొదటి రాత్రి (1950) దీక్ష (1951) మేనరికం (1951) కన్నతల్లి (1953) జ్యోతి (1954) మేనరికం (1954) దొంగరాముడు (1955) : భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ అంతే కావాలి (1955) మేలుకొలుపు (1956) పెంకి పెళ్ళాం (1956) ముద్దుబిడ్డ (1956) భాగ్యరేఖ (1957) : నీవుండే దా కొండపై నా స్వామి నేనుండే దీ నేలపై అక్కాచెళ్ళెళ్ళు (1957) శాసన సభ్యులు (1957) : నమోనమో బాపూ; నీ ఆశా అడియాశా సౌభాగ్యవతి (1957) శ్రీకృష్ణ గారడి (1958) గంగా గౌరి సంవాదము (1958) అత్తా ఒకింటి కోడలే (1958) జయభేరి (1959) : మది శారదాదేవి మందిరమే; యమునా తీరమునా సంధ్యా సమయమునా; రసికరాజ తగువారముకామా; రాగమయీ రావే అనురాగమయీ రావే శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) : శేష శైలావాస శ్రీ వేంకటేశా నిత్య కల్యాణం పచ్చ తోరణం (1960) మహాకవి కాళిదాసు (1960) : మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం భక్త శబరి (1960) భట్టి విక్రమార్క (1960) : ఓ నెలరాజా, వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ వాగ్దానం (1961) : వెలుగు చూపవయ్యా రామా; శ్రీనగజాతనయం సహృదయం వెలుగు నీడలు (1961) : పాడవోయి భారతీయుడా; కలకానిది నిజమైనది బావా మరదళ్లు (1961) : ముక్కోటి దేవతలు ఒక్కటైనారు కృష్ణప్రేమ (1961) జగదేకవీరుని కథ (1961) : శివశంకరీ... శివానందలహరీ మహామంత్రి తిమ్మరుసు (1962) : తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా చిట్టి తమ్ముడు (1962) శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) : అన్నీ మంచి శకునములే; అలిగితివా సఖీప్రియా పరువు ప్రతిష్ఠ (1963) ఈడు జోడు (1963) : ఇదేమి లాహిరీ ఇదేమి గారడీ అనురాగం (1963) రాముడు భీముడు (1964) : ఉందిలే మంచికాలం ముందుముందునా; దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ శభాష్ సూరి (1964) రక్తతిలకం (1964) ప్రచండ భైరవి (1965) ఉయ్యాల జంపాల (1965) : కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది సత్య హరిశ్చంద్ర (1965) : హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే ప్రమీలార్జునీయం (1965) శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ (1966) : వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా శ్రీకృష్ణ తులాభారం (1966) : ఓహొ మోహనరూపా కేళీ కలపా; మీరజాలగలడా నా ఆనతి ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968) పంతాలు పట్టింపులు (1968) భాగ్యచక్రము (1968) : నీవు లేక నిముషమైనా నిలువజాలనే గ్రామ దేవతలు (1968) పాప కోసం (1968) బందిపోటు దొంగలు (1968) మా నాన్న నిర్దోషి (1970) పెళ్లి సంబంధం (1970) శ్రీకృష్ణ విజయము (1971) మనసు మాంగల్యం (1971) : ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో ఆనంద నిలయం (1971) నా తమ్ముడు (1971) శ్రీకృష్ణ సత్య (1971) : అలుకమానవే చిలుకల కొలికిరు; ప్రియా ప్రియా మధురం మాతృమూర్తి (1972) కోడెనాగు (1974) : సంగమం సంగమం అనురాగ సంగమం; ఇదే చంద్రగిరీ, శౌర్యానికి గీచిన గిరి భూమికోసం (1974) : ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా దీక్ష (1974) ధనవంతుడు గుణవంతుడు (1974) వేములవాడ భీమకవి (1976) శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) : ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట కొల్లేటి కాపురం (1976) సుప్రభాతం (1976) చాణక్య చంద్రగుప్త (1977) : చిరునవ్వుల తొలకరిలో; ఎవరో ఆ చంద్రుడెవరో దాన వీర శూర కర్ణ (1977) : ఏ తల్లి నిను కన్నదో, చిత్రం! భళారే, విచిత్రం! శ్రీరామ పట్టాభిషేకం (1978) : ఈ గంగకెంత దిగులు - ఈ గాలికెంత గుబులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979) గాలివాన (1979) ప్రియబాంధవి (1979) సృష్టి రహస్యాలు (1980) ధర్మవడ్డీ (1982) కళారంజని (1985) ప్రేమ దీపాలు (1987)

విశేషాలుసవరించు

మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనా నిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు. జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్‌లో పాడగలిగితే బావుంటుంది - ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే - ‘ఒకే టేక్‌లో మొత్తం పాడతాను చూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్‌కి వెళ్లకుండా ఆ పాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతి సందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు. సినిమాల్లో కూడా, పద్యాలు చదవడంలో ‘నాటకబాణీ కనిపింపచెయ్యడం పెండ్యాలగారి తర్వాతే ఎవరైనా. ఆయన నాటకరంగానికి, ముఖ్యంగా పౌరాణిక నాటరంగానికి అలా అతుక్కుపోయారు. ఎంతమంది నటీనటులచేతనో, పద్యాలూ, పాటలూ ప్రాక్టీసు చేయించి, ఆ విధానాన్ని పట్టుబడేలా చేసినవారు పెండ్యాలవారు. ఆ నాటకాల టైములోనే, ఆయన ప్రజ్ఞ గమనించిన దర్శకనిర్మాత కడారు నాగభూషణం గారు, తల్లి ప్రేమ చిత్రానికి సహాయకుడుగా, హార్మోనిస్టుగా తీసుకున్నారు. ఆ సినిమాకి దినకర్‌రావు, ఎస్‌.వి.వెంకటరామన్‌ సంగీతదర్శకులు. ఒకరు కన్నడం, ఇంకొకరు తమిళం కావడంతో తెలుగు విషయంలో ఇద్దరూ పెండ్యాల మీదనే ఆధరపడ్డారు. రాజరాజేశ్వరీ సంస్థలో పెండ్యాల కాలుపెట్టి తర్వాత చిత్రం సతీసుమతి కీ పని చేశారు. ఈ రెండు సినిమాలూ నాగేశ్వరరావుకి మంచి అనుభవం కల్పించాయి. యుద్ధభయంతో మద్రాసు ఖాళీ చెయ్యడంతో, మళ్లీ నాటకరంగమే ఆశ్రయమైంది. దుక్కిపాటి మధుసూధనరావుగారి ఎక్సెల్షియర్‌ డ్రమోటిక్‌ అసోసియేషన్‌లో పెండ్యాల నాగేశ్వరరావు సంగీతదర్శకుడైతే, అక్కినేని నాగేశ్వరరావు నాయికా పాత్రధారి. ఉన్న సినిమా ఆనుభవంతో తానుగా పాటలు స్వరపరచి రంగస్థలం మీద పాడించి ‘ఆహా!’ అనిపించారు పెండ్యాల. అలా కొన్ని నాటకాలు, కొంత కాలమూ జరిగిన తర్వాత సీతారామ జననం చిత్రానికి అక్కినేని వెళ్లిపోవడంతో ఆ నాటకసంస్థ మూతపడింది. సేకరణ