హస్య జంట రేలంగి - గిరిజా . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

హస్య జంట రేలంగి - గిరిజా .

హస్య జంట రేలంగి - గిరిజ .

తేలుగు నాటకరంగ చరిత్ర ప్రారంభం గురించి చెప్పడం కష్టం.చాళిక్యుల పాలనకు ముందునుంచే తెలుగునాట నాటక ప్రదర్మనలు ఏదో ఒకరూపంలో ఉన్నట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ' అంకమాలిక ' అనే గేయనాటికలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది.

1860 లోశ్రీకోరాడ రామచంద్రశాస్త్రిగారి ' మంజరిమధుకరీయం ' తో తెలుగునాటకరంగం ప్రారంభం జరిగిందని పరిశోధకులు నిర్ఢారించారు.

ఎందరో నటతేజోమూర్తులు సగర్వంగా నాటక రంగంనుండి వేదికనుండి వెండితెరకు వెళ్ళారు.అలావెళ్ళినవారిలో ఒకరైన రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరిజిల్లా రావులపాడులో 1919ఆగస్టు 9 న జన్మించారు . . వీరితండ్రి రామస్వామి హర్మోనియం పెట్టెలు రిపేరుచేస్తుంటే తను సహాయపడేవారు.పెద్దగా చదువు లేకపోయినా,నటనపట్ల ఆసక్తితో కాకినాడలోని ' యంగ్ మ్యాన్స్ హ్యాపీక్లబ్ ' లోచేరి పలుప్రదర్సనలు యిస్తుండేవారు.నాటి ప్రముఖ సిని,స్టేజి హాస్యనటుడు జోగినాధం గారివద్ద శిష్యరికం చేయమని ప్రముఖ సినీ దర్మకుడు చిత్తజల్లు పుల్లయ్యగారు సలహా యివ్వడంతో అలానే చేసారు.

(1935-ఏప్రిల్ 12)న విడుదలైన ' శ్రీకృష్ణతులాభారం ' చిత్రంలో రేలంగి తొలిసారిగా వసుదేవుని పాత్రలో నటించి 75 రూపాయల పారితోషికం పొందారు.ఇంకాఈచిత్రంలో ' ఋష్యేంద్రమణి ' ' కాంచనమాల ' 'లక్ష్మిరాజ్యం'వంటివారుకూడా పరిచయం చేయబడ్దారు. అనంతరం మీర్జాపురం రాజావారునిర్మించిన ' గొల్లభామ ' (1949) లో నటించారు (అంజలిదేవికి ఇది తొలి చిత్రం)ఈరెండు చిత్రాలకు రేలంగి సహాయ దర్మకుడిగా పనిచేసారు.' గుణసుందరికథ ' నటించారు.(15-3-1951) నవిడుదలైన ' పాతాళభైరవి ' చిత్రంలో రాణిగారు(విమలారావు ) తమ్ముడిగా నటిస్తూ ' తాళలేనే నేతాళలేనే '-'వినవేబాల నాప్రేమగోల ' పాటలు స్వయంగా పాడుకున్నారు. అనంతరం వాహినివారి

' పెద్దమనుషులు ' చిత్రంలో తిక్కశంకరయ్య పాత్ర అద్బుతంగా పోషించారు.

(12-1-1955) నవిడుదలైన విజయావారి ' మిస్సమ్మ' చిత్రంలో దేవయ్య పాత్ర పోషిస్తూ ' ధర్మంచెయిబాబు ' - ' సీతారాం సీతారాం 'అనే పాటలు స్వయంగా పాడుకున్నారు.

(14-1-1959)విడుదలైన ' అప్పుచేసి పప్పుకూడు ' చిత్రంలో భజగోవిందం పాత్ర బాగానటించారు. (19-4-1962)విడుదలైన ' భీష్మ' (1962) విడుదలైన ' చెంచులక్ష్మి' చిత్రాలలో నారదుని పాత్రధరించారు. అంజలిదేవితో ' సతీసక్కుబాయి ' ,ఎస్ .వరలక్ష్మిగారితో ' మామకు తగ్గఅల్లుడు ' (1960)లో ' సావిత్రి గారితొ కథానాయకుడిగా నటించారు.

తనకుమారుని పేరుమీద ' సమాజం ' అనే చిత్రం నిర్మించారు. తాడేపల్లిగూడెంలో ' రేలంగి మందిర్ ' అనేసినిమా ధియోటర్ నిర్మించారు. వీరికుమారుడు సత్యనారాయణబాబు బాలనటుడుగా నటించినచిత్రం

' రాజయోగం ' (1968)

ఆరోజుల్లో రేలంగికి జరిగినన్ని సన్మానాలు మరే నటుడికి జరుగలేదు.ఆస్ధానకవి శ్రీపాదకృష్ణమూర్తి రేలంగికి ' హాస్యనటచక్రవర్తి ' బిరుదు ప్రదానం చేసారు.సినీ నటులలో తొలి ' పద్మశ్రీ ' అవార్డు గ్రహితగా గుర్తింపు పొందారు.

తొలితరం నటుడిగా జీవితాన్ని ప్రారంభించి 500 పైగా చిత్రాలలో నటించినా ,తనఉన్నతికి కారణమైన నాటకరంగాన్ని మరువకుండా, తరచూ ప్రదర్మనలు యిస్తూ ' చింతామణి ' నాటకంలో ' సుబ్బిశెట్టి ' పాత్రవంలసార్లు పోషించారు.అలానే (11-4-1956) విడుదలైన 'చింతామణి ' చిత్రంలో సుబ్బిశెట్టి పాత్రపోషించారు.ఇంకా ' మనదేశం ' (24-11-1949) ' జయసింహ ' (21-10-1955) ' మాయబజార్ '

(27-3-1957) ' వీరకంకణం ' (16-51957) ' వద్దంటేడబ్బు'

(25-6-1954) ' రాజుపేద '(6-11-1959) 'బండరాముడు'

(27-5-1960) ' రాణిరత్నప్రభ ' (9-8-1961)' జగదేకవీరునికథ '

(7-6-1962) వంటి చిత్రాలలో తన నటవైదుష్యంతో నవ్వించిన రేలంగి (27-11-1975) న కన్నుమూసారు.

హాస్యనటి గిరిజ.

ప్రముఖ సినినటి దాసరి తిలకం (1946)లో వచ్చిన ' వరూధిని '

(ఇది s.v.రంగారావు తొలిచిత్రం) చిత్రంలో కథానాయకి దాసరి తిలకం వీరి కుమార్తె గిరిజ 1938 లో చకృష్ణాజిల్లా కంకిపాడు లో జన్మించినఈమె ఏలూరు లో చదువుతూ తన 11 వఏట తల్లితోపాటుగా మద్రాసు తరలి వచ్చారు. ఏ.వి.యం .రంగూన్ రామారావు వద్ద నటనలో శిక్షణ పొందారు.(1950)లో హాస్యనటుడు కస్తూరిశివరావు నిర్మించిన ' 'పరమానందయ్యశిష్యులకథ ' చిత్రంలోనూ,(1951) లో వచ్చిన 'స్త్రీసాహాసం ' అనేరెండు చిత్రాలలోనూ అక్కినేని సరసన నటించారు. అదేసంవత్సరంవచ్చిన ' పాతాళభైరవి ' చిత్రంలో ' నరుడా ఏమి నీకోరిక ' అంటూ అందరిని అలరించారు.అలా ' మాయింటిమహలక్ష్మి' (1959) 'ఎం.ఎల్ .ఏ.'(1957) ' వెలుగునీడలు ' (1961) ' మంచిమనసుకు మంచిరోజులు ' (1958) ' అత్తాఒకింటికోడలే ' (1958) ' కులదైవం ' (1960) 'మనోహర '(1959) ' అన్నపూర్ణ ' (1960) ' జగదేకవీరునికథ ' (1961) ' ఆరాధన ' (1962) ' అప్పుచేసిపప్పుకూడు ' (1959) 'గుడిగంటలు ' (1964) వంటి వందలాది చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు.

జీవితంలో ఆర్ధికంగా స్ధిరపడి పోయిస్ గార్డెన్ లో రాజభవనం వంటి ఇల్లు ,మూడు ఖరీదైన కార్లు అభిమానులు , నిర్మతల రాకపోకలతో కళకళలాడు తూఉండే ఆయింటిలో లక్ష్మిదేవిలా ఉండేది గిరిజ. అక్కినేని, నందమూరి, హరినాథ్ ,రేలంగి, రమణమూర్తి, జగ్గయ్య, చలం, శివాజిగణేషన్ వంటిహేమాహెమీలతోనటించింది. సన్యాసిరాజు గారితో వివాహం జరిగింది.వారికిఓపాప జన్మించింది.సన్యాసిరాజు సోంతంగా రెండు సినిమాలు నిర్మించి యావదాస్తి పోగోట్టి ఎటో వెళ్ళిపోయాడు. అప్పులవాళ్ళు కార్లు,ఇల్లు స్వాధీనపరచుకున్నారు.చంటిబిడ్డా,తల్లితో, చూళైమేడు లోని అద్దెయింటిలోనికి మారింది సినిమాలు తగ్గిపోవడం రేలంగి,చలంవంటి నటులు పలువురు ఆదుకున్నారు.చాలామంది సిని కళాకారుల జీవితాలు .ఎంతోగొప్పనటులుగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న కళాకారులు లౌకిక జీవితచిత్రంలో చిత్రమైన చిత్రాలుగా మిగిలిపోయారు. పాత్రపోషణలో ..నటనను సమర్ధవంతంగా వ్యాపారంచేసుకో గలిగిన వారుమాత్రం ఆర్ధకంగా స్ధిరపడ్డారు.

ఒకరోజుఉదయం తనకూతురు పేర పూజచేయించాలని గుడికివెళుతూ మెట్లుదిగుతూ కాలుజారి ప్రాణాలు కోల్పోయింది గిరిజ.పైప్లాట్ లో ఉన్న దర్మకుడు బి.గోపాల్ ఆమె అంత్యక్రియలు జరిపించాడు.తనకు నచ్చినవాడిని వివాహం చేసుకున్న గిరిజ కుమార్తే నేడు సలీమాగా తనపేరు మార్చుకుంది.

సేకరణ :